Rising prices : పాలకుల నిర్వాకానికి దర్పణం ధరలే

Follow Us: Google News Daily Hunt
Rising prices
Rising prices
FONT SIZE
GET APP

Rising prices : అదుపు ఆజ్జా లేకుండా పెరిగిపోతున్న ధరలను నియంత్రిస్తాం, నల్లబజారుదారులపై ఉక్కుపాదం మోపుతాం అంటూ ఎవరు అధికారంలో ఉన్నా చెప్పే మాటలే చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం చేయలేకపో తున్నారు. స్వరం మారుతున్నదేతప్ప పాట మాత్రం పాతదే అన్నట్లుగా ఉంది పాలకుల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పు డు ధరల విషయంలో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన నేతలే అధికారంలోకి రావడంతోనే మారి పోతున్నారు. ఇటీవల అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు విల విల్లాడిపోతున్నారు. ఒక్కరోజు ఉన్న ధర మరుసటి రోజు ఉండడం లేదు. ఒక పట్టణంలో ఉన్న ధర మరో నగరంలో ఉండడం లేదు. ఇక ధరలు కొండెక్కడానికి గల కారణాలు, కాదకులు ఎవరో, ఎవరికి చెప్పుకో వాలో, ఎవరు చర్యలు తీసుకుంటారో దిక్కుతోచక సన్నజనంతోపాటు మధ్యతరగతి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. పోని ఉత్పత్తి చేస్తున్న రైతుకు గిట్టుబాటు ధర వస్తున్నదంటే అదీ లేదు. అక్కడ పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. పండించిన పంటలకు ధరలు తగ్గిపోతున్నాయి. గిట్టుబాటు ధరలు రాక అన్నదా తలు అన్నానికి జరక్కా, అప్పులు చెల్లించలేక, ఆత్మాభిమా నం చంపులేక ప్రాణత్యాగం చేస్తున్నారు. రైతుల వద్ద పంట లు ఉన్నప్పుడు వాటి ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. వారి వద్ద నుంచి ప్రైవేట్ వ్యక్తుల గోదాముల్లోకి చేరుకోగానే ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటున్నారు.

Read Also : 2005 Old Currency Notes: ఆ పాత నోట్లు చెల్లవా?.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ

Rising prices
Rising prices

Rising prices : నిబంధనలను అతిక్రమించి

ఇదేదో ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిం దని చెప్పడం లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్నది. రాను రాను పెరిగిపోతున్నది. ఇందులో కొందరు దళారులు, వ్యాపా రస్తులు కీలకపాత్ర వహిస్తారన్న విషయం అధికారులతోసహా అందరికి తెలిసిందే. కొందరు దళారులు కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు భోంచేస్తున్నారు. చట్టప్రకారం లైసెన్సు లు పొందినా, నిబంధనలను అతిక్రమించిఅటు రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీచేస్తున్నారు. ఇలా దోపిడీకి గురికాకుండా నివారించి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువు లను అందించడంలో కీలకపాత్ర వహించాల్సిన మార్కెట్ కమిటీలు రైతులు, వినియోగదారులకు భక్షక కంపెనీలుగా తయారయ్యాయి. ద కారులను అదుపు చేయలేకపోగా కొన్ని చోట్ల వారితోనే కుమ్మక్కైపోతున్నారు. అనేక సందర్భాల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. రైతులు ఉద్యమించారు. ధర్నా చేశారు. కొన్ని చోట్లదాడులు కూడా చేశారు. అయినా ఏమాత్రం ఫలితంఉండడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటూ వేదికలు ఎక్కిఅరిచే పెద్దలే మార్కెట్ కమిటీల విషయంలో ఇదే ప్రజాస్వామ్యా న్ని భూస్థాపితం చేయడమే. నామినేషన్ పద్ధతి ఎవరు ఎప్పుడు ప్ర వేశపెట్టారో కానీ, రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి.

కృత్రిమ కొరత

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక కావాల్సిన రైతు ప్రతినిధులకు బదులు బంధుమిత్రులనో, లేక తమ తోకలుగా, బాకాలుగా ఉన్న రాజకీయ కార్యకర్తలను ఈ కమిటీల్లో నేతలు నియమించుకుంటున్నారు. ఇలా మార్కెట్ కమిటీలు రాజకీయ వునరా వాస కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ఇందులో ప్రజలచే తిరస్కరించబడినవారు, ఎన్ని కల్లో పోటీ చేసే సత్తా లేనివారు, ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని వారిని సైతం ఈ కమిటీల్లో చేర్చిస్తున్నారు. పాల కుల దయాదాక్షిణ్యాలమీద ఎంపిక అయిన పాలక మండళ్లు ఉనికి నామ మాత్రమే కాదు దళారుల సంక్షేమ ధ్యేయంగా పనిచేసే వరి స్థితులు ఏర్పడ్డాయి. పాలక మండళ్లకు ఎసి గదులు, కార్లు లాంటి సౌకర్యాలు కల్పించుకొనేందుకు మార్కెట్ కమిటీ నిధులు వెచ్చించే పెద్దలు రైతులు ఆహ ర్నిశలు కష్టపడి పండించి మార్కెట్లోకి తెచ్చిన పంటను వర్షం నుండి కాపాడుకునేందుకు టార్పాలియన్లు ఇవ్వలేక పోవడం పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ధరల నిర్ణయం లో ద 2 కారులదే కీలక పాత్రగా మారిపోయింది. అవసరం అనుకుంటే పోటీగా ఇతర ప్రాంతాల నుంచినరుకులు రప్పించి స్థానిక రైతుల ఉత్పత్తులను దెబ్బతీస్తున్నారు. కొందరు రైతుల పేరుతోనే గ్రామాల్లో సరుకును నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరిగిన తర్వాత మార్కె ట్లోకి దించుతున్నారు. ఇలా ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టాను సారంగా ధరలు పెరిగి పోతున్నాయి.

కమిషన్ల కోసమే దళారీ వ్యవస్థ

ఈ భాగోతమంతా బహిరంగంగా జరుగుతున్నా కోట్లాది మంది రైతులు అల్లా డుతున్నా పాలకులు హెచ్చరికలు, ప్రకటనలు సమీక్షలు, సమావేశాలతో కాలం గడుపుతున్నారే తప్ప ఏమీ చేయ లేకపోతున్నారు. వరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా మార్కెట్ కమిటీల్లో తమ అనుచరులను ఎలా నియమించుకోవాలి? ప్రత్యర్థులను ఎలా తొలగించాలి? అనే ఆలోచించి, చర్చించి చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారేతప్ప ఈ కమిటీలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతు న్నాయి? రైతులకు ఎలా సేవలు అందిస్తున్నాయనే విషయంలో ఆలోచించడం లేదనే చెప్పొచ్చు. వ్యాపారులు లాభాల కోసమేవ్యాపారాలు చేస్తు న్నారనేది వాస్తవం. అలాగే కమిషన్ల కోసమే దళారీ వ్యవస్థ ఉన్నదనేది కూడా నిజం. అలా వారు వ్యవహరించడాన్ని తప్పుపట్టలేం. కానీ నెలనెలా వేలాది రూపాయలు జీతభ త్యాల రూపేణ ప్రజాధనాన్ని భోంచేస్తున్నా అధికారులను ఏమనుకోవాలి? కేవలం కొందరు అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం కారణంగా వీటన్నిం టికి మించి రాజకీయ జోక్యంతోనే ఈపరిస్థితులు దాపురి స్తున్నాయి. ధరలు అదుపు తప్పు తున్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇతరప్రాంతాల నుంచి సరుకులు తెప్పించి వినియోగదారులకు అందుబాటులో ఉంచి ధరలను నియం త్రించేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలేమి జరగడం లేదు. గతంలో ఉల్లిగడ్డల ధరలు అందుబాటులో లేనంతగా పెరగడంతో ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలుచేసి వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతోధరలు తగ్గాయి. అలానే కందిపప్పు విషయంలోకానీ ఇతర పప్పు ధాన్యాల విషయంలో అప్పటి పాలకులు తీసుకున్న చర్యల కారణంగా ధరలను నియంత్రించగలిగారు.

Rising prices
Rising prices

భవి ష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు

గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితే వస్తే విజి లెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ఒక్కసారిగా ఉమ్మడి రాష్ట్రంలో దాదులు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువైన ఆక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ మార్కెట్లోకి రావడంతో ధరలు దిగి వచ్చాయి. ఏదిఏమైనా ధరలనియంత్రణ విషయంలో పాల కులు వ్యవహరిస్తున్న తీరుసర్వత్రా విమర్శలకు గురవుతున్న ది. అదుపులేకుండా పెరిగిపోతున్న ధరలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తు న్నాయి. బడుగు, పేద వర్గాలే కాదు మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిమితిలేని ఆదాయం కలవారి గురించి చింతలేదు కానీ రెక్కాడితేకానీ డొక్కాడని ప్రజలు, నెలసరి జీతగా ళ్లు, పరిమిత ఆదాయంగలవారి పరిస్థితి అయోమయం గా తయారయింది. ఇతర మార్గాల్లో ఆదాయం ఉంటే తప్ప సంసారాన్ని నడవలేని పరిస్థితులు దాపురించాయి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అన్నివర్గాలకు సంబంధిం చిన ఈధరల పెరుగుదల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవి ష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. గతంలో ఉల్లిగడ్డల ధరలు పెరగడంతో అధికారాన్ని కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ పెద్దలను చూశాం. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నా, ఉద్యోగుల జీతభత్యాలు ఏ రీతిలో పెంచినా ఆశించిన ఫలితాలు రాకపోగా పేదరికం మరింత పెరుగుతుంది.

-దామెర్ల సాయిబాబ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు