Seed Act : పటిష్టమైన విత్తన చట్టమే పరిష్కారం

Follow Us: Google News Daily Hunt
Seed Act
Seed Act
FONT SIZE
GET APP

Seed Act : బాధపడడం తప్ప బాధించడం తెలియని అన్న దాతల్లో ఇటీవల కాలంలో సహనం, ఓర్పు సన్న గిల్లి ఆందోళనబాటలు పడుతున్నారు. తనకు ఎంతటి నష్టం జరిగినా, ఎవరు ఎంతగా మోసగించినా తమలో తాము కుళ్లి కుళ్లి మనసులోనే బాధపడి చివరకు ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధపడే వారే తప్ప తమను దగా చేసినవారిపై కక్ష కట్టి దాడులు చేసేందుకు సాహ సించలేకపోయేవారు. పంటలకు గిట్టుబాటు ధర రాక పోయినా దళారులు హస్తలాఘవంతో కోలుకోలేని దగాకు గురవుతున్నా తమ కర్మకు తామే బాధపడుతూ మనో వేదనతో ఇంటిముఖం పట్టేవారు. కానీ ఇటీవల కాలంలో రోడ్లపైకి రావడం, ధర్నాలు, రాస్తారోకోలు లాంటి నిర సన కార్యక్రమాలు చేసేందుకు స్వచ్చందంగా ముందుకు
వస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి ఇటు తోటి మానవుడి దోపిడీని, అటు ప్రకృతి సహాయ నిరాకరణను ఎదుర్కొని పండించిన పంటలను అమ్ముకోవడంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో వారు పడిన, పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

Read Also : Mrugasira Karte: జూన్ 8 నుంచి మృగశిర కార్తె.. రైతన్నలకు శుభారంభం!

Seed Act
Seed Act

Seed Act : దళారీవ్యవస్థ ఉన్నంత కాలం రైతులకు ఈ బాధలు తప్పవు

దేశవ్యాప్తంగా కూడా అధిక శాతం మార్కెట్ యార్డుల్లో దళారులదే రాజ్యం. కొలతల్లో మోసం, ధరలు నిర్ణయించడంలో దగా, ఒక్కటేమిటి ఎక్కడ వీలైతే అక్కడ చేతివాటం ప్రదర్శించేందుకు దళా రులు నిత్యం పొంచి ఉంటూనే ఉన్నారు. అన్నదాతలు మోసపోతూనే ఉన్నారు. మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారన్నటే ఈ దళారీవ్యవస్థ ఉన్నంత కాలం రైతులకు ఈ బాధలు తప్పవు. అందుకే విత్తే దగ్గర నుంచి విక్రయించేవరకు అన్నిస్థాయిల్లో దగా జరుగుతున్నది. దీనిని నిరోధించేందుకు పాలకులు ఎప్ప టికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు చెప్తున్నా అవి మాట లకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడు ఖరీఫ్సీజన్ ఆరంభం కాబోతున్నది. రోహిణికార్తె దాటి మరోవారంలో మృగశిరలో అడుగుపెట్టబోతున్నాం. పంటలకు విత్తనాలు మూలం. యేటా ఎందరో రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలతో మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. మరొక పక్క నకిలీ, నాసిరకం విత్తనాలు సరఫరా చేసేవారిపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని పిడి చట్టాన్ని ప్రయోగించి కటకటలా వెనక్కి పంపేందుకు వెనుకాడమని పాలకులు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఆ నకిలీ విత్తనాల వ్యాపారులు అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నకిలీ విత్తనాల వ్యాపారం జోరందుకున్నది. అక్కడక్కడ పట్టుబడుతున్నాయి కూడా.

నకిలీ విత్తనాలకు అదుపే లేదు

రైతుల అవసరాలను, డిమాండు ఆసరాగా తీసుకొని ఈ నకిలీ విత్తనాల వ్యాపారులు ఒక వ్యూహం ప్రకారం రైతులను దగా చేస్తున్నారు. ఇప్పుడే కాదు ప్రతియేడాది సీజన్లో అధికారులు చేస్తున్న దాడుల్లో వేలాది కోట్లాది రూపాయల విలువైన నకిలీ, నాసిరకమైన విత్తనాలు పట్టుబడుతున్నాయి. నిందితులను అదుపులోకి తీసుకుం టున్నారు. కేసులు పెడుతున్నారు. అలా జరిమానా చెల్లిం చి మరుసటి రోజు నుంచే జైలు నుంచి రాగానే వారు అదే వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యే కంగా టాస్క్ ఫోర్సును కూడా ఏర్పాటు చేసింది. ఆకస్మిక దాడులను చేయిస్తున్నారు. అయినా ఇదేమీ ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఈసారి తెలంగాణలో పత్తి విత్త నాలు కోటి ప్యాకెట్లు అవసరం ఉంటే మూడు కోట్లు తెప్పించామని, విత్తన కొరత లేదని అధికారవర్గాలు చెబు తున్నాయి. అలాగే వరి విషయంలో కూడా కొరత ఉండ కపోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. కానీ కొన్ని రకాల పత్తి విత్తనాలు, మరికొన్ని వరి విత్తనాలకే డిమాండ్ ఉంది. రైతులు అవే కావాలని కోరడంతో దీన్ని ఆసరాగా తీసుకొని నకిలీలు విజృంభిస్తున్నారు. ఇక పప్పు దినుసులు, కూరగాయలు, తదితర పంటల సాగు గణనీయంగా తగ్గి పోతున్నది. ఆ విత్తనాలు కూడా సకాలంలో నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు.

Seed Act
Seed Act

చట్టం రైతులు కంటే దళారులకే ప్రయోజనకరం

కూరగాయలకు సంబంధించి న నకిలీ విత్తనాలకు అదుపే లేకుండాపోతున్నది. బిల్లులు లాంటివి ఎలాంటి ఆధారాలు లేకుండా కోట్లాది రూపా యల విలువైన విత్తన వ్యాపారం జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు తెప్పించుకొని బహి రంగంగానే అమ్ముకుంటున్నారు. వీటికి రైతులు అడిగానా రసీదులు ఇవ్వకుండా ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈవ్యాపారం ఇక్కడా అక్కడా అని కాదు. తెలుగు రాష్ట్రాల్లో బాహాటంగా జరుగుతున్నా, అధికారు లకు స్పష్టంగా తెలిసినా మౌనంగా ఉండిపోతున్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా విత్తనాల కొరత దృష్ట్యా ఈ నకిలీ వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. అసలు ఈ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు గత రెండు, మూడు దశాబ్దాలుగా పాలకులు చేస్తున్న ప్ర యత్నాలు ఏమాత్రం సఫలీకృతం కావడం లేదు. పోలీ సులన్నా, చట్టాలన్నా వ్యవసాయ శాఖ అధికారులన్నా పాలకులు చేస్తున్న హెచ్చరికలన్నా ఈవ్యాపారుల్లో భయ భక్తులు లేకుండాపోయాయి. ఇందుకు ఎన్నో కారణాలు న్నాయి. ఇందులో ప్రధానమైనది లోప భూయిష్టమైనవిత్తన చట్టమే. ఆ చట్టం రైతులు కంటే దళారులకే ప్రయోజనకరంగా ఉంది. ఆ చట్టాన్ని మార్చాలని, దాని స్థానంలో పటిష్టమైన కొత్తచట్టాన్ని తేవాలని ఏనాటి నుంచో ప్రయ త్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. విదేశాల్లో నకిలీ నాసి రకం విత్తనాలతో మోసం చేసిన దళారులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి చర్యల కారణం గానే పొరుగునున్న చైనా లాంటి దేశాల్లో నకిలీ, నాసి రకం విత్తనాల ఉనికేలేదు. దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో విత్తనాల్లో మోసపోయినవారి సంఖ్యతక్కు వేమీ కాదు. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. వారి కున్న ఒక్క ఉపాధిని వారిపాలిట మృత్యువుగా పరిణ మించకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు