Question Paper Leak : దేనికోసమీ పంతం?

Follow Us: Google News Daily Hunt
Question Paper Leak
Question Paper Leak
FONT SIZE
GET APP

Question Paper Leak : పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పి కాదు, పలు నిరసనలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ‘నీట్’ ప్రశ్నపత్రాల లీక్ కు బాధ్యత వహించాల్సిన వారెవరూ ధైర్యంగా నైతిక బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేరు. కొత్తగా వెలుగు లోకి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇదే అంశాన్ని చేపట్టి జంతర్ మంతర్లో అగ్గి పుట్టిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న ఒకే ఒక డిమాండ్తో ‘కాక్రోచ్’ పార్టీ గల నెల మొదటి వారంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. ఆనాటి నుంచి ఈనాటివరకు ‘నీట్’ బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కేంద్ర ప్రభు త్వ నిర్వాకాన్ని వ్యతిరేకించేవారు, పేపర్ లీకైపై విరుచుకు పడినా హస్తినలో ఏలినవారు, ‘కాక్రోచ్’దేముందిలే అని ఆ అంశాన్ని ఎటూ తేల్చకుండా నాన్చారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆయా శాఖల వ్యవహారాలు చూసే మంత్రులు తమ శాఖ పరిధిలోకి వచ్చే అంశాల విషయం లో విమర్శలు వెల్లువెత్తినప్పుడు, అవకతవకలు బయట పడినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ ఎంతో హుందాగా రాజీనామాలు చేసేవారు. ఇప్పుడలాంటిదేమీ లేదు సరి కదా! వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభం నాడు ఢిల్లీలో విపక్షాల నేతృత్వంలో కాక్రోచ్ జనతాపార్టీ కార్య కర్తల ఆందోళన చేపట్టేవరకు పట్టించుకోలేదు. కొత్తవిద్యార్థి ఉద్యమం ఊపందుకుంటున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లనిపించడం లేదు. నీట్ పేపర్ లీక్ మహాపాపమని ప్రధాని నరేంద్రమోడీ కూడా అంటున్నారు. కానీ ఆ శాఖ మంత్రి మీద ఈగ వాలనివ్వడం లేదు.

Read Also : CJP rally delhi: ఢిల్లీలో పోలీసులపై రాళ్లు విసిరిన సీజేపీ నిరసనకారులు

Question Paper Leak

Question Paper Leak

Question Paper Leak : ‘కాక్రోచ్’ ఉద్యమానికి మద్దతు

‘కాక్రోచ్’ ఉద్యమానికి మద్దతు బాగా పెరుగుతోంది. వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ‘కాక్రోచ్’ ఉద్యమకారులు పార్ల మెంటు ఎదుట ధర్నా నిర్వ హిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టారు. కానీ విద్యార్థుల ఉద్యమం సిజెపి ర్యాలీపై లాఠీచార్జి, కొందరు విద్యార్థులకు గాయాలు తగలడంతో ఉ ద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారం రాజధానిని కుదిపేసింది. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృ త్వంలో మిత్రపక్షాలు వెంటరాగా గురువారం సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడిం చారు. దాంతో కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న డిమాండ్ కాస్తా ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్గా మారిపోయింది. ఈ ఆకస్మిక పరిణామానికి హస్తినలో రాజకీయ పక్షాల వారు ఆశ్చర్యం చెందారు. ఇదే సందర్భంలో కాక్రోఫ్తానతా పార్టీ, కాంగ్రెస్ తదితర మిత్రపక్షాల లక్ష్యాలు మారిపోవడం చర్చించదగినది. సిజెపి తమను రాజకీయ రొచ్చులోకి లా గొద్దని రాజకీయ పక్షాలను కోరుతోంది. సిజెపి విద్యార్థుల నిరసనకు మద్దతుగా 24రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఇంకా వైద్య సేవ ల్లోనే ఉన్నారు. అయినా సిజెపి తన పట్టు వీడడం లేదు.

ఉద్యమాన్ని ఆపలేరు

అలాగే ప్రధాని కూడా నీటి విషయంలో అలా జరిగి ఉండ కూడదని అంటూనే బాధ్యుల్ని నిర్ణయించడంలో కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారనే అపప్రధ పొందారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉన్నట్లయితే సిజెపి ఆగ్రహం మొదట్లోనే చల్లారిపోయి ఉండేది. వారు జంతర్ మంతర్ వరకు వచ్చే అవకాశమే ఉండేది కాదు. ఈ ఉద్య మంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు నిర్వహించే ఉద్యమం మరిం త ముందుకు పోకుండా అక్కడే నిలబడి పోయి ఉండేది. కానీ పార్లమెంట్లో రచ్చరచ్చవుతోంది. లోక్సభ రాజ్యసభ లో మూడో రోజు బుధవారం కూడాకాంగ్రెస్ తదితర విప క్షాల సభ్యులంతా నల్లదుస్తులు ధరించి వచ్చారు. ఇంత క్రితం మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో బిజెపి మంత్రి జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. విషయాన్ని సంయ మనంతో పరిశీలించాలని అనుకున్నారో ఏమో! కర్ర విరగ కుండా, పాము చావకుండా సమస్యను ఒకొలిక్కి తీసుకు రావాలన్న ప్రయత్నం జరిగింది. మరోపక్క కేంద్ర ప్రభు త్వంతో చర్చలకు సిజెపి అంగీకరించింది. ఈ చర్చల్లో ఎవరున్నా ‘నీట్’ గురించి ఏదైనా అడగండి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప అనే ధోరణిలో ఉంటే సిజెపి ఉ ద్యమాన్ని ఆపలేరు. విద్యార్థులు, నిరుద్యోగులేఅత్య ధిక మంది ఉన్న సిజెపి నిరసనలను ఆపకపోతే ఆ ఉద్య మం కేంద్ర ప్రభుత్వపాలనపై ప్రభావం చూపిస్తుంది.

Question Paper Leak
Question Paper Leak

సమస్యల ముడి వీడితేనే తప్ప పరిష్కారం దొరకదు

గతం లో ఉన్న అంశాలకు తోడు తాజాగా విద్యార్థుల పైపోలీసుల లాఠీచార్జి కొత్తగా వచ్చి చేరింది. ఎన్నో దేశాల్లో ‘జెన్కీ’ ఉద్యమాలు పెరిగిపోతున్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే మరింత ఇరకాటంలో చిక్కు కుంటుంది. రాహుల్, జితేంద్ర సింగ్ మధ్య భేటీలోనీట్ పరీక్షత వైఫల్యాలపై సభలో చర్చించేందుకు అంగీకారం కుదిరినా కాంగ్రెస్ ఆ మాటకు కట్టుబడి ఉండలేదని బిజెపి ఆరోపిస్తోంది. ఇంతకూ ఎవరి పంతాలు వారివన్నట్లు ఉన్న ఈ వ్యవహారంలో సమస్యల ముడి వీడితేనే తప్ప పరిష్కారం దొరకదు. ప్రశ్నపత్రాల లీకేజీలు నివారించడంజాతీయ బాధ్యత అని చెబుతున్న ప్రధాని నిరసనలు చేపడున్న యువత డిమాండ్లపట్ల సానుకూల స్పందన వ్యక్తం చేయ లేకపోయారు. పైగా పిల్ల ల్ని రెచ్చగొట్టవద్దని యువతను సరైన మార్గంలో నడిపించే అంశంలో సమాజం బాధ్యతా యుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్, తదితర పక్షాల కు హితవు చెప్పారు. అంతేతప్ప సిజెపి సమస్యను పరిష్క రించే బాధ్యత, అవకాశం తనకే ఉందన్న విషయాన్నిపక్కన పెట్టినట్లుంది. రాహుల్ గాంధీ అరెస్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు నింపింది. దేశవ్యాప్తంగా బిజెపి, కాంగ్రెస్ శ్రేణుల మధ్య దాడులు మొదలయ్యాయి. ‘నీట్’ పేపర్లోకిజీ అంశంపై విద్యార్ధిల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి నుంచి బయటవేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. తక్ష ణమే ఈ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలి.

Read hindi news : https://hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు