Onion price : ఉల్లికి పాట్లు!

Follow Us: Google News Daily Hunt
Onion price
Onion price
FONT SIZE
GET APP

Onion price : ఈ భూప్రపంచం మీద ‘వాన రాకడ ప్రాణంపోకడ’ గురించి చెప్పగలిగే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతూనే ఉంది. కానీ మార్కెట్లోకి ‘ఉల్లి రాకడ ధరల పోకడల’ గురించి చెప్పే ఏ శాస్త్రము అందుబాటు లో లేదు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రజ్ఞుల అంచనాలు కూడా తారుమారవుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగపడక ఉల్లిధరల విషయం లో ఎప్పుడూ ఒక అడుగు వెనకాలకే ఉంది. ఒక సీజన్లో ఉల్లిధర పెరిగితే, మరో సీజన్లో ఉల్లి ధర తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం చేసుకోలేక ఉల్లి రైతు సత మతమవుతున్నాడు. ఉల్లి సాగుకు దూరమౌతున్నాడు. నిన్నమొన్నటి వరకు రైతుకు గిట్టుబాటుధర లేకమార్కెట్ యార్డుల్లోనే ఉల్లిని వదిలేసే పరిస్థితి ఉండగా, నేడు అదే ఉల్లి వినియోగదారుడి జేబుకు చిల్లుపెడుతోంది. ఉల్లి ధర మళ్లీ సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. లోప భూయిష్టమైన వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ తెచ్చిపెట్టే అనర్థమిది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన ఉల్లి మార్కెట్ల లో సరఫరా తగ్గడం, ప్రతికూల వాతావరణ పరిస్థితు లు, రవాణా సమస్యలు వంటి కారణాలు ధరల పెరు గుదలకు దారితీస్తున్నాయి. పంటసాగు విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలు ఆలస్యం కావడం వంటివి దిగు బడిపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి ఉత్పత్తిదారు మహారాష్ట్రలో ఈసారి ఖరీఫ్ పంట దిగు బడి 5 నుంచి 7శాతం వరకు తగ్గడమే ఈధరల పెరు గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి.

Read Also : Telangana Rice Prices: భారీగా పెరిగిన బియ్యం ధరలు

Onion price
Onion price

Onion price : ఏటా ధరల చక్రం

ఒక సీజన్లో ధరలు పడిపోతే రైతు నష్టపోతా డు. మరుసటి సీజన్లో రైతులు సాగు తగ్గిస్తే తగిన దిగుబడి లేకధరలు పెరుగుతాయి. ప్రధానంగాటమోటా, ఉల్లి విషయంలో ఏటా ధరల చక్రం ఇదేమాదిరి పునరా వృతమవుతున్నా, శాశ్వత పరిష్కార మార్గం దొరకడం లేదు. ఉల్లి సంక్షోభం కేవలం ధరల సమస్య కాదు. ఇది వ్యవసాయ విధానాల వైఫల్యానికి అద్దం. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడికి చుక్కలు చూపిస్తుండటంతో, వాటిని అదుపులోకి తెచ్చేందు కు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ లోని ఉల్లిని మార్కెట్కు తరలిం చేందుకు ‘కందా ఎక్స్ ప్రెస్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఉల్లి బఫర్ నిల్వలను నాసిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువాహటి వంటి నగరాలకు తరలించి సరఫరాను పెంచి ఆయా ప్రాంతాల్లో ధరలను అదుపు చేసే చర్యలు చేపట్టింది. ఇటువంటి అత్యవసర చర్యలు తాత్కాలికంగా మాత్రమే ధరలను నియంత్రిస్తాయి. కానీ ప్రతిసారీ సంక్షోభం వచ్చినప్పుడు బఫర్ స్టాక్ విడుదల చేయడం కంటే, ఉల్లి ఉత్పత్తి, నిల్వ, రవాణా, మార్కెటింగ్ వ్యవస్థను సమగ్రంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులతో ఉల్లిసాగు గణనీయంగా తగ్గింది. ఉల్లి ధరలు జూన్లో కిలోకు ను మారు రూ.25 నుంచి ఆగస్టులోరూ.60 వరకు పెరిగి నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

ధరల స్థిరత్వం కూడా ప్రభుత్వ బాధ్యతే

ఏప్రిల్లో లోనే ఆంధ్ర ప్రదేశ్లో గిట్టుబాటు ధర లేక కొందరు రైతులు ఉల్లిబస్తాలను మార్కెట్ యార్డుల్లో వదిలేసిన ఘటనలు నమోద య్యాయి. రైతు ఉత్పత్తి చేసినప్పుడు ధర లేదు. కొరత ఏర్పడినప్పుడు కూడా వినియోగదారుడికి గిట్టుబాటు ధర దక్కడం కష్టం. రైతుకు కనీస గిట్టుబాటు ధర, శాస్త్రీయ నిల్వ సదుపాయాలు, సమయానుకూల ప్రభుత్వ కొను గోళ్లు అవసరం. వినియోగదారుడికి మాత్రం స్థిరమైన సర ఫరా, పారదర్శక మార్కెట్ ధరలుకావాలి. రైతు విని యోగదారుల మధ్య ఉన్న మార్కెట్ గొలుసులో అనవస రమైన మధ్యవర్తిత్వం, నిల్వదారుల దోపిడీ, కృత్రిమకొరత కు అవకాశం లేకుండా పర్యవేక్షణ పెరగాలి. సాగు ఉత్ప త్తులు పెంచడమే కాదు, ధరల స్థిరత్వం కూడా ప్రభుత్వ బాధ్యతే. ధరల అస్థిరతకు శాశ్వత పరిష్కారం కావాలి. ఒక సమతుల్య మార్కెట్ వ్యవస్థను నిర్మించాలి. రైతుకు న్యాయమైన ధర, వినియోగదారుడికి అందుబాటు ధర ఈ రెండింటినీ సాధించగలిగినప్పుడే వ్యవసాయమార్కెట్ విజయవంత మైనట్లవుతుంది. శనివారం నాటికి దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు రూ.42కి చేరింది. గతే డాదితో పోలిస్తే ఇది దాదాపు 45 శాతం, గత నెలతో పోలిస్తే 19 శాతం అధికం.

Onion price
Onion price

ఎగుమతి సుంకం విధించడం మంచిదేమో

ముఖ్యంగా ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.65కి చేరగా (గతేడాది ఇదే సమయానికి రూ.35), చెన్నైలో రూ.58కి (గతేడాది రూ.33) విక్రయి స్తున్నారు. కేరళ, అసోం. రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ధరలు గణనీయంగా పెరిగాయి. అధిక ధరలున్న మార్కెట్లలో సరఫరా పెంచి, ధరలు మరింత పెరగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని వినియోగదారుల వ్యవహా రాల శాఖ కార్యదర్శి నిధిఖరే ధృవీకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలు సుమారు 12 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాయని, ప్రభుత్వంతో పాటు రైతులవద్ద కూడా తగినన్ని నిల్వలు అందుబాటు లో ఉన్నట్లు అధికారులు చెప్పేవివరణ. ‘ధరల స్థిరీకరణ నిధి’ కింద ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడంకొత్తేమీ కాదు. ఒక పక్క పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యం దాదాపు అన్ని నిత్యావసర వస్తువులు, చమురు ధరలనేకాకుండా, తాజాగా చక్కెర ధరలను అందనంత ఎత్తుకు తీసుకుపోయింది. మహారాష్ట్ర లో నిల్వ ఉందంటు న్న ఉల్లిలో 50-70శాతం దెబ్బతినడం కూడా ఉల్లి సర ఫరాకు ఆటంకంగా ఉందని భోగట్టా. రాష్ట్రాల వ్యాపారు లపై కేంద్రం స్టాక్ లిమిట్ నిర్దేశించడం, ఎగుమతులపై ఆంక్షలు, 40శాతం ఎగుమతి సుంకం విధించడం మంచి దేమో ఆలోచించాలి. అప్పుడే ఉల్లిధరల ఘాటు శాంతి స్తుంది. గతంలో 2024 అక్టోబర్ లోనూ ఉల్లిధరల నియం త్రణకు ఇలాంటి ప్రత్యేక రైళ్లనే వినియోగించారు. ఏదైనా ఇలాంటి సందర్భాల్లో శాశ్వత పరిష్కారం మేలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు