SIR : నర్! ఇదెక్కడి న్యాయం?

Follow Us: Google News Daily Hunt
SIR
SIR
FONT SIZE
GET APP

SIR : ఈ దేశంలో పుట్టి, బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కావా లని పరితపించిన ఈ దేశ ప్రజలు స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత, ‘ఓటు మా హక్కు’ అని భావించి, ఎన్నికలు జరిగిన మొదటి సంవ త్సరాలలో పండుగ వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన ప్రజాస్వామ్యానికి పురుడు పోసారు! ఆ ఫలాలు అనుభవిస్తున్న తరుణంలో పాలకులు తాము ఎన్ను కున్న ప్రజా ప్రతినిధులు చట్టాలు తమను సంప్రదించో, సంప్రదించకుండానో చేసినా పట్టించుకోలేదు! ఓటును రామబాణంగా, అయిదేళ్ళకొకసారి వినియోగించుకుంటు న్నారు! పుట్టిన తర్వాత చట్టాలు పెట్టిన గడువు తర్వాతనే ఓటర్లు అయ్యారు! ఆ ఎన్నికల మొదటి రోజుల్లోనే ప్రజా స్వామ్య పరిధిలో ప్రభుత్వాలు నడుపుతున్న పాలకులూ అధికారులే, నిజమైన ఓటర్లుగా తమను గుర్తించారు! ఇన్నేళ్ళ తర్వాత ‘సర్’ అంటూ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)మా ఓటును మేమే కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరిచారు! దొంగ ఓట్లు వున్నవాళ్ళను, లొసుగులతో ఓటు హక్కు పొందిన వారిని, ఒకటికి మించి ఓట్లు వున్నవారిని, దేశంలో అనేక చోట్ల ఓట్లు వున్నవారిని, ప్రక్క దేశాల్లోంచి వచ్చి మోసం చేసి ఈ దేశ ఓటర్లుగా నమోదు కాబడ్డ వారిని ఏరేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎలక్షన్ అధికారులది! దానికోసం

Read Also : Rahul Gandhi: నేటి నుంచి రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన

SIR
SIR

SIR : మా ఓటు నిర్ధారించం డి సార్!

మేము నిజమైన ఓటర్లం ఎన్నో ఎన్నికలలో ఓట్లు వేసి గర్వంగా ఈ దేశ ఓటర్ను అని తలెత్తుకొని తిరుగుతున్న మేము ఇప్పుడు మీరు అందజేసిన ఫారాలను నింపి మేము నిజమైన ఓటర్లమని మీ ముందు నిరూపించు కోవాల్నా? ఇదెక్కడి న్యాయం? డాబుసరిగా పాలనా వ్యవ స్థలను ఎన్నో పెట్టుకొని సర్,సర్ మా ఓటు నిర్ధారించం డి సార్! అని మీ చుట్టూ తిరగాల్నా? మేము కట్టిన పన్ను లతో మమ్మల్నే ‘ఓటు దారు’గా నిరూపించుకోమని నిబం ధనలు పెట్టారా? మీ 2002 నం॥తో మాకేం సంబంధం! ఆ తర్వాత జరిగిన అయిదు ఆరు జనరల్ ఎన్నికలలో అసలు సిసలైన ఓటర్లుగా వచ్చి మా ఓటు మేము వేసు కున్నాం కదా! నిందితులను, నేరస్థులను ఏదైనా నేరంలో పట్టుకొని మీరిచ్చిన ఈ సూచనతో పోలీసు వారు ఏ నిబం ధననో ఉటంకిస్తూ (ఇప్పటికీ చేస్తునే వున్నారు) మమ్మల్ని క్యూలల్లో పోలీసు స్టేషన్ల ముందు నిలబెట్టి ఏదో నేరం నెపంతో ఫారాలు ఇచ్చి వివరాలు నమోదు చేసుకొనే వెసు లుబాటు చిద్విలాసంగా వాడుకోవచ్చు గదా! ఈ ప్రభు త్వాలూ ఈ అధికారులూ ఎందుకు? వారు సేకరించాల్సిన వివరాలు మేము యివ్వాల్నా? ఇదేమి పాలన? మరి మీరెందుకు? కేవలం మామీద లేనిపోని చట్టాలను ఉటం కిస్తూ మామీద అధికారం చెలాయించటానికా? ‘సర్’ చక్క గా కుదిరింది! మేము మీ చుట్టూ ‘సర్, నర్’ అంటూ తిరగాలనే కదా మేము జీతాలు ఇస్తూ మా మీద పెత్తనం కోసం మిమ్మల్ని అధికారులుగా, పాలకులుగా చేసింది! చట్టాలు మా సౌకర్యం కోసం చేసారు! చేసేవాళ్ళు వాళ్ళ సౌకర్యాలు చూసుకోవటం లోనే నిమగ్నులయ్యే పరిస్థితిని మేమే కల్పించాం! మాకు భలేగా బుద్ధి చెబుతున్నారు!

సర్’ చట్ట నమ్మతంగానే చేస్తుండొచ్చు

ఓటు లేకపోతే మాకు పూట గడవకుండా ఏమీ వుండదు! ఓటు మాకెందుకు అని అసలైన ఓటర్లకు చిరాకు తెప్పించే ప్రయ త్నంలో వున్న మేము ఏమీ అనలేం! మీరు చట్టబద్ధంగానే పనిచేస్తున్నామని ఒక సెక్షన్ చూపిస్తారు! కోర్టులు గూడా ఆ చట్టాలు వున్నాయి కదా! దాని ప్రకారం నడవండి అని ‘న్యాయం’గా తీర్పు చెప్తారు! అంతేగా! అయితే చట్టాల వెనుక ‘స్పిరిట్’ ను చూసి మాట్లాడే కొందరు మాజీ ఎలక్షన్ కమీషనర్లు వున్నారు. వారిలో అశోక్ లావాసా అనే మాజీ ఎలక్షన్ కమీషనర్ ఏదో సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఈ సందర్భంగా విశ్లేషించారు! ఆయన చిన్న వాక్యంలో పెద్దమాట చెప్పారు. ‘సర్’ చట్ట నమ్మతంగానే చేస్తుండొచ్చు కానీ ఇది మాత్రం న్యాయం కాదు! ఆ ఒక్క మాట చాలు దేశంలోని నిజమైన ఓటర్ల బాధ ఘోష బహిర్గత పర్చేందుకు! అంతేకాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ బలమున్నవాడిదే హక్కుగా ఉదహరించవచ్చు అని గూడా నిక్కచ్చిగా చెప్పారు! స్టాట్యు టరీ ఇనిస్టిట్యూషన్లు, రాజ అంగ సంస్థలు, ప్రభుత్వాలు నడెన్గాగా ‘బలమున్న వాడిదే రాజ్యం’ అన్న ధోరణి ప్రద ర్శిచటం వల్ల సామాన్యులు కలవరపడే పరిస్థితి ఏర్పడింది!.

దేశ జనాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు

చట్టాలు అమలు పర్చాల్సిన సంస్థలు, ప్రస్తుత పరిస్థితు లలో వారు అమలు చేస్తున్నదే చట్టం అని చెబుతుంటే సామాన్యుడు ఏం చేయగలడు? దానికి ఉదాహరణ ఈ ‘సర్’ అమలు చేసే విధానమే! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ధర్మబద్ధంగా అమలు విధానాన్ని రూపొందించు కోకుండా వారిష్టమొచ్చిన ప్రొసీజర్ను అవలంబిస్తూ లక్షల కొద్ది ఈ దేశ జనాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఆ ప్రొసీజర్ను జ్యుడిషియరీ ఒప్పుకోవటంతో నిజమైన, ధర్మ బద్ధంగా ఓటు హక్కును ఏనాడో పొందినవారు ఆ అధర్మ ప్రొసీజర్ను పాటించలేక సతమతమవుతున్నారు. పైగా కొందరు రాజ్యాంగం పేరుతో రాజకీయులనే సపోర్టు చేస్తు న్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? చట్టాన్ని ప్రజలకను కూలంగా అన్వయిస్తూ చెప్పేదే న్యాయంగా భావించే మేధా వులూ, పాలకులూ న్యాయాధీశులు కనుమరుగవుతున్నారా? కేవలం చట్టంలోని అక్షరం అమలు చేయటం కాదు చట్టం వెనుకవున్న ‘స్పిరిట్ను అర్ధం చేసుకొని అమలు చేసేదే న్యాయం! సామాన్యులు దానినే ధర్మంగా భావిస్తారు! 13 కోట్ల పేర్లు ఓటర్ల లిస్టులోంచి తొలిగించటం గమనించిన వారు ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించటం మానరు! వారిని ఎందుకు ఇలా తీసేస్తున్నారో ఎవరూ చెప్పేప్రయత్నం చేయ టం లేదుకదా!

SIR
SIR

ఓట్ల రివిజన్ కొత్తేమీ గాదు

ప్రస్తుతం 33శాతం ప్రజలు ఓటువేసే పరి స్థితి లేదు! ‘నర్’ పేరుతో అనవసరపు ఆదుర్దాను ఎలక్ట్రోరల్ రోల్స్ సరిచేసే పేరుతో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ నికార్సయిన ఓటర్లుగా వున్నవారికి కూడా బి.పి. తెప్పించే పరిస్థితి ఎం దుకు దాపురించింది? ఓట్ల రివిజన్ కొత్తేమీ గాదు! స్వతం త్రం తర్వాత ఒకటి రెండుఎన్నికల తర్వాత రివిజన్లు ప్రభు త్వాలు, ఎలక్షన్ కమీషన్లు జరిపేవి! రాజకీయాలు అప్పట్లో నేరుగా వుండేవి, రాజకీయ నాయకుల ధోరణి సామరస్యం గా వుండేది! ఇప్పుడు మార్పులు సంభవించటం మంచికో చెడుకో సహజమే కదా! ప్రజలల్లో నలుగుతున్న అసలు సమస్యలు ‘సర్’ మాదిరి పరిష్కరించటానికి పూనుకుంటే ఎంత బాగుండేది? చట్టసభలల్లోని ప్రజా ప్రతినిధులు నిజాయితీగా తమ విధులు నిర్వహిస్తున్నారా? ఏమో తెలియని పరిస్థితి. ఇదివరకు శాసన సభలో, పార్లమెంటు సమావేశా లూ కనీసం ‘అబ్బా ఇన్ని రోజులా’ అన్నట్లు జరిగేవి! ఇప్పు డు సమావేశాలు చిటికెలోనే అయిపోతున్నాయా అనుకొనే పరిస్థితి వుందని బుద్ధి జీవులు అంటున్నారు! ప్రస్తుతం నర్ నోటీసుల పర్వం సాగుతున్నది! 60లక్షల మందికి నోటీసు లు అందటంతో హైద్రాబాద్ లాంటి నగరంలో కొన్నిచోట్ల నుంచి ‘ఎనామలి లిస్ట్’ బయట పెట్టాలనే ఆందోళన పెరు గుతున్నది! లిస్టులు బయటపెట్టే ఆందోళన కొంతమేర తగ్గ వచ్చు! దానితో లిస్టులు తీసుకొనేవారు (బియల్లుఇస్తారు) ఏయే కారణాల చేత నోటీసులు ఇస్తున్నారు అని తెలుసు కొనే అవకాశం వుంది! ఆ మధ్య ఒక పెద్ద మనిషి ‘జోక్’గా ‘ఈ నోటీసులు విడాకుల నోటీసులు ఇచ్చి నట్లు వుంది’ అని అన్న జోక్ వెనక బాధ గూడుకట్టుకొని వుంది.

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు