Solar panels : పెట్రోల్ బంకు నుంచి సూర్యుడి దాకా !

Follow Us: Google News Daily Hunt
Solar panels
Solar panels
FONT SIZE
GET APP

Solar panels : ఒకప్పుడు వాహనంలో పెట్రోల్ పోయించుకోవాలంటే పెట్రోల్ బంకు ఎక్కడుంది? అని అడిగే వాళ్లం. కాలం మారేకొద్దీ ఎల్పీజీ, సీఎన్బీ వంటి ప్రత్యామ్నాయ ఇంధ నాలు రవాణాలోకి వచ్చాయి. దీంతో అవసరాన్ని బట్టి ఎల్పీజీ, సీఎన్నీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఎక్కడుంది? అని వెతికే పరిస్థితి వచ్చింది. ఇప్పు డు విద్యుత్ వాహనాల కాలంలో ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుంది? అని అడుగుతున్నాం. తరం మారింది. వాహనం మారింది. ఇంధనం మారుతోంది. సాంకేతికత పరుగులు పెడుతోంది. మరి మన ఆలోచన కూడా మరో అడుగు ముందుకు వేయాల్సిన సమయం రాలేదా? అసలు ప్రశ్న ఛార్జింగ్ కేంద్రం ఎక్కడుందన్నది మాత్రమే కాదు వాహనానికి అవసరమైన విద్యుత్తును మనమే ఎంతవరకు ఉత్పత్తి చేసుకోగలం? అన్నదే. పెట్రోల్, డీజిల్ కోసం చెల్లించే డబ్బులో గణనీయమైన భాగం దిగుమతుల రూపంలో దేశ సరిహద్దులు దాటుతుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకా రం భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడిచమురు వినియోగదారు. వార్షిక ముడిచమురు దిగుమతి బిల్లు దాదాపు 144 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.13 లక్షల కోట్లు. అంతర్జాతీయ ధరలు, సరఫరా అంతరాయా లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మారినప్పుడల్లా దిగుమతులపై ఆధారపడే దేశాలకు ప్రభావం తప్పదు. అందుకే విద్యుత్ వాహనాల వైపు మారడం ఒక దశ మాత్రమే. ఆ విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తోంది? అన్నదే తదుపరి ప్రశ్న. బొగ్గు, గ్యాస్ తదితర వనరులతో ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో ఈవీని నడపడం ఒక మార్పు.

Read Also : AP Road Development: రోడ్ల అభివృద్ధికి భారీ ప్లాన్.. తొలి విడతలో 6 రోడ్లకు గ్రీన్‌సిగ్నల్

Solar panels
Solar panels

Solar panels : రూఫ్తాప్ సోలార్ ద్వారా లబ్ధి

అదే విద్యుత్తులో పెరుగుతున్న భాగాన్ని సూర్యుడి నుంచి పొంద గలిగితే మరో మెట్టు. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ప్యానెళ్లు, ఇంటి వద్ద ఈవీ ఛార్జర్, అవసరమైతే బ్యాటరీ నిల్వ, స్మార్ట్ మీటర్- ఇవన్నీ ఒకే వ్యవస్థగా పనిచేసేరోజులు దూరంలో లేవు. ఇప్పటికే ఆ దిశలో పునాది పడుతోంది. 2026 ఆగస్టు 12 నాటికి పీఎం సూర్య మర్ పథకం కింద 5158 లక్షల కుటుంబాలు రూఫ్తాప్ సోలార్ ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 14.8 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కాగా, దాదాపు 19 లక్షల కుటుంబాలకు సున్నా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడిం చింది. మరోవైపు ఈవీ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2 కోట్లను దాటాయి. కొత్తగా అమ్ముడైన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కారు. ఈ వాహనాల వినియోగం 2025లో రోజుకు సుమారు 12 లక్షల బ్యారెళ్ల చమురు అవసరాన్ని భర్తీ చేసినట్లు ఐఈఏ అంచనా వేసింది. భారత్లో 2025 లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 75 శాతం పెరిగి 1.65లక్షలకు చేరాయి. మొత్తం కార్ల విక్రయాల్లో వాటా దాదాపు నాలుగు శాతం. వీటిలో సుమారు 60 శాతం దేశీయంగా టాటా, మహీంద్రా సంస్థలు తయారు చేసినవేనని ఐఈఏ పేర్కొంది.

సూర్యకాంతితో విద్యుత్తు ఉత్పత్తి

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2026 జూలై 22 నాటికి 23,22,878 ఎలక్ట్రిక్ వా హనాలకు ప్రోత్సాహకాలు అం దించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజా ఈవీఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు కేటాయించగా, 6,562 ఛార్జర్ల ఏర్పాటుకు రూ.689 కోట్లు ఆమోదించిం ది. ఇక్కడే తదువరి ఆలోచన మొదలవ్వాలి. పెట్రోల్ బంకు నుంచి ఛార్జింగ్ కేంద్రానికి వచ్చాం. ఇక ఛార్జింగ్ కేంద్రం నుంచి సూర్యుడి దాకా వెళ్లాలి. ప్రతి ఈవీపై తప్ప నిసరిగా సౌర ప్యానెళ్లు అమర్చాలన్నది ఆలోచన కాదు. వాహనం కదులుతూనే సూర్యకాంతితో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వాహనం పైకప్పు పై పరిమిత స్థలం, ప్యానెళ్ల బరువు, ఉష్ణోగ్రత, దుమ్ము, వర్షాలు, నీడ, తయారీ వ్యయం వంటి సవాళ్లు ఉన్నాయి. అందుకే ప్రయోగశాల ఫలితాలను వెంటనే సామూహిక వినియోగానికి సిద్ధమైన సాంకేతికతగా చూడకుండా, భారత వాతావరణ పరిస్థితుల్లో దీర్ఘకాలిక పరీక్షలు, ఖర్చు-ప్రయోజన విశ్లేషణ, మన్నిక పరీ క్షలు జరపాలి. వాహనం మీద ప్యానెల్ పెట్టకపోయినా సూర్యుడి విద్యుత్తును వాహనానికి అందించవచ్చు. అపార్ట్ మెంట్ల పార్కింగ్ ప్రదేశాలు, కార్యాలయాలు, మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, హైవే పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతాల్లో సోలార్ కార్పోర్టులు ఏర్పాటు చేసి పగటిపూట ఉత్పత్తి చేసిన విద్యుత్తుతో వాహనాలను ఛార్జ్ చేయవచ్చు. అవసరమైన చోట బ్యాటరీ నిల్వను జత చేయ వచ్చు.

బ్యాటరీ నిల్వ. కూడా కీలకం

గ్రామీణప్రాంతాల్లో ఈ-ఆటోలు, చిన్న వాహనాలు, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్ వాహనాలకు స్థానిక సౌర విద్యుత్తుతో చిన్న ఛార్జింగ్ కేంద్రా లు ఏర్పాటు చేయవచ్చు. సూర్యుడు పగటిపూట ఉన్నా వాహనం అవసరం రాత్రి రావచ్చు కాబట్టి బ్యాటరీ నిల్వ. కూడా కీలకం. రూఫ్తాప్ సోలార్, బ్యాటరీ నిల్వ, ఈవీ ఛార్జింగ్, స్మార్ట్ మీటరింగ్, స్థానిక విద్యుత్ గ్రిడ్ సామర్ధ్యా న్ని సమన్వయం చేయాలి. భవిష్యత్తులో వాహనం నుంచి ఇంటికి లేదా గ్రిడు విద్యుత్తు పంపే ద్విముఖ ఛార్జింగ్ సాంకేతికత కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. సౌర విద్యుత్లోనూ పరిశోధన వేగంగా సాగుతోంది. సిలికాన్తో పాటు పెరోవెస్కైట్ ఆధారిత టాండమ్ సౌర కణాలు అధిక సామర్థ్యాన్ని సాధిస్తున్నాయి. అయితే ప్రయోగశాలలో సాధిం చిన సామర్థ్యం, తక్కువ ఖర్చుతో దీర్ఘకాలం పనిచేసేవాణిజ్య ఉ త్పత్తి ఒకటే కాదు. మన్నిక, భారీస్థాయి తయారీ, వ్యయం, భారత వాతావరణ పరిస్థితుల్లో పనితీరు వంటి అంశాలపై మరింత పరిశోధన అవసరం. అందుకే మన దృష్టి కేవలం ఎన్ని ఈవీలు అమ్ముడయ్యాయి? అనే లెక్కపైనే ఉండకూ డదు. ఎన్ని ఈవీలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన సౌర విద్యు త్తు అందుతోంది? అనే ప్రశ్న కూడా భవిష్యత్తు విధాన చర్చలో భాగం కావాలి. ఈవీ తయారీతో పాటు సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, ఛార్జర్లు, విద్యుత్ నియంత్రణ పరికరాలు, నిల్వ వ్యవస్థల దేశీయ తయారీ పెరిగితే కొత్త పరి శ్రమలకు, ఉపాధికి అవకాశాలు ఏర్పడవచ్చు.

Solar panels
Solar panels

వాహనానికి శక్తినిచ్చే మూలం కూడా మారాలి

ఇంటి పైకప్పు పై ఉత్పత్తి చేసిన విద్యుత్తులో కొంత భాగాన్ని ఇంటి అవ నరాలకు, కొంత భాగాన్ని వాహన ఛార్జింగ్కు వినియోగిం చగలిగితే కొనుగోలు చేసే విద్యుత్తు లేదా పెట్రోల్-డీజిల్పై ఆధారపడే వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వాహనం ఉచితంగా నడుస్తుందనడం సరికాదు. వాహన కొనుగోలు, బ్యాటరీ, బీమా, టైర్లు, నిర్వహణ, ఛార్జింగ్ పరికరాలు వంటి ఖర్చులు ఉంటాయి. లక్ష్యం ప్రయాణాన్ని ఉచితం చేయడం కాదు, శక్తి కోసం బయటకు వెళ్లే డబ్బు ను సాధ్యమైనంతవరకు దేశంలోనే ఉంచడం. విధానపరంగా రూşప్ సోలార్ ఈవీ ఛార్జింగ్ను అనుసంధానించే పట్టణ, గ్రామీణ ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టవచ్చు. అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, ప్రజా పార్కింగ్ ప్రాంతాల్లో సోలార్ కార్ పోర్టులు, బ్యాటరీ నిల్వ, స్మార్ట్ ఛార్జింగ్ వ్యవ స్థలను ప్రోత్సహించవచ్చు. వాహనాలపై సౌర విద్యుత్తు ఉత్పత్తి, అధిక సామర్థ్య సౌరకణాలు, తక్కువ ఖర్చు బ్యాట రీలు, ద్విముఖ ఛార్జింగ్ వంటిరంగాల్లో భారతీయ పరిశో ధనా సంస్థలు- వాహన తయారీదారులు కలిసి దీర్ఘకాలిక పరిశోధన చేయవచ్చు. ప్రతివాహనం వెంటనే ఈవీగామార డం సాధ్యంకాదు. విమానాలు, భారీ రవాణా, నౌకాయానం వంటి రంగాలకు వేర్వేరు శక్తి పరిష్కారాలు అవసరం. అం దుకే విద్యుదీకరణతో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతల అభివృద్ధి కూడా కొనసాగాలి. వాహనం మారి తే మాత్రమే రవాణా స్వావలంబనం రాదు. వాహనానికి శక్తినిచ్చే మూలం కూడా మారాలి. భారత్ వచ్చే పదేళ్లను శక్తి స్వావలంబన దిశగా మలచగలిగితే, దిగుమతి చమురుపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు సౌరవిద్యుత్తు, బ్యాటరీలు, ఈవీలు, ఛార్జింగ్ మౌలికవసతులు, పరిశోధన, దేశీయతయా రీ రంగాల్లో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునేఅవకాశం ఉంటుంది. ప్రపంచంలో ముందంజలో నిలవాలన్న భారత లక్ష్యానికి ఇలాంటి శక్తిమార్పు ఒకబలమైనపునాది కావచ్చు. పెట్రోల్ బంకును మూసేయడం లక్ష్యం కాదు. పెట్రోల్ బంకుపై ఆధారపడాల్సి న అవసరాన్ని తగ్గించడంలక్ష్యం.

-శ్రీశైలం దూడం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు