Gig workers : ‘గిగ్ ‘కు శుభసూచకం!

Follow Us: Google News Daily Hunt
Gig workers
Gig workers
FONT SIZE
GET APP

Gig workers : అసంఘటిత కార్మికులను ఆదుకునే వారుండరు. సత్రం భోజనం మఠం నిద్రలా వారి జీవితం వెళ్లి పోతుంది. వారికీ ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయి. కానీ తీర్చేదారే కనుచూపు మేరలో కనబడదు. నిజానికి ‘గిగ్ ఎకనామీ’లో యువత ఎక్కువ మందే ఆసక్తి చూపు తున్నారు. ఫుడ్డెలివరీ, రైడ్ షేరింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో పనిచేసే ‘గిగ్’ వర్కర్లకు ఇప్పుడిప్పుడే సమస్యలు ఎదురవుతున్నాయి. గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత, బాధ్యతల విషయంలో ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు ఆదేశాలిస్తున్నా అవి అమలయ్యే దారి కనపడదు. తాజాగా వారి హక్కులు, భద్రత (Safety)విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అడుగు ముందుకు వేసింది. గిగ్ వర్కర్ల భద్రతే ప్రధానంగా తీసుకొచ్చిన బిల్లులో వారిని పట్టించుకోక పోతే ఆగ్రిగేటర్లకు రూ. 50వేల పెనాల్టీ వేస్తారు. వారి కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కూడా ఉంటుంది. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగానే యూనిక్ ఐడి వస్తుంది. వారందరికీ ఈ బిల్లులోని సంక్షేమ ఫలాలన్నీ అందుతాయి. ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయి. ఆగ్రిగేటర్లు నిర్వహించే లావాదేవీ లలో 1-2 శాతం నిధులతో సంక్షేమ నిధి ఏర్పరుస్తారు. ఈ నిధి నుంచే కార్మిక బీమా, పెన్షన్, గిగ్ కార్మికుల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు సామాజిక భద్రత సంక్షేమ బోర్డునొక దానిని ఏర్పాటు చేస్తారు.

Read Also : Delhi cctv cameras : ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు

Gig workers
Gig workers

Gig workers : గిగ్ వర్కర్లలో ఆశ

మహిళలు దివ్యాం గులు సైతం ఇందులో భాగస్వాములే. ప్లాట్ఫారం ఆధారిత కార్మికులందరూ సభ్యులే. యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వివాదాలను పరిష్కరించే ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. గిగ్ వర్కర్ల సమస్యలన్నిటినీ క్రోడీకరిస్తూ వాటి పరిష్కారం కూడా అందులోనే చూపే విధంగా గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, (Safety)సంక్షేమ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. వారి భద్రత కోసం నిర్దేశించిన బిల్లులో గిగ్ వర్కర్లలో ఆశ ఏర్పడింది. వారి సంక్షేమార్థం గతంలో ఎలాంటి చట్టం రూపుదిద్దుకోలేదు. అందుచేత ఈ బిల్లు వారికి చీకట్లో వెలుగు రేఖ వంటిది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఉంటా రని అంచనా. తెలంగాణలో అయితే నిర్దిష్టంగా 4 లక్షల మంది వర్కర్లు ఉంటారు. వీరి కోసం నిర్దిష్టమైన వ్యవస్థ లేనందున వారికి ప్రత్యేక చట్టం అవసరమైంది. కాగా ఈ బిల్లులో ఉద్యోగులను తొలగించాలంటే యాజమాన్యానికి కేవలం 7 రోజుల వ్యవధి నిర్ణయించారు. ఈ వ్యవధిని మరికొంత కాలం పెంచాల్సిన అవస రముంది. కార్మిక శాఖమంత్రి ఛైర్మన్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు భారత ప్రభుత్వం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఆర్థిక రంగ నిపుణులు, పౌర సంఘాల నుంచి ఇద్దరు ఇలా కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించే వర్గాలప్రాతి నిధ్యం కూడా ఇందులో ఉంటుంది.

పింఛన్ సౌకర్యం

గిగ్ వర్కర్ల సమస్య లపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారి, అప్పిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తారు. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్ వంటి ఆగ్రిగేటర్లు గిగ్ వర్కర్ల యూని యన్లతో సమావేశమై ఉభయపక్షాల నుంచి సేకరించిన సలహాలు, అభిప్రాయాల అనంతరం ఈ బిల్లు రూపొందించారు. 20 మందితో సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయ డం విశేషం. అందులో ప్రభుత్వ అధికార్లు, ఆగ్రిగేటర్లు, వర్కర్స్ యూనియన్ మెంబర్లకు భాగస్వామ్యం కల్పి స్తారు. ప్రత్యేకించి వర్కర్లకు తక్కువ వడ్డీతో రుణాలు కల్పించడం, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వర్కర్ల రిజిస్ట్రేషన్ఫీజులో రాయితీ కల్పిస్తారు. గిగ్ వర్కర్లంటే అసంఘటిత కార్మికులు తప్ప మరొకరు కాదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం వీరికి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ వంటిసామా జిక భద్రతా ప్రయోజనాలను కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. అసంఘటిత రంగకార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలకు నాంది పలికారు. తుదిరూపం దిద్దుకున్నాక ప్రకటించడమే తరువాయి. ప్లాట్ఫామ్క కార్యకలాపాలు, అల్గారిథమిక్ నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవడమూ చట్టపరిధిలోవస్తుంది.

Gig workers
Gig workers

ఐదంకెల ఆదాయం కష్టమే

ఒక అసంఘటితమైన వ్యవహారానికి ఎంతో కట్టుదిట్ట మైన బిల్లుగా రూపొందించినట్లు అర్థమౌతుంది. కాలక్ర మేణ ఎదురైన సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు వీలుగా న్యాయమైన ఒప్పందాలు, నిబంధనలు, ప్రామా ణిక పారితోషిక రేట్లు కూడా చట్టబద్ధంగా ఖరారవుతా యి. గిగ్ వర్కర్లకు అన్ని రకాల భద్రత చేకూరినట్లే. గిగ్ వర్కర్లకు సమయం వారి చేతిలో ఉంటుంది. కానీ స్థిర మైన ఆదాయం కనిపించదు. కాలూ చెయ్యీ ఆడితేనే రోజు గడుస్తుంది. అయినా ఐదంకెల ఆదాయం కష్టమే. అందుకే వారు తప్పనిసరిగా భద్రత, బీమా వంటి సౌక ర్యాలు ఆశిస్తారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వారికోసం చట్టాన్ని తెచ్చినా కనీస వేతనం, ఆరోగ్య భద్రత, బీమా వంటి అంశాల్లో మరెంతో చేయాల్సిన అవసరం కనబడు తోంది. గతంలో వీరికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రచించకపోయినా సోషల్ సెక్యూరిటీకోడ్ 2020 పేరిట కొంతలో కొంత భాగస్వామ్యం కల్పించింది. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వృద్ధాప్య పింఛన్ వంటి ప్రయోజ నాలు కల్పించారు కానివాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు కనపడదు.
తాజాచట్టం గిగ్ వర్కర్స్క విస్తృతమైన భద్రత కల్పిస్తుంది. ఇదేస్ఫూర్తితో కేంద్రం అన్ని రాష్ట్రాలకు వర్తించేవిధంగా గిగ్వర్కర్స్ కోసం ప్రత్యేకించి చట్టంచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. గిగ్ వర్కర్ల కు చట్టపరమైన గుర్తింపు లభించడం ఒక ముందడుగే. ఇది కార్యరూపం దాల్చడం ఎంతో అవసరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు