Balochistan’s Independence : అరేబియా సముద్ర తీరంలోని బలూచిస్థాన్‌లో, మక్రాన్ పర్వత శ్రేణుల్లో హింగోల్ నది ఒడ్డున ఉన్న ఒక గుహలో హింగ్లాజ్ మాతకొలువై ఉంది. సతీదేవి పురాణగాథతో ముడి పడిన ఈ ప్రాచీన క్షేత్రం హిందువు లకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ప్రతి ఏడాది వసంత కాలంలో జరిగే హింగ్లాజ్ యాత్రకు పాకిస్థాన్‌లోని హిందువులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య కాలినడకన సాగే ఈ యాత్రను, స్థానిక ముస్లింలు కూడా ‘నాన్నీ కా హజ్లిగా గౌరవించడం, ఆ క్షేత్రానికి ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. బలూచిస్థాన్ చరిత్రలో 1947 ఆగస్టు ఒక కీలక అధ్యాయం. అప్పట్లో బలూచ్ ప్రాంతంలోని పలు రాజకీయ సంస్థానాల్లో ‘కలాత్ ఖానేట్’ ఒకటి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆ సంస్థానానికి చివరి పాలకుడు మీర్ అహ్మద్ యార్ ఖాన్ అహ్మద్ జై. బ్రిటిష్ పాలన ముగింపు దశలో, ఆహ్మద్ జై కలాత్ కు స్వతంత్ర హోదాను కొనసా గించాలని కోరారు. జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్‌తో కుదిరిన ఒక అవగాహనలో, కలాత్ సంస్థానాన్ని స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా గుర్తించే ఏర్పాటుకు అంగీకారం కుది రింది. కానీ పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఆ వైఖరిలోమార్పు రావడంతో, చివరకు 1948 మార్చి 27న కలాత్ పాకిస్థాన్ లో విలీనమైంది. అయితే అంతటితో బలూచ్ స్వాతంత్ర్య ఆకాంక్ష సుఖాంతం కాలేదు.
Read Also : Barron Trump: ఇరాన్ టీవీ ఛానల్ సంచలనం: బారన్ ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల ఆఫర్!

Balochistan’s Independence : రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్
1948లో అహ్మద్ జైసోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీమ్ నేతృత్వంలో సాయుధ ప్రతిఘటన మొదలైంది. ఆ తర్వాత పలు దశల్లో పెద్దఎత్తున తిరుగు బాట్లు జరిగాయి. 2003 నుంచి కొనసాగుతున్న ప్రస్తుత దశలో బలూచ్ వేర్పాటు వాదసంస్థల సాయుధ కార్యకలా పాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. 2026 ప్రారంభం లో బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి జరిగిన దాడుల్లో భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు, ఇతరప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా మారాయి. ఈ దాడులకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. ఇప్పుడు, కలాత్ ను స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా గుర్తించే అవగాహన కుదిరిన 8 దశాబ్దాల తరువాత, ఫ్రీ బలూచిస్థాన్ మూవ్ మెంట్‌కు చెందిన ‘మిర్ యార్ బలూచ్’ ఈ సంవత్సరం జూలైలో బలూచిస్థాన్ భూభాగానికి, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ పేరుతో పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రక టించారు. 1947లో కలాత్ సంస్థానానికి స్వతంత్ర సార్వ భౌమ హోదాను గుర్తిస్తూ కుదిరిన అవగాహనను, నేటి విస్తృత బలూచిస్థాన్ స్వాతంత్ర్యానికి చారిత్రక ఆధారంగా ఈ ఉద్యమం చూపుతోంది. ఈ నేపథ్యంలో, ఈ ఉద్యమ నాయకులు తమ స్వాతంత్రాన్నిగుర్తించాలని ఐక్యరాజ్యసమి తితోపాటు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ప్రత్యేక జెండా, జాతీయ గీతం, కరెన్సీ, పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ స్వయంప్రకటనకు ఇప్పటివరకు ఏ దేశం లేదా అంతర్జాతీయ సంస్థ గుర్తింపు ఇవ్వలేదు. అనేక వేర్పాటువాద సంస్థలు, వర్గాలు వేర్వేరు స్థాయిల్లో పనిచేస్తున్నాయి.
స్వాతంత్య్ర డిమాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు సాధించే దిశగా..
కలాత్ సార్వ భౌమత్వాన్ని మొత్తం బలూచిస్థాన్ స్వాతంత్ర్యానికి చారిత్రక ఆధారంగా చూపే ఈ వివరణను, అన్నివర్గాలు అంగీకరిస్తు న్నాయా అన్నది కూడా స్పష్టం కాలేదు. మిర్ యార్బలూచ్ ప్రకటనకు మిగిలిన వర్గాలన్నింటి అంగీకారం, బలూచ్ ప్రజల విస్తృత మద్దతు ఉందని చెప్పడానికి ఆధారాలులేవు. పైగా, 1933 నాటి మోంటెవీడియో కన్వెన్షన్‌లో పేర్కొన్న ప్రమా ణాల ప్రకారం ఒకస్వతంత్ర రాజ్యానికి నిర్దిష్ట భూభాగం, ప్రభుత్వం, ఇతర దేశాలతో సంబంధం నెరిపే సామర్థ్యం వంటి లక్షణాలు ఉండాలి. ఈ ప్రమాణాల దృష్టితోచూసినా, ఆ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించడానికి తగిన వరి స్థితులు లేవు. అందువల్ల ప్రస్తుత పరిణామాన్ని, బలూచ్ జాతీయవాద ఉద్యమంలోని ఒక వర్గం, తన స్వాతంత్య్ర డిమాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు సాధించే దిశగా తెస్తున్న ఒత్తిడిగా మాత్రమే చూడాలి. విస్కరించలేని మరో కోణంచైనా. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ప్రణాళికలో అంతర్భాగ మైన చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో గ్వాదర్ కీలక భాగం. అయితే గ్వాదర్ ఉన్న ప్రాంతంలోనే బలూచ్ వేర్పాటు వాదం బలంగా ఉండటం, చైనా ప్రాజెక్టులు, సిబ్బందిపై తరచూ దాడులు జరగడం బీజింగ్‌కు భద్రతా పరమైన సవాలుగా మారింది.
పరోక్షప్రభావం చూపే అవకాశం
భారత్ ప్రయోజనాల దృష్ట్యా కూడా ఈ పరిణామాలకు ప్రాధాన్యం ఉంది. చైనా వ్యూహాత్మక విస్తరణకు భద్రతాపరమైన సవాళ్లు పెరగడం, ఆ విస్తరణ వేగాన్ని పరిమితం చేయడం భారతదేశానికి అయాచితంగా వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగించే అంశాలే. అందువల్ల బలూచిస్థాన్ ఉద్యమాన్ని భారత్, పాకిస్థాన్ అంతర్గత సమస్యగా మాత్రమే కాకుండా, తనకు కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికికి సవాలు విసరగల అంశంగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. అంతేగాక, బలూచిస్థాన్‌లో అస్థిరత మరింత తీవ్రమైతే, అది భారత్- పాకిస్థాన్ సరిహద్దు భద్రతపైనా పరోక్షప్రభావం చూపే అవ కాశం కూడా భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. బలూచిస్థాన్ చర్చకు వచ్చినప్పుడల్లా, బలూచ్ వేర్పాటువాద ఉద్యమానికి భారత్ మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తూ వస్తోంది. భారత్ మాత్రం ఇటువంటి ఆరోపణలను ఖండి స్తూ. బలూచిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేస్తూవచ్చింది. ఈ నేప థ్యంలో తాజా స్వాతంత్య్ర ప్రకటనపై భారత్ వైఖరి ఎలా ఉండాలి, అవసరమైతే ఎలా ప్రతిస్పందించాలి. ఈ పరిణా మం భారత ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుం ది అన్నవి ముఖ్యమైన ప్రశ్నలు. ఈ సందర్భంలో మరో అంశం కూడా ప్రస్తావించుకోవాలి.

తటస్థంగా ఉండటం భారత్‌కు సముచితమైన మార్గం
పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని స్వాతంత్య్ర డిమాండ్‌ను మాత్రం తన అంతర్గత వ్యవహారం గా కొట్టిపారేస్తోంది. ఈ వైరుధ్యాన్ని అంతర్జాతీయ వేదికల పై ఎత్తిచూపడం ద్వారా పాకిస్థాన్ వాదనలోనిడొల్లతనాన్ని, ద్వంద్వనీతిని భారత్ చాకచక్యంగా ఎండగట్టవచ్చు. అయితే, పాకిస్థాన్ కు అసౌకర్యం కలిగించే ప్రతి అంశానికి బహిరంగం గా మద్దతు తెలపడం భారత్ అనుసరిస్తూ వస్తున్న, సంయ మనంతో కూడిన దౌత్యనీతికి అనుగుణంగా ఉండదు. దానికి తోడు బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించడం. ఆ ఉద్యమా నికి బహిరంగ మద్దతు ఇవ్వడం వంటి ప్రతికూల నిర్ణయాలు, పాకిస్థాన్ అంతర్గత ఘర్షణలో భారత్‌ను ప్రతినాయ కుడి పాత్రలో నిలబెడతాయి, భారత్ ఇతర దేశాల్లోని వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్న పాకిస్థాన్ ప్రచారానికి బలం చేకూర్చినట్లవుతుంది కూడా. అదే అలు నుగా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరింత దూకుడు ప్రద ర్శించే అవకాశమూ ఉంటుంది. అందుచేత ప్రస్తుత పరిస్థితు ల్లో అంతర్జాతీయ సమాజంలోని ఇతర దేశాల మాదిరిగానే బలూచిస్థాన్ స్వాతంత్య్ర ప్రకటనను గుర్తించకుండా, ఉద్య మానికి అధికారిక మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండటం భారత్‌కు సముచితమైన మార్గం.
-కృష్ణ బాలాజి పల్లపోతు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: