Student suicide : మేధస్సును పంచేవారు మనిషి, మనస్సును పంచేవారు మహర్షి అన్నారు పెద్దలు. మన విద్యాలయాల్లో అంతో ఇంతో మేధస్సును అందిస్తున్నారు. కానీ మనసును పంచేవారు కరవైపోతున్నారేమోననిపిస్తున్నది. అందుకే పరిస్థితులు వికటించి భావి భారత పౌరులుగా ఎదిగి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాల్లో అంధకారం అల్లుకొని అర్థాం తరంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్య ఒక వ్యాపారంగా రూపాంతరం చెందినప్పటి నుండి ఈ దుర దృష్టపు పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇవి రానురాను పెరిగిపోతుండడంఅందరిలోనూ ఆందోళన కలిగిస్తున్న ది. విద్యార్థి దశలోనే అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భావి భారత పౌరులను చూసి భారతావని నివ్వెరపోతు న్నది. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి కుటుం బంలో కాంతులు వెదజల్లే దీపాల్లాంటి వారు భవిష్యత్తు లో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన దివ్వెలు ఆకస్మికంగా ఆరిపోతున్నాయి. కని, పెంచినవారి ఆశ లను చిదిమేస్తూ కుటుంబాల్లో అంధకారాన్ని నింపుతూ కనుమరుగవుతున్న ఈ విద్యాదీపాల వెనుక ఎన్నో కార ణాలు పైకి కన్పిస్తున్నా ఒత్తిడి తట్టుకోలేకపోవడమే ప్రధాన కారణమనదే కాదనలేని వాస్తవం.
Read Also : AP Inter Results 2026: 18న ఇంటర్ ఫలితాలు!

Student suicide : విపరీ తమైన ఒత్తిడి
ఈ యేడాది ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడిన నిన్న ఆదివారం నాడే ఏకంగా ఏడుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్లు అధికార గణాంకాలే చెబుతున్నాయి. పరీక్ష ల్లో ఫెయిల్ అయ్యామని ఏడుగురు విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోగా, ఇంటర్మీడియేట్ ఫలితాల భయంతో మరొక విద్యార్థి ఫలితాలు వెలువడకముందే బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా భోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియేట్ మొదటిసంవత్సరం పరీక్షలు రాసాడు. పాస్ కాననే భయంతో గత గురువారం రాత్రి ఒక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. ఇక హైదరాబాద్ లో ఇద్దరు విద్యార్థులు, మెదక్ జిల్లాలో మరొక విద్యార్థి, మహబూబ్నగర్లో, భూత్పూర్లో, సూర్యాపేటలో ఒక్కొక్క విద్యార్థి మొత్తం ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షా ఫలితాలు వస్తున్నా యంటే విద్యార్థుల్లోనే కాదు తల్లిదండ్రుల్లో కూడా విపరీ తమైన ఒత్తిడి పెరిగిపోతున్నది.
బలవంతపు చావులకు కారణాలు ..
దేశవ్యాప్తంగా కూడా ఈ బలవన్మరణాలు పెరిగిపోతున్నాయి. 2017లో దేశంలో లక్షా ఇరవై తొమ్మిది వేలమంది తమ ప్రాణాలు తీసుకుం టే 2023 నాటికి ఆ సంఖ్య లక్షా డెబ్బైవేలకు పెరిగింది. ఇవన్నీ అధికారిక లెక్కలే. వివిధ కారణాలరీత్యా వెలుగు చూడని మరణాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఆ గర్భశోకాన్ని భరించలేక అనారోగ్యంపాలై తనువు చాలిస్తుంటే మరికొందరు బలవంతపు చావులకు కూడా వెనుకాడడం లేదు. గతం లో తమిళనాడులో మెడికల్ కాలేజీ ప్రవేశ అర్హత కోసం నీట్ పరీక్షల్లో రెండుసార్లు ప్రయత్నం చేసి విఫలమై మూడోసారి వస్తుందో లేదో అనుమానంతో పంతొమ్మిదేళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి చేరుకొనేసరికి కుమారుడు చనిపోయి ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయాడు. తల్లిలేని కుమారుడిని ఎంతో ప్రేమానురాగాలతో తల్లీతండ్రి తానే అయి అల్లారు ముద్దు గా పెంచుకున్న కొడుకు కళ్లముందే కడతేరిపోవడంతో బాధను భరించలేకపోయారు. అంత్యక్రియలు పూర్తి చేసి అదే రాత్రి ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రధానంగా శిక్షణా సంస్థలకు కేంద్రాలుగా పేరుగాంచిన రాజస్థాన్లోని ‘కోటా’లో ప్రతి యేడాది పదుల సంఖ్యలో బలవన్మణాలు చోటుచేసుకుంటున్నాయి. పోని పది, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాసై ర్యాంకులు సంపాదించి ప్రతిష్టాకరమైన ఐఐటిల్లో, మెడిసిన్లో సీట్లు సంపాదించి ఆనందంగా చేరుతున్న విద్యార్థులు కూడా ఆతర్వాత అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. 2018- 23 వరకు ఐఐటిల్లో చదువుతున్న మెరికల్లాంటి ముప్ఫై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బలవంతపు చావులకు కారణాలు ఎన్నో ఉన్నా, కారకులు ఎందరో ఉన్నారు.

యుద్ధప్రాతిపదికపై చర్యలు
ప్రాచీన భారత విద్యా విధానం లో కళలకు చక్కటి స్థానం ఉండేది. ఆచరణాత్మక పరీక్షా విధానాలను అవలంబించేవారు. నలంద, తక్షశిలతదితర విశ్వవిద్యాలయాల్లో పరీక్షల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు. అప్పటి తరగతి గదుల్లో తక్కువగా బోధించేవారు. ప్రయోగాత్మక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులే కానీ ప్రైవేట్ బడులు అంతగా ఉండేవి కావు. ఒకటి, రెండు నిర్మాహకులు లాభాపేక్ష లేకుండా విద్యాబోధనే లక్ష్యంగా నడిపేవారు. కానీ రానురాను విద్య ఒక వ్యాపారంగా రూపాంతరం చెందింది. మారుతున్న కాల మాన పరిస్థితులకు అనుగు ణంగా తల్లిదండ్రుల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని అవ సరమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమ వుతున్నాయి. ప్రైవేట్ విద్యపై ఆధారపడాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఇలాంటి కారణాలు ఎన్నో విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒత్తిడిలేని విద్యావిధానానికి రూపకల్ప దిశగా మేధావులూ ఆలోచించాలి. ఈ బలవంతపు చావుల నుంచి విద్యార్థి లోకాన్ని బయటపడేసేందుకు యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాల్సిన తరుణమిది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులను దేశం కోల్పోతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: