Seed balls : విత్తన బంతులు.. పచ్చని అడవులకు చిరునామా!

Follow Us: Google News Daily Hunt
Seed balls
Seed balls
FONT SIZE
GET APP

Seed balls : ప్రస్తుత వర్షాకాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం అత్యంత ఆసక్తికరమైన, ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి సీడ్బాల్స్ లేదా విత్తన బంతుల తయారీ, వాటిని వెదజల్లే ప్రయోగం, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న ఈ సమయంలో సీడ్బాల్స్ ప్రయోగం పర్యావరణానికి ఒక వరం వంటిది. సీడ్బాల్స్ అంటే మట్టి, కంపోస్ట్ (ఎరువు) విత్తనాల మిశ్రమంతో తయారు చేసిన చిన్నచిన్నబంతులు. ఇవి ప్రకృతిసిద్ధ మైన అడవుల పునరుజ్జీవనానికి, ముఖ్యం గా మానవ ప్రమేయం తక్కువగా ఉండి, మొక్కలు నాట డానికి వీలుపడని కొండ ప్రాంతాలు, బంజరు భూములు అడవి ప్రాంతాల్లో అడవుల పెంపకానికి అద్బు తమైన మార్గం, వర్షాకాలం ప్రారంభమైన వెంటనే ఈ సీడ్ బాల్స్ ను వెదజల్లడం వల్ల, పడిన వర్షపు నీటికి బంతిలోనిమట్టి కరిగి, అందులోని విత్తనం మొలకెత్తడానికి కావలసినతేమ పోషకాలు అంది, ప్రక ృతి సిద్ధంగానే మొక్కలు మొలవడం మొదలవుతుంది. ఈ పద్ధతిలో విత్తనం నేరుగా భూమిపై పడకుండా, మట్టి పొరలో సురక్షితంగా ఉండటం వల్ల పక్షుల నుండి, ఎలుకల నుండి లేదా ఎండ వేడిమి నుండి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భూ తాపం, అడవుల నరికివేత వంటి సమస్యలకు సీడ్ బాల్స్ ఒక సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం.

Read Also : Choutukur Sugarcane Cultivation: పాత పంటల దిశగా కొర్పోల్ రైతులు.. చెరుకు సాగుతో కొత్త ఆశలు

Seed balls
Seed balls

Seed balls : జీవవైవిధ్యం పెరుగుతుంది

ఎర్ర మట్టిని, వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువును కలిపి, అందులో ఆ ప్రాంతపు వాతావరణానికి తగిన దేశవాళి వృక్షాల విత్తనాలను ఉంచి చిన్న బంతులుగా చేసి, నీడలో అరబెట్టి, వర్షాలు పడుతున్నప్పుడు ఖాళీప్రదేశాలలో విసిరితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల విత్తనాలు కుళ్ళిపోకుండా మొలకెత్తే అవకాశం 80-90 శాతం వరకు ఉంటుంది. ఈ ప్రయోగంవల్ల ఆటవీ ప్రాంతాల్లో జీవవైవిధ్యం పెరు గుతుంది. నేల కోత నివారించబడుతుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ప్రాంతంలో అయితే సీడ్ బాల్స్ వేస్తున్నామో. ఆ ప్రాంతానికి సహజంగా అలవాటైన లేదా స్థానిక వృక్ష జాతుల విత్తనాలను మాత్రమే వాడాలి. పరాయి ప్రాంతాల నుంచి తెచ్చిన లేదా కలుపు మొక్కల విత్త నాలను వాడటంవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిం టుంది. అలాగే, సరైన సమయంలో అంటే వర్షాలు పడటం ప్రారంభించిన మొదటి లేదా రెండో వారంలోనే వీటిని వేయడం వల్ల, మొక్కలకు శ్రీ వేర్లు ఊరేలోపు తగినంతవర్షం దొరికి అవి దృఢంగా తయారవుతాయి, సీడ్బాల్స్ ప్రయో గం అనేది కేవలం మొక్కలు నాటడమే కాదు, ఇది భావి తరాలకు పచ్చని ప్రకృతిని అందించే ఒకసామాజిక బాధ్యత, పాఠశాల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు, స్థానిక కమ్యూ నిటీలు కలిసి ఈ పనిని ఒక ఉద్యమంలా చేపడితే, రాబో యే కొన్ని సంవత్సరాల్లోనే మన చుట్టూ ఉన్న బంజరు నేలలు పచ్చని వనలుగా మారుతాయి. ప్రతి వ్యక్తి తన పుట్టినరోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి వందల సంఖ్యలో సీడ్బాల్సు తన ప్రయాణాల్లోలేదా ఖాళీ స్థలా ల్లో వేయడం అలవాటు చేసుకోవాలి.

Seed balls
Seed balls

పర్యావరణ సమతుల్యతను కాపాడటమే ..

ప్రకృతిని కాపాడుకో వడానికి, భూమిని తిరిగి సస్యశ్యామలం చేయడానికి సీడ్ బాల్స్ కంటే తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఫలితాలను ఇచ్చే మార్గం మరొకటి లేదు. ప్రతి ఒక్క గింజలో ఒక అడవిని నిర్మించే శక్తి దాగి ఉంటుంది, దానికి కావలసింది కేవలం చిన్న ప్రయత్నం వర్షపు జల్లుల తోడుమాత్రమే. ఆంధ్ర ప్రదేశ్లో ఇటీ వల విత్తన బంతుల పెంపకానికి, పంపిణీకి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక కమ్యూనిటీలు కలిసి తీసుకుంటున్న చొరవ పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప మైలు రాయిగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఎంతో వైవిధ్య భరితమైనది. అయితే ఆదవులు తక్కువగా ఉన్న కొండ ప్రాంతాలు, బంజరు భూముల్లో మొక్కలు నాటడం నవాలుతో కూడుకున్న పని, ఇటువంటి క్లిష్టమైన ప్రదేశాల్లోవిత్తన బంతులు వేయడం ద్వారా మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతి సిద్ధంగా మొక్కలు మొలకెత్తడానికి మార్గంనుగమం అవుతోంది. ఈ చొరవలో భాగంగా వేప, కానుగ, మర్రి, రావి వంటిస్థానిక వృక్ష జాతు ల విత్తనాలను వినియోగించడం వల్ల మన ప్రాంత వాతా వరణానికి తట్టుకోగల చెట్లు పెరుగుతాయి. ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా స్థానిక పక్షుల జీవ వైవిధ్యానికి సురక్షితమైన నివాసాలను కల్పిస్తుంది.

-డాక్టర్ చిట్యాల రవీందర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు