Pollution : అక్టోబర్ 21న ఢిల్లీలో గాలి నాణ్యత పేలవం స్థాయికి పడిపోవడంతో జాతీయ రాజధాని ప్రాంతం అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) మొదటి దశను అమలు చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశించింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గాలి నాణ్యత సూచీ 244గా నమోదవగా, సాయంత్రం 4 గంటలకు 245కు చేరింది. ఈ స్వల్ప పెరుగుదల కంటే, ప్రతి ఏడాది పునరావృతమవుతున్న కాలుష్య సంక్షోభం మరోసారి మొదలైందన్న విషయమే ఆందోళన కలిగిస్తోంది. సమస్య ముదిరిన తర్వాత అత్యవసర చర్యలకు దిగడం ఢిల్లీకి అలవాటుగా మారింది. గాలి నాణ్యత క్షీ ణించినప్పుడు కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు గ్రావ్ అవసరమే. మొదటి దశలో రోడ్లపై దుమ్ము, నిర్మాణ పనుల కాలుష్యం, వాహనాల పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, బహిరంగంగా చెత్తను కాల్చడం వంటి అంశాలపై నియంత్రణ చర్యలు చేవడతారు. అయితే, అత్యవసర ఆంక్షలు ఏడాది పొడవునా అమలయ్యే సమగ్ర కాలుష్య నియంత్రణ విధానానికి ప్రత్యా మ్నాయం కాలేవు. కాలుష్యం పెరిగిన తర్వాతే చర్యలు ప్రారంభిస్తే, సమస్యను నివారించడానికి బదులు దాని ప్రభావాలను ఎదుర్కొనే చక్రంలోనే నగరంచిక్కుకుపోతుంది.
Read Also : North Block Fire Accident: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు!

Pollution : చలికాలంలో కాలుష్యం తప్పదనే భావన
ఢిల్లీలో కాలుష్యానికి వాహనాల పొగ, రోడ్ల నిర్మాణ ప్రదే శాల నుంచి వెలువడే దుమ్ము, పారిశ్రామిక ఉద్గారాలు, చెత్త దహనం, పంట అవశేషాల కాల్చివేత వంటి అనేక కారణా లున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలుల వేగం తగ్గడం వంటి వాతావరణ పరిస్థితులు కాలుష్య కారకాలు భూమికి సమీపంలోనే పేరుకుపోయేలా చేసి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే, వాతావరణం కాలుష్యాన్ని పెంచవచ్చేమో కానీ, అధిక ఉద్గారాలకు అదే కారణం కాదు. చలికాలంలో కాలుష్యం తప్పదనే భావన, నివారిం చగలిగిన విధానపరమైన వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లి స్తుంది. నిబంధనలు లేకపోవడం కంటే, ఉన్న నిబంధన లను సక్రమంగా అమలు చేయకపోవడమే ప్రధాన సమస్య. నిర్మాణ ప్రదేశాల్లో దుమ్ము నియంత్రణ, నిర్మాణ సామగ్రి సురక్షి త రవాణా, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు పరి శ్రమలపై సమర్థ పర్యవేక్షణ తప్పనిసరి. అప్పుడప్పుడు తని ఖీలు చేయడం, కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే కఠిన చర్యలు తీసుకోవడం సరిపోదు. రోడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, నిర్మాణ వ్యర్థాలను సక్రమంగా తొలగించ డం, నిరంతర పర్యవేక్షణ, ఉల్లంఘనలకు తగిన జరిమానా లు విధించడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగం కావాలి. రవాణా విధానంలోనూ మౌలిక మార్పులు అవస రం.
వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం
ప్రజారవాణా వ్యవస్థ నమ్మదగినదిగా లేకపోతే, రద్దీగా ఉంటే లేదా నివాస ప్రాంతాలు, కార్యాలయాలకు సరైన అనుసంధానం లేకపోతే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలిపెట్టడం కష్ o. బస్సు సేవలను మెరుగుపరచడం, చివరి మైలు వరకు రవాణా సౌకర్యాలు కల్పించడం, నడిచేవారికి సురక్షిత మార్గాలు, సైక్లింగ్కు అనువైనమౌలీక సదుపాయా లు అభివృద్ధి చేయడం ద్వారా కాలుష్యం తక్కువగా ఉండే ప్రయాణ విధానాలను ప్రోత్సహించవచ్చు. తక్కువ కాలు ష్యాన్ని విడుదల చేసే వాహనాలు అవసరమే. అయితే, వ్యక్తి గత వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా అంతే ముఖ్యం. పారిశ్రామికాభివృద్ధి, పట్టణీకరణ పర్యావరణ నిబంధనలకు లోబడి సాగాలి. నిర్మాణ సంస్థలు దుమ్ము, వ్యర్ధాల నిర్వహణపై బాధ్యత వహించాలి. పరిశ్రమలు ఉద్గార ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలి. స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో చిన్న పరిశ్రమలకు ఆర్ధిక, సాంకేతిక స హాయం అవసరమ వవచ్చు. అయితే, ఈ సహాయాన్ని నిరంతర ఉల్లంఘనల ను సహించడానికి సాకుగా ఉపయోగించకూడదు. వంట అవశేషాల దహనం సమస్యకు కూడా ఆచరణాత్మక పరి ష్కారాలు అవసరం. పంటల మధ్య వ్యవధి తక్కువగా ఉండటం, యంత్రాలఖర్చు అధికంగా ఉండటం, అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడం రైతులను ఈ పద్ధతికి నెట్టే అంశాలు.
ఆరోగ్య సేవలపై భారం
కేవలం శిక్షలు విధిం చడం వల్ల సమస్య పరిష్కారం కాదు, వంట అవశేషాల నిర్వహణ యంత్రాలను అందుబాటులోకి తేవడం, సకాలం లో సాంకేతిక సహాయం అందించడం, వ్యవసాయ వ్యర్ధాలను M ఇతర అవసరాలకు వినియోగించే మార్గాలను అభి వృద్ధి చేయడం కీలకం. వాయు కాలుష్యానికి రాష్ట్రాల సరి హద్దులు అడ్డుకావు కాబట్టి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి. కాలుష్యంతో కలిగే ఆర్ధిక నష్టాన్ని తరచుగా తక్కువగా అంచనా వేస్తున్నారు. కలుషిత గాలి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతుంది. వైద్య ఖర్చులు, ప్రభుత్వ ఆరోగ్య సేవలపై భారం కూడా అధికమ వుతాయి. అనారోగ్యం, అలసట, విధులకు గైర్హాజరు కావ డం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, రవాణా రంగంలో పనిచేసేవారు వంటి బహి రంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడిపే వారికి ప్రమాదం మరింత ఎక్కువ. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలున్నవారు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఈ ప్రభా వాలు ఆసుపత్రులు, కుటుంబాలకే పరిమితం కావు. పని దినాలు కోల్పోవడం, వైద్య ఖర్చులు పెరగడం, నివారించ గలిగిన అనారోగ్యాల కారణంగా కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఆర్ధిక వనరులపై అదనపు భారం పడు తుంది.
ఏడాది పొడవునా అమ లయ్యే, స్పష్టమైన లక్ష్యాలు
పర్యావరణ పరిస్థితులు నిరంతరం దిగజారితే నైపు ణ్యం కలిగిన ఉద్యోగులు, పెట్టుబడిదారులకు నగరంఆకర్షణ కోల్పోవచ్చు. అందువల్ల స్వచ్ఛమైన గాలి ఆర్థికాభివృద్ధి తర్వాత చూసుకోవాల్సిన అంశం కాదు. అభివృద్ధిదీర్ఘకాలం కొనసాగడానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితి. కాలుష్య భారం అందరిపైనా సమానంగా పడదు. ఆర్ధికంగా స్థితిమంతులైన కుటుంబాలు గాలి శుద్ధి పరికరాలు కొనుగోలు చేయ గలవు లేదా తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వెళ్లగలవు. పేద కుటుంబాలకు అలాంటి అవకాశాలు ఉండవు. రోజు వారీ కూలీపై ఆధారపడేవారు కాలుష్ పెరిగినప్పుడు పనికి వెళ్లకుండా ఉండలేకపోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడు కోవాలా, కుటుంబ అవసరాల కోసం సంపాదించాలా అనే సంకటంలో పడతారు. కాబట్టి కాలుష్య నియంత్రణ విధా నాల్లో ఈ అసమానతలను గుర్తించి, అందరికీ అందుబాటు లో ఉండే ఆరోగ్య సూచనలు, కార్మికులకు మెరుగైన రక్షణ, అత్యధికంగా ప్రభావితమయ్యే వర్గాలకు ప్రత్యేక సహాయం అందించాలి. ఢిల్లీకి కావాల్సింది ఏడాది పొడవునా అమ లయ్యే, స్పష్టమైన లక్ష్యాలు, పారదర్శక పర్యవేక్షణ, బాధ్య తాయుతమైన అమలు వ్యవస్థ కలిగిన కార్యాచరణ.

ఏడాదిపొడవునా సమన్వయం అవసరం
నగర పాలక సంస్థలు, రవాణా అధికారులు, కాలుష్య నియంత్రణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా కాకుండా సమన్వ యంతో పనిచేయాలి. చేపట్టిన చర్యలు ఉద్గారాలను ఎంత వరకు తగ్గిస్తున్నాయో ప్రజలకు అందుబాటులో ఉండే నివే దికల ద్వారా వెల్లడించాలి. పౌరులు చెత్తను బహిరంగంగా కాల్చకపోవడం, వ్యర్థాలను సక్రమంగా పారవేయడం, సాధ్య మైనంతవరకు ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా సహకరించవచ్చు. అయితే, బలహీనమైన ప్రభుత్వ స్త్రీ విధానా లను వ్యక్తిగత బాధ్యతతో మాత్రమే భర్తీ చేయలేం. గ్రాప్ మొదటి దశ అమలు తక్షణ అవసరమే. కానీ దాన్ని శాశ్వత పరిష్కారంగా కాకుండా హెచ్చరికగా చూడాలి. కాలుష్యం మరో ప్రమాదకర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమేలక్ష్యంగా ఉండకూడదు. ఆ స్థాయికి చేరే పరిస్థితులనే ముందుగా నివారించాలి. అందుకు నిరంతర రాజకీయ సంకల్పం, దీర్ఘ కాలిక పెట్టుబడులు, జాతీయ రాజధాని ‘ ప్రాంతంలోని ప్రభు త్వాల మధ్య ఏడాదిపొడవునా సమన్వయం అవసరం. ప్రజా రోగ్యం, ఉత్పాదకత, జీవన ప్రమాణాలను దెబ్బతీసే అభి వృద్ధి నిజమైన పురోగతి అనిపించుకోదు. ఢిల్లీ కాలుష్యసంక్షో భానికి పరిష్కారం మరోవిడత తాత్కాలిక ఆంక్షల్లో లేదు. నిరంతర పర్యవేక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, కరి⋅నమైన నిబంధనల అమలు, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా కాలుష్యాన్ని ముందుగానే ని వారించడంలోనే ఉంది.
-డివిబి శ్రీహరిన్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :