Krishna water : కృష్ణా జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కేవలం నదీ జలాలు కావు. కోట్లాది ప్రజల తాగునీరు, లక్షలాది రైతుల సాగునీరు, పరిశ్రమల అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి వీటి వెనుక కృష్ణా ప్రవాహం ఉంది. అందుకే నీటి లభ్యత తగ్గిన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం కొత్త విషయం కాదు. కానీ అవి పరస్పర ఆరోప ణలకు, ప్రాజెక్టుల వద్ద ఉ ద్రిక్తతలకు దారితీయకుండా రాజ కీయ విభేదాలను పక్కనపెట్టి సంస్థాగత పరిష్కారాల వైపు వెళ్లడం ఇప్పుడు అత్యవసరం. ఆగస్టు 26న నాగార్జున సాగర్ వద్ద మరోసారి నీటి విడుదలపై ఉద్రిక్తత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు కుడి కాలువకు సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, తెలంగాణ అధికారులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. రెండు రాష్ట్రాలు తాగునీటి అవసరాలను కారణంగా చూపాయి. ఈ పరిణామం నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయా ల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంతకుముందు ఆగస్టు 24న జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం లో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తదుపరి చర్చను సెప్టెంబర్ 4కు వాయిదా వేశారు. ఈ పరిణామాన్ని ఏ రాష్ట్రం తప్పు, ఏ రాష్ట్రం ఒప్పు అనే కోణంలో చూడటం సమస్యను మరింతసంక్లిష్టం చేస్తుంది. ముందుగా తాగునీటి అవసరాలు, తర్వాత సాగు నీటి అవసరాలు. వాటి మధ్య సమతుల్యతను శాస్త్రీయ లెక్కలతో నిర్ణయించడం ముఖ్యం.
Read Also : Srisailam : ఖాళీ అవుతున్న ‘శ్రీశైలం’..తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత తప్పదా ?

Krishna water : నీటి విడుదలకు కార్యాచరణ
నీటి విడుదలకు సంబం ధించిన ప్రతి నిర్ణయం అందుబాటులో ఉన్న నిల్వలు, ప్రవాహాలు, రాబోయే వర్షపాతం అంచనాలు, తాగునీటి అవసరాలు, గత వినియోగం వంటి అంశాల ఆధారంగా ఉండాలి. కృష్ణా జల వివాదానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1969లో ఏర్పాటైన కృష్ణా జల వి వాదాల ట్రిబ్యునల్ – ఈ (బచావత్ ట్రిబ్యునల్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ ల కేటాయింపు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ కేటా యింపును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎలా పంచుకోవా లన్నది ప్రధాన అంశంగా మారింది. తాత్కాలికంగా 512:299 నిష్పత్తి ప్రాతిపదికన నీటి వినియోగం కొనసాగు తున్నప్పటికీ, ఇది తుది అంతర్రాష్ట్ర పంపిణీ పరిష్కారం కాదు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసింది. అదే చట్టం లోని సెక్షన్ 89 కింద, ఇంతకుముందు నిర్ణయించని చోట ప్రాజెక్టు వారీగా కేటాయింపులు, లోటు ప్రవాహాల సమయం లో నీటి విడుదలకు కార్యాచరణ విధానాన్ని రూపొందించే అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-ఇఇ పరిధిలోకి వచ్చాయి. 2023లో కేంద్రం ట్రిబ్యునల్ – ఇఇకి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య మిగిలిన పంపిణీ అంశాలపై అదనపు టెరంస్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది.
తాగునీటికి అత్యవసర పరిస్థితి
అంటే ప్రస్తుత వివాదానికి న్యాయపరమైన వేదిక ఇప్పటికే ఉంది. అందువల్ల ప్రాజెక్టుల వద్ద పరస్పర ప్రతిఘటన కంటే ట్రిబ్యునల్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వంటి సంస్థాగత మార్గాలనే బలోపేతం చేయడం సమర్ధవంతమైన పద్ధతి. మొదటగా శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రయోజనాల ప్రాజెక్టుల విషయంలో రియల్టైమ్ డేటా ఆధారిత నీటి నిర్వహణ వ్యవస్థ రావాలి, నిల్వలు, ఇన్స్టాలు, అవుట్లు, కాలు వల వారీ విడుదలలు, తాగునీటి అవసరాలు వంటి వివ రాలు ఇరు రాష్ట్రాలకు ఒకే సమయంలో అందుబాటులో ఉండాలి. ఒకే డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసు కుంటే అనుమానాలకు, అపోహలకు అవకాశం తగ్గుతుంది. రెండోది సాధారణ వర్షపాతం, లోటు వర్షపాతం, తీవ్ర నీటి కొరత వంటి పరిస్థితులకు ముందుగానే ప్రత్యేక నీటి విడు దల ప్రొటోకాల్స్ రూపొందించాలి. తాగునీటికి అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా నీరు విడుదల చేయాలి? రెండు రాష్ట్రాల అవసరాలు ఒకేసారి పెరిగితే ప్రాధాన్యత ఎలా నిర్ణయించాలి? నిర్ణయం తీసుకునే గడువు ఎంత? ఇలాంటి ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు ఉండాలి. మూడోది రెండు రాష్ట్రాలూ కృష్ణాపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకోవాలి. చెరువుల పునరుద్ధరణ, వర పు నీటి సంరక్షణ, సూక్ష్మ సేద్యం, తక్కువ నీటితో సాగు, పట్టణ మురుగునీటి శుద్ధి-పునర్వినియోగం వంటి చర్యలు దీర్ఘ కాలిక పరిష్కారంలో భాగం కావాలి,

రాష్ట్రం విజయం అంటే మరో రాష్ట్రం ఓటమి కాదు
నీటి సమస్యను రాజకీ యంగా ప్రస్తావించడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ప్రజల తాగునీరు, రైతుల పంటలు, భవిష్యత్ నీటి భద్రత రాజకీయ భేదాల కంటే పెద్దవి. రెండు రాష్ట్రాల ప్రభుత్వా లు పరస్పరం విమర్శించుకోవడం ద్వారా తక్షణ రాజకీయ ప్రయోజనం పొందవచ్చేమో కానీ, దాని వల్ల నదిలో ఒక్క చుక్క నీరు పెరగదు. ఇంకా ముఖ్యంగా, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల వద్ద అధికారులు పర స్పరం ఎదురుపడే పరిస్థితి పునరావృతం కాకుండా స్పష్ట మైన సమన్వయ వ్యవస్థ అవసరం. నీటి విడుదలపై భిన్నాభిప్రాయం ఉంటే అది అధికారుల మధ్య ఘర్షణగా కాకుండా, బోర్డు ముందు సాంకేతిక చర్చగా పరిష్కారం కావాలి. కృష్ణా జలాల విషయంలో తుది పరిష్కారానికి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న వేళ, తాత్కాలిక నిర్వహణలో ఇరు రాష్ట్రాలూ సంయమనం పాటించడం మరింత అవసరం. ఎందుకంటే ఒక రాష్ట్రం విజయం అంటే మరో రాష్ట్రం ఓటమి కాదు. రెండు రాష్ట్రాల ప్రజ లకు తాగునీరు అందడం, రైతు లకు నమ్మకమైన నీటి ప్రణాళిక లభించడం, ప్రతి నీటి చుక్క సమర్థంగా విని యోగించడం అదే నిజమైన విజయం. కృష్ణా నీటిని పంచుకోవడం ఒక చట్టపరమైన అవసరం మాత్రమే కాదు, అది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరి పక్వతకు పరీక్ష, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షే మాన్ని ముందుంచి, న్యాయబద్ధత- పారదర్శకత- సహ కారం అనే మూడు సూత్రాలతో ముందుకు సాగితే కృష్ణా వివాదం శాశ్వత ఘర్షణగా మిగలదు. కృష్ణా జలాలు రెండు రాష్ట్రాల మధ్య గీత గీయడానికి కాదు. రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తును భద్రపరచడానికి ఉపయోగపడాలి.
-సి. హెచ్. ప్రతాప్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: