Nuclear agreement : ఇంధన భద్రతపై ప్రపంచమంతా ఆందోళన చెందు తున్న తరుణంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం ఎగుమతులకు అన్నివిధాల మార్గం సుగమమైంది. ఇరాన్ యురేనియం ముడిసరుకు కోసం అమెరికా ఖర్గే నుంచి ఎలుక కన్నాల వరకు తొలిచేస్తోంది. అదే సమ యంలో ఎలాంటి వివాదమూ రాజుకోకుండా భారత్కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరాలో ఒక అడుగు ముందుకేసింది. ఇరుదేశాలు ఆస్ట్రేలియాల నుంచి భారత్కు యురేనియం సరఫరాను కార్యరూపంలోకి తెచ్చే పరిపాలనా ఆమోదా లను సిద్ధం చేసుకోవడం కీలకమైన ముందడుగే. నిజా నికి తొలి అడుగు ఏనాడో 2014లోనే పడింది. ఆనాడు కుదిరిన పౌర అణు ఒప్పందానికి ఇప్పుడు ఆచరణాత్మక రూపం లభించిందన్న మాట. దీనిని కేవలం ఇంధన వాణిజ్య ఒప్పందంగా భావించకూడదు. ఇంధన భద్రత, ఇండో పసిఫిక్ ప్రాంతీయ సమతుల్యత, సరఫరా గొలు సుల స్థిరత్వం వంటి అంశాలతో ముడిపడి ఉన్నవ్యూహా త్మక భాగస్వా మ్యంగానే గుర్తించాలి.
Read Also : PM Modi New Zealand FTA : భారత్-న్యూజిలాండ్ సంబంధాల బలోపేతం: మరికొన్ని ముఖ్య అంశాలు

Nuclear agreement : ఇంధన సంక్షోభ సమయం
ఆస్ట్రేలియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం తర్వాత భారత ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్లు సం యుక్తంగా తమ ఒప్పందంలోని కీలక అంశాలను తెలియ చేశారు. తమ ఒప్పందా నికి బాసటగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ భద్రతా నిబంధనలు అమల్లో ఉంటాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల పర్య వసానంగా ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఒప్పందం ఉభయ తారకమే. ఇంధన సంక్షోభ సమయంలో భారత్, ఆస్ట్రేలియా స్నేహ హస్తం అందుకోవడం లాభదాయ కమే. ప్రపంచ ఇంధన సరఫరా ధరలపై యుద్ధ ప్రభా వం గణనీయంగా ఎక్కువే. ఈ సందర్భంలో ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో, ద్రవ ఇంధనాలు, పెట్రో లియం ఉత్పత్తుల సరఫరా లో ఈ రెండు దేశాల భాగ స్వామ్యం మంచిదే. భారత్ 2047 నాటికి అణువిద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని గణ నీయంగా పెంచేలక్ష్యంతో ముందుకు సాగుతోంది. బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ తక్కువ కార్బన్ ఉద్గా రాలతో స్థిరమైన విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడానికి యురేనియం అవసరమని అంచనా. భారత్కు దేశీయంగా ఉన్న యురేనియం నిల్వలు సరి పోవు. ప్రపంచంలోనే ఆస్ట్రేలియా అతిపెద్ద యురేనియం నిల్వలు కలిగిన దేశం కావున ఆ దేశం భారత్ కు భారత ఇంధన వ్యూహానికి దీర్ఘకాలిక భరోసానిస్తోంది.
చైనా ప్రాబల్యమే
ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యమే కాకుండా సముద్రభద్రతపై నెలకొన్న ఆందోళనలు, సర ఫరా గొలుసుల వైవిధ్యీకరణ, ఆవశ్యకత భారత్ స్ట్రేలియా సంబంధాలను మరింత సమర్ధవంతంగా దగ్గర చేస్తు న్నాయి. క్వాడ్ భాగస్వామ్య దేశాలుగా ఇరు దేశాలు రక్షణ సముద్ర భద్రత, సాంకేతికత, కీలకఖనిజరంగాల్లో సహకారాన్ని అందచేసుకుంటాయి. యురేనియం సర ఫరా కారణంగా భారత్ ఉన్నట్టుండి అణుశక్తిరంగం ఒక్క సారిగా విప్ల వాత్మ కంగా మారుతుందని చెప్పలేం. కొత్త అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, పెట్టుబడులు, సాంకేతిక సామర్థ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి అనేకనవాళ్లు సవాళ్లుగానే మిగిలిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితుల రీత్యా అంతర్జా తీయ అణుశక్తి సంస్థ భద్రతా ప్రమాణాలకు లోబడి, దేశశాంతియుత అవసరాల మేరకు మాత్రమే భారత దిగుమతి చేసుకున్న యురేనియంను వినియోగించాల్సి వస్తుంది. భారత్తో చేసుకున్న ఒప్పంద రీత్యా ఇకపై ఆస్ట్రేలియా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవ కాశముంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్ తో ఇంధన వాణిజ్యాన్ని విస్తరణ అణుఇంధన రంగంలో కొత్త మార్కె ట్ వచ్చి చేరుతుంది. కీలక ఖనిజాల అవసరమూ ఏర్ప డుతుంది. ఈదృష్ట్యా ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద విస్తరణకు కూడా ఆస్కారం ఉంటుంది.

భారత ఆర్థికరంగంలో ఆస్ట్రేలియన్ పెట్టుబడి
అణు శక్తిని స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి ఇదొక పునర్నిర్వచనం చెబుతోంది. అంటే భారత్ స్వావలంబన దిశగా స్థిరమైన అడుగులు వేయనున్నది. ఈ పర్యటనలో మొత్తం 18 ఒప్పందాలపై భారత్, ఆస్ట్రేలియాల మధ్య సంతకాలు జరిగాయి. వీటిలో భారత్ తీర రక్షక దళం, ఆస్ట్రేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్ల మధ్య ఒప్పందం కూడా ఇమిడి ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడు తుంది. ఈ చర్చలు, ఒప్పందాలు ఇరుదేశాల మధ్య అసా ధారణమైన అంశాలుగా ప్రధానులిద్దరూ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కేవలం శిలాజరహిత ఇంధన సామ ర్థ్యాన్ని పెంచడానికే భారత్కు యురేనియం ఆస్ట్రేలియా ప్రధాని ఆల్ఫానీస్ ప్రకటించారు. ఇకపై తమ భాగస్వా మ్యం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండబో తుందన్న ఆశాభావాన్ని ఉభయులూ ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద సూపర్ ఫండ్ ఆస్ట్రేలియా భారతదేశంలో రూ.3,311కోట్లు అదనపు పెట్టుబడి పెట్ట నుంది. భారత ఆర్ధికవ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసా నికి ఇదే నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇండియా, ఆస్ట్రేలియా సిఇఒల ఫోరమ్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా పెట్టుబడితోభారత ఆర్థికరంగంలో ఆస్ట్రేలియన్ సూపర్ మొత్తం పెట్టుబడి 3.3 మిలియన్ డాలర్లకు చేరనుంది. 28ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలిభారత ప్రధాని తానేనని నరేంద్రమోడీ ఎంతో సంతోషంగా ముచ్చటించారు. ఈ పర్యటన భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఎంతో పటిష్ట బంధాన్ని నిలబెట్టిందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: