Reservations : జంతర్ మంతర్లో ‘రిజర్వేషన్ హఠావో’ నినాదం వినిపించింది. కుల ఆధారిత రిజర్వేషన్లు వద్దని, ఆర్థిక వెనుకబాటుతనమే ప్రాతిపదిక కావాలని డిమాండ్లు వచ్చాయి. ‘ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అన్న మాటకు సహజంగానే ఆకర్షణ ఉంటుంది. పేదరికంలో ఉన్న ప్రతి యువకుడికీ అవకాశం రావాలన్న ఆకాంక్ష కూడా న్యాయమై నదే. కానీ దేశం ఇప్పుడు అడగాల్సిన అసలు ప్రశ్నవేరొకటి. రిజర్వేషన్లు తొలగిస్తే సమానత్వం నిజంగానే వచ్చేస్తుందా? లేక సామాజిక అసమానతను కనిపించకుండా చేయడమే జరుగుతుందా? రిజర్వేషనన్ను కేవలం ఉద్యోగంలో ఒకసీటు, విద్యలో ఒక సీటుగా చూడటం దాని అసలు ఉద్దేశాన్నిచిన్న దిగా చేయడమే. భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్న సమా జం శతాబ్దాలుగా సమాన అవకాశాలతో నడిచిన సమాజం కాదు. కులం ఆధారంగా వృత్తి, విద్య, సామాజిక గౌరవం, నివాసం, అధికారానికి ప్రవేశం నిర్ణయించబడిన చరిత్రమన ముందు ఉంది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు సమానత్వాన్ని ప్రకటించడంతో ఆగలేదు. సమాన అవకాశాలు అందని వర్గాలకు ప్రత్యేక అవకాశాలకుకూడా మార్గం సుగమం చేశారు. ఇక్కడే ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటు తనం మధ్య తేడాను గుర్తించాలి.
Read Also : Caste Census : కులగణన విషయంలో కాంగ్రెస్ అభ్యంతరం

Reservations
Reservations : ఒకే కొలమానంతో కొలవడం సరైన విధానం కాదు
ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అది నిజమే. అతనికి విద్య, స్కాలర్షిప్, కోచింగ్, ఉపాధి, ఆర్థిక సహాయం అందాలి. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేఆర్ధిక సమస్య తగ్గవచ్చు. సామాజిక వివక్ష మాత్రం కేవలం ఆదా యం పెరిగిందని తొలగిపోదు. ఒక వ్యక్తి ఆదాయం పెరిగి నా, అతని సామాజిక గుర్తింపు, కులపరమైన అనుభవం, సంస్థల్లో ప్రాతినిధ్యం వంటి ప్రశ్నలు అలాగే ఉండవచ్చు. అందుకే ‘పేదలందరికీ ఒకే రిజర్వేషన్’ అనే వాదన వినడా నికి సమానత్వంలా కనిపించినా, అది సామాజిక వెనుకబా టుతనాన్ని పూర్తిగా అంచనా వేయగలదా అన్నది పరిశీలిం చాలి. పేదరికం జేబును ప్రభావితం చేస్తుంది. సామాజిక వివక్ష మనిషి అవకాశాలను, గౌరవాన్ని, సంబంధాలను ప్రభావితం చేస్తుంది. రెండింటికీ పరిష్కారాలు అవసరం. కానీ రెండింటినీ ఒకే కొలమానంతో కొలవడం సరైన విధానం కాదు. సుప్రీంకోర్టు కూడా రిజర్వేషనన్ను సమానత్వానికి వ్యతి రేకమైన మినహాయింపుగా మాత్రమే చూడలేదు. 2024లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ఉద్దేశాన్ని విశ్లేషిస్తూ, చారి త్రకంగా కొద్దిమంది సమూహాల ఆధిపత్యంలో ఉన్న పరిపాలనా వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు ప్రాపర్ లుక్ ఇన్ కల్పించడం, వారికి పరి పాలనలో, పాలనలో వాటా కల్పిం చడం రిజర్వేషన్ లక్ష్యమని న్యాయపరమైన చర్చనునమోదు చేసింది.
రిజర్వేషన్లు సమాన అవకాశాన్ని సాధించే ఒక మార్గమని..
2026లోనూ సుప్రీంకోర్టు ఆర్టికల్ 14, 15, 16, పరిధిలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రతికూలతలను తొలగించేందుకు రాష్ట్రం తగిన చర్యలు తీసుకోవచ్చని, రిజర్వేషన్లు సమాన అవకాశాన్ని సాధించే ఒక మార్గమని పేర్కొంది. అంటే రాజ్యాంగ దృష్టిలో రిజర్వే షన్కు మూల ప్రశ్న ఎవరు పేద? అనేది మాత్ర మేకాదు. ఎవరు వెనుక బడ్డారు? ఎవరు తగిన ప్రాతినిధ్యంపొందలేదు? ఎవరు నిర్ణయ వ్యవస్థలోకి ప్రవేశించలేకపోయారు?” అన్నదీ అంతే ముఖ్యమైన ప్రశ్న. ఆరిక్టల్ 342ఎ కూడా సామాజి కంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల రాష్ట్రాలవారీ గుర్తింపుకు రాజ్యాంగపరమైన వ్యవస్థను కొన సాగిస్తోంది. అయితే ఇక్కడ మరో నిజాన్ని కూడా ఒప్పుకోవాలి. ఎసి, ఎస్టీ, బిసి/ఒబిసిలను ఒకే రకమైన సామాజిక సమూహాలు గా చూడటం సరైంది కాదు. ముఖ్యంగా ఒబిసి వర్గంలోనే విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్ర అంతర్గత తేడాలున్నాయి. కొన్ని వర్గాలుముందుకు వెళ్లాయి. మరికొన్ని అత్యంత వెనుకబడిన స్థితిలోనే ఉన్నాయి. అందు కే ఒబిసి రిజర్వేషన్పై చర్చలో క్రీమీ లేయర్, అత్యంత వెనుకబడిన వర్గాల ప్రయోజనం, డేటా ఆధారిత సమీక్ష వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ఇదే విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒబిసిలలో క్రీమీ లేయర్ను వేరు చేయడం, నిజంగా అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజ నం చేరేలా చూడడం వంటి అంశాలను ప్రస్తావించింది.
ప్రతిభ అనేపదాన్నీ ఒకసారి ప్రశ్నించాలి
రిజర్వేషన్ వ్యవస్థలో లోపాలుంటే వాటినిసరిదిద్దాలి. కానీ లోపాలున్నాయని మొత్తం వ్యవస్థనే తొలగించడంపరిష్కారం కాదు. ప్రయోజనాలు నిజంగా అర్హులైన వారికి చేరేలా చేయ డం అసలు పరిష్కారం. ఇక్కడ ప్రతిభ అనేపదాన్నీ ఒకసారి ప్రశ్నించాలి. పరీక్షలో వచ్చిన మార్కులే ప్రతిభకు పూర్తి కొలమానమా? ఒక విద్యార్థికి చిన్నప్పటి నుంచే మంచి పాఠ శాల, ప్రైవేట్ కోచింగ్, పుస్తకాలు, ఇంట ర్నెట్, చదువుకు అనుకూలమైన వాతావరణం లభిస్తేమరొక విద్యార్థి ఉపాధ్యా యుల కొరత, పేదరికం, సామాజిక వెను కబాటుతనం మధ్య చదివితే ఇద్దరినీ ఒకే ప్రారంభ రేఖ వద్దనిలబెట్టినట్టు ఎలా భావించగలం? పోటీకి ముందు సమాన అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్న లేకుండా, పోటీ ఫలితాన్ని మాత్రమే మెరిట్గా పిలవడం అసంపూర్ణమైన విశ్లేషణ. ఇదేసమయం లో రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్న వారి ప్రశ్నలను కొట్టి పారేయడం కూడా సరైంది కాదు. రిజర్వేషన్ ఎంతకాలం? ప్రయోజనం ఎవరికి చేరుతోంది? నిజంగా వెనుకబడినవారి కి అందుతోందా? ఒకే కుటుంబాలు తరతరాలుగా ప్రయో జనం పొందుతున్నాయా? క్రీమీలేయర్ పరిమితులు సమ ర్థంగా అమలవుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. సామాజిక న్యాయం పేరుతో వ్యవస్థలోని లోపా లను దాచడంకూడా సామాజిక న్యాయంకాదు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం రిజర్వేషన్ రద్దు అని చెప్పడం మాత్రం తార్కికంగా సరిపోదు.

Reservations
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి. పేద యువతకు కోచింగ్, స్కాలర్షిప్లు పెంచాలి. ఉన్నత విద్యలో నిలకడైన అవకాశాలు కల్పించాలి. ఒబిసిల లో అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు విస్తరించాలి. అగ్రవర్ణ పేదల ఆర్ధిక వెనుకబాటుతనాన్నీ ప్రభుత్వం వదిలిపెట్టకూడదు. సామాజిక న్యాయం అంటే ఒకరిని తగ్గించడంకాదు, వెనుకబడిన వారిని పైకి తీసుకురావడం. అసలు ప్రశ్న ఉద్యోగాల సంఖ్యతోనే ముగియదు. ఎవరు విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు? ఎవరు పరిశోధన చేస్తున్నారు? ఎవరు పరిపాలనలో నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవరు విధానాలు రూపొందిస్తున్నారు? ఎవరి స్వరం మీడియా, న్యాయవ్యవస్థ, కార్పొరేట్నంస్థలు, విద్యా సంస్థల్లో బలంగా వినిపిస్తోంది? ఇవన్నీ ప్రాతినిధ్యా నికి సంబంధించినప్రశ్నలే. అందుకే దేశం ఇప్పుడు రిజర్వేష న్ల్పై కేవలం ఉంచాలా? తొలగించాలా?” అనే ద్వంద్వ ప్రశ్న లో చిక్కుకోకూడదు. ఎవరికి ఇంకా అవకాశం లేదు? ఎవరి ప్రాతినిధ్యం ఇంకా తక్కు? ఎవరి స్వరం నిర్ణయ వ్యవస్థకు చేరడం లేదు? అన్నప్రశ్నలకు సమాధానం వెతకాలి. రిజర్వే షన్లను మెరుగుపరచాలి. అవసరమైన చోట సంస్కరించాలి. నిజంగా వెనుకబడినవారికి చేరేలా చేయాలి. కానీ సామా జిక అసమానత తొలగిపోయిందనే సాక్ష్యం లేకుండానే రిజర్వేషన్ తొలగించాలని చెప్పడం సామాజిక అసమానతల చరిత్రకు అకాల ముగింపు వలకడమే అవుతుంది.
-దుంద్రా కుమారస్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: