Gen Z : మలి ప్రస్థానంలో ‘జెన్ జి ‘

Follow Us: Google News Daily Hunt
Gen Z
Gen Z
FONT SIZE
GET APP

Gen Z : ఒకటోసారి అనూహ్య విజయం. రెండోసారీ ‘జెన్ జి ‘కి తలొగ్గక తప్పలేదు. యువత ఆకాంక్షలను నెరవేర్చేం దుకు ఎవరైనా దిగిరావాల్సిందే. నిన్నమొన్నది. ‘జెన్ జి ‘ విజయం మరింత ముందుకు అడుగులు వేసే స్థాయికి యువతను ప్రేరేపిస్తోంది. ఆఫ్టరాల్ ‘జెన్జ’ అంటూ పెదవి విరచిన వారంతా వామ్మో! అని గొప్పగా చెప్పు కుంటున్నారు. జెన్ జిని ఇగ్నోర్ చేయలేమని వాళ్ల ఉద్య మం దెబ్బకు రాజీనామా సమర్పించిన నాటి కేంద్రవిద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ‘జెన్ జి ‘ ఉద్య మం విషయంలో తొలుత కేంద్రప్రభుత్వ పెద్దలు మాత్ర మే అంచనా వేయలేక అదెంత? అనుకుంటూ కాలయా పన చేసి ‘జెన్ జికి ఓ స్పష్టమైన రూపం బహిర్గతమవ డానికి కారణమయ్యారు. తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత, ప్రధాని మోడీ, మరెందరో ప్రముఖులు జెన్నీ సత్తాను ఎత్తిపడేస్తున్నారు. దేశ సమగ్ర అభివృద్ధి సాధనలో యువత బాధ్యులుకావాలని ప్రధాని నరేంద్రమోడీ కాక్రోచ్ల ఉద్య మానంతరం వాటి గురించి బ హిరంగంగా విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రథమం. ఐఐటి ఢిల్లీ 57వ వార్షికోత్సవ సభలో ప్రధాని మాట్లాడుతున్నారంటే యువత కేరింతలు కొట్టారు. యువత కాలేజీల్లోంచి బయటకు వెళ్తున్నారంటే వారు ఎదురు చూసేది తొలి జాబ్ ఆఫర్ కోసం. అందుకోబోతున్న మొదటి నెల జీతం కోసమేనన్నారు.


Read Also : Jharkhand Bandh: ఉద్యోగార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా జార్ఖండ్‌ బంద్

Gen Z
Gen Z

Gen Z : జెన్ జి తరం అవసరం ఎక్కువ

దాదాపు ప్రపంచమంతా జెన్ జి ఉద్యమాలతో సతమతమవుతుంటే భారత్ మాత్రం యువతను ఆ మధ్య పెద్దగా పట్టించుకున్నట్లు కనప డలేదు. తీరా ఇప్పుడు పట్టించుకోక తప్పలేదు. వికసిత్ భారత్ సాధనలో జెన్ జి తరం అవసరం ఎక్కువగా ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువత అధికంగా వినియోగించే సోషల్ మీడియా యాప్ ‘స్నాప్ చాట్’ తాజాగా తన అధికారిక చానల్ను ప్రారంభించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే అదనుగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార ఎన్డీఎ ప్రభుత్వాన్నుద్దేశించి ఒక రాగాలాపన చేశారు. దేశంలో విద్యాప్రమాణాలు పడిపోవడమే కాకుండా యువతలో నైరాశ్యంలో మునిగిపోయిందని ప్రయాగ రాజ్ కెపి గ్రౌండ్స్లో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. యువతకు సామర్ధ్యాలున్నా ఉద్యోగావకాశాల్లేవని ఎత్తి చూపారు.

ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు

ఇప్పుడు ‘జెన్ జి’ విజృంభిస్తున్నది కేవలం కేంద్రప్రభుత్వ వ్యవహారశైలి మీదనే కాదు, జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో జరిగిన అవ కతవకలకు నిరసనగా ఆ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిం చారు. నిరసనల సమయంలో పెల్లెట్గాన్ కాల్పుల, లాఠీచార్జిని ఎదుర్కొన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహబోరా విద ఓ అంగతకుడు సిరా జల్లి దుర్భాషలు మాట్లాడడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. అదంతా ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు ఆర్ఎస్ఎస్, బిజెపిలు డ్రామా ఆడుతున్నా యని విమర్శలు వెల్లువెత్తాయి. జెపిఎస్ సి పరీక్షను రద్దు చేయడమొక్కటే జార్ఖండ్ యువత కోరుకున్నారు. అది కూడా దాదాపు సాధించినట్లే. పేపరు లీకైపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై జార్ఖండ్ సర్కార్ దిగి వచ్చింది. అయినా విద్యార్థుల ఆందోళన ఆగలేదు. సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విజయవంతంగా కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఉద్రికత్త మొదలైంది. ప్రభుత్వం కొన్ని అంశాల్లో తలొగ్గి నా జార్ఖండ్ విద్యార్థులు పట్టువదల్లేదు. జెపిఎస్సి, జె ఎస్ఎస్సి జడ్ పరీక్షల రద్దుకు ప్రభుత్వం అంగీకరించిం ది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరగడంతో తమ భవిష్యత్ నాశనమౌతోందని విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేశారు.

Gen Z
Gen Z

క్రమశిక్షణగా మెల గడమే విశేషం

ఢిల్లీలో యువత కాక్రోచ్ పార్టీ నేతృత్వం లో ఆందోళన చేపట్టింది. అందులో పాల్గొన్న వారంతా యువత కనుక జెన్కో ఉద్యమంగా పిలువబడుతోంది. ఎంతో క్రమశిక్షణతో జరిగిన ఆ ఉ ద్యమం ప్రజల మన్న నలనూ అందుకుంది. రాజకీయులు ఆ ఉద్యమానికి రాజకీయ రంగు పులమాలని చూసినా ఎక్కడా ప్రత్యర్థులకు ఆ అవకాశం చిక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. యువత మలి అడుగు జార్ఖండ్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంట పడింది. ఎలా అయినా ఈ ఉద్యమానికి మచ్చి ఊపుతేవాలని యువజనులంతా తాపత్రయపడ్డారు. జార్ఖండ్లో కూడా యువత ఆగ్రహావేశాలు తెంచుకు న్నప్పుడు విద్యార్థి నేత దేవేంద్ర మహాతోవారిని అదుపు లో ఉంచి పోలీసులతో వాగ్వివాదానికి దిగొద్దని సూచిం చారు. ఇలాంటి ఉద్యమాల్లో ఎవరూ ఒక మాట మీద నిలబడే అవకాశం ఉండదు. అయినా క్రమశిక్షణగా మెల గడమే విశేషం. రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, తదితర వాహనాల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఉద్యమాన్ని రక్తి కట్టించారు. పోలీసులు కూడా అసెంబ్లీ లోకి ప్రవేశించబోయిన విద్యార్థులపై వాటర్ క్యాన్లు ఉపయోగించారు. బారికేడ్లు దాటి వచ్చిన విద్యార్థులను అదుపు చేయడం ఎంతోకష్టమైంది. నియామక ప్రక్రియ లో సంస్కరణలు అవసరమని ముక్తకంఠంతో ఎలుగెత్తా రు. క్రిమినల్ అంశాలను రాష్ట్ర సిఐడి దర్యాప్తుచేస్తుందని, 2023, 25 బ్యాక్గ్ నియామకాలు అక్రమాల్లో దర్యాప్తు చేస్తామని అంగీకరించారు. ఢిల్లీలో యువత ఆందోళన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు వారిని నడిపించే పార్టీ లు సైతంయువత ఉద్యమాలపై తమతమ అభి పాయాలు మార్చుకున్నాయి. యువతను దేశ నిర్మాణ సాధ నాలుగా మార్చుకోవాలని ఆర్.ఎస్.ఎస్ చీఫ్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. యువత ప్రశ్నించడాన్ని తప్పుపట్టలేమని, వారి ఆలోచనలను తొక్కి పారేయడం కన్నా దేశాభివృద్ధి లో భాగస్వాములుగా చేయాలని సందేశం సారాంశం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు