Electric vehicles : ‘పచ్చని’ ప్రయాణమే ప్రగతికి మార్గం

Follow Us: Google News Daily Hunt
Electric vehicles
Electric vehicles
FONT SIZE
GET APP

Electric vehicles : మానవజాతి సాధిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక ప్రగతి ఒకవైపు జీవన ప్రమాణాలను అపారంగా పెంచు తుంటే, మరోవైపు ప్రకృతి సమతుల్యతను ఘోరంగా దెబ్బ తీస్తోంది. భూగోళాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర వాతావరణ మార్పులు, శరవేగంగా పెరుగుతున్న కార్బన్ ఉద్గారాల నేప థ్యంలో పర్యావరణానికి మేలు చేసే హరిత రవాణా వైపు అడుగులు వేయడం కాలప్రవా హంలో ఒక అనివార్యమైన అవసరంగా మారింది. కేవలం ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని, కాలుష్యరహిత పచ్చని వాతావరణాన్ని అందించ డానికి విద్యుత్తు వాహనాల విప్లవం ఒక చారిత్రక చైతన్యంగా నిలిచింది. సాంప్రదాయ పెట్రోలు ద్విచక్ర వాహనాల స్థానా న్ని పర్యావరణ అనుకూల ఈవీలు ఆక్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటును మించి ఈ హరిత మార్పుకు విప్లవాత్మకంగా స్వాగతం పలుకుతుం డటం అభినందనీయం, సర్వత్రా ఆదర్శనీయం. ప్రస్తుత ఆధునిక కాలంలో నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు ఒకవైపు మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటే, మరో వైపు వాహనాల పొగ వల్ల నగరాల్లో వాయుకాలుష్యం జీవన ప్రమాణాలను తీవ్రంగా క్షీణింపజేస్తోంది.

Read Also : Indian Railway Tatkal Booking : రైల్వే తత్కాల్ బుకింగ్‌లో విప్లవాత్మక మార్పు – ‘టోకెన్ సిస్టమ్’ అమలు

Electric vehicles
Electric vehicles

Electric vehicles : పర్యావరణ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మహానగరాల రోడ్ల పై కిలోమీటర్ల మేరసాగే వాహనాల రద్దీ, అవి వదిలే విష పూరిత వాయువులు వాతావరణాన్ని నరకప్రాయంగా మారు స్తున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు కాలు ష్యం కారణంగా నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈపర్యావరణ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపించగల ఏకైక ప్రత్యా మ్నాయ మార్గం విద్యుత్తు రవాణా వ్యవస్థ మాత్రమేనని ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. ఒకప్పుడు విద్యుత్తు స్కూటర్లను కేవలం ఒక విలాసవంతమైన ఆప్షన్ గా లేదా సరికొత్త సాంకేతిక ప్రయోగంగా చూసిన వినియో గదారులు, నేడు పర్యావరణ హితాన్ని, సుదీర్ఘకాలంలో లభించే అత్యంత తక్కువ నిర్వ హణ వ్యయ ప్రయోజనా లను స్పష్టంగా గుర్తి స్తున్నారు. పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటి సామాన్యుడి ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న తరుణంలో, ఈవీలు ఒక గొప్పవరంగా మారాయి. కేవలం పెట్రోలు ఖర్చులను ఆదా చేయడమే కాకుండా, శబ్ద కాలుష్యం, పొగ లేని స్వచ్ఛమైన ప్రయాణ అనుభూతిని పొందడానికి ప్రజలు ఈవీల కొనుగోలుపై మక్కువ చూపుతున్నారు. ఇది కేవలం ఒకవాహనం మార్చి డి అనే ఆర్థికపరమైన ఎంపిక మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో తాము కూడా నేరుగా భాగస్వాములం కావా లనే సామాజిక బాధ్యతతో కూడిన గొప్పఅడుగుగా భావిం చాలి.

ఈవీల వాటా పెరుగుతుండటం

పర్యావరణ స్పృహతో హరిత రవాణాను అలవర్చుకో వడంలో దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందువరుసలో నిలవడం మన తెలుగు ప్రజల ఆలోచనా విధానానికి నిలువెత్తు అద్దం పడుతోంది. 2025-26 ఆర్ధిక సంవత్స రపు అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, దేశ వ్యాప్తంగా ద్విచక్ర విద్యుత్తు వాహనాల వ్యాప్తి సగటున 7.8 శాతంగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో అది 9.3 శాతంగాను, తెలంగాణలో ఏకంగా 10.2శాతంగాను నమోదైంది. ఈ గణాంకాలు తెలుగు ప్రజలలో పర్యావరణహిత ఇంధన వనరుల పట్ల పెరుగుతు న్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాలుష్య ప్రభా వం ఎక్కువగాఉండే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి పెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లో సైతం ఈవీల వాటా పెరుగుతుండటం అత్యంత సానుకూల పరిణామం. తెలంగాణలోని పెద్ద నగరాలలో ఈవీల వాటా 12శాతానికి చేరగా, రెండో శ్రేణినగరాలలో 11 శాతం, చిన్న పట్టణాలలో కూడా 9.2శాతం మార్కెట్ వాటాను సాధిం చడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో సైతం ఇదే విధమైన పర్యా వరణ చైతన్యం ప్రతిబింబిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఏపీలోని రెండో శ్రేణి నగరాల్లో ఈవీల ఆదరణ 7.5శాతం నుండి 10.2శాతానికి పెరగగా, మూడోశ్రేణి నగరాల్లో 6.2 శాతం నుండి 8.7 శాతానికి వృద్ధిచెందింది. ఈ అద్భుతమైన వృద్ధిరేటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, తృతీయశ్రేణి పట్టణ స్థాయికి కూడా శరవేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేస్తోంది.

ఎక్కువ మైలేజీ

పర్యావరణానికి మేలుచేసే వాహనాలు అందరికీ చేరాలంటే, వాటి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. పర్యా వరణ హితం ఎంత ముఖ్యమైనదైనా, సామాన్యుడికి ఆర్ధిక లభ్యత లేనిదే ఏవిప్లవమైనా అర్థాంతరంగా ఆగిపోకతప్పదు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ పెట్రోలు స్కూటర్లకు, విద్యుత్తు స్కూటర్లకు మధ్య ఉన్నధరల వ్యత్యాసం క్రమం గా తగ్గుతుండ టం శుభపరిణామం. ఈవీలలో అత్యంత కీలకమైన బ్యాటరీ’ తయారీ ఖర్చులు దేశీయంగా తగ్గడం, విడిభాగాలు స్థానికంగానే లభించడం ఇందుకు ప్రధాన కార ణం. భవిష్యత్తులో బ్యాటరీ సాంకేతికత మరింత మెరుగై, స్థానిక ఉత్పత్తి పెరిగితే, పెట్రోలు స్కూటర్లతో సమానమైన ధరలోనే పర్యా వరణ అనుకూల ఈవీలు లభించే రోజులు ఎంతో దూరం లో లేవు. అయితే, స్కూటర్ల విభాగంలో కనిపిస్తున్న ఈ హరిత వేగం ‘విద్యుత్తు మోటార్ సైకిళ్ల (ఇబైక్స్) విభాగంలో ఇంకా వెనకబడే ఉంది. మార్కెట్లో పెద్ద కంపెనీలు మొదట ఇస్కూటర్లనే అందించడం వల్ల, బైక్ ప్రియులు ఇంకా సాంప్రదాయ ఇంధన వాహనాలపైనే ఆధా రపడుతున్నారు. మన దేశంలో, ముఖ్యంగా గ్రామీణ అర్ధపట్టణ ప్రాంతాలలో బైకుల వినియోగం అత్యధికం. ఎక్కువ మైలేజీ, పటిష్టమైన బాడీ, నమ్మకమైన సాంకేతికతతోకూడిన ఇబైకులు అందుబాటులోకి వస్తే, కాలుష్యకారక బైకుల శకం కూడా ముగిసిపో తుంది. ఈవిషయంలో వాహన తయారీ కంపెనీలు పరిశోధనలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరిత రవాణావైపు ప్రజలు పూర్తిగా మార డానికి మార్కెట్లో కొన్ని సహజమైన అపోహలు, మౌలిక సవాళ్లు అడ్డుపడుతున్నాయి. బ్యాటరీ మన్నిక ఎన్ని రోజులు ఉంటుంది? ఒకే చార్జింగ్పై వచ్చే అసలు మైలేజీ ఎం? దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు లభించే చార్జింగ్ మౌలిక వస తులు, రీసేల్ విలువపై వినియోగదారులలో అనేక సందేహా లున్నాయి.

Electric vehicles
Electric vehicles

ఉజ్వల భవిష్యత్తుకు అసలైన పునాది

పర్యావరణ మార్పును కాంక్షించే కొనుగోలుదారు లకు డీలర్లు, తయారీ సంస్థలుస్పష్టమైన వారంటీలు, బ్యాటరీ సామర్థ్యంపై పూర్తి నమ్మకాన్ని కలిగించాలి. ఏ థర్ ఎనర్జీ వంటి ప్రముఖ సంస్థలు ఈదిశగా వినియోగదారులకు అవ సరమైన పూర్తి సహాయ స హకారాలు అందిస్తూ మార్కెట్లో విశ్వసనీయతను పెంచుతున్నాయి. ప్రభుత్వాలు కూడా చార్జింగ్ స్టేషన్ల గ్రిడ్ను దేశవ్యాప్తంగా పెంచడానికి రాయితీలు ఇవ్వాలి. భారత ప్రభుత్వం దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు 2030 నాటికి కొత్త వాహనాల విక్రయా లలో కనీసం 30శాతం వాటాను విద్యుత్తు వాహనాలుగా మార్చాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ హరిత లక్ష్య సాధన దిశగా సాఫ్ట్వేర్ అప్డేట్లు, పటిష్టమైన చార్జింగ్ వ్యవస్థ, సులభమైన సర్వీసింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ ఈవీలు కేవలం రవాణా సాధనాలుగా కాకుండా, స్మార్ట్ పరికరాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ధోరణి కేవలం ఆసక్తి చూపడం నుండి హరిత వాహనాలను నేరు గా కొనుగోలు చేసేస్థిరమైన స్థాయికి మారుతోంది. కాలుష్య రహిత సమాజ స్థాపన, పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభు త్వాల బాధ్యత మాత్రమేకాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక కర్తవ్యం. పర్యావరణానికి మేలు చేసే హరిత రవాణా వైపు అడుగులు వేయడం కాలప్రవాహంలో అనివార్యమైన అవ సరంగా గుర్తించి, సాంప్రదాయ ఇంధన వాహనాల స్వార్థాన్ని వీడి, పచ్చని ప్రకృతి కోసం విద్యుత్తు వాహనాల వైపు మళ్లడమే నేటి వివేకం. హరిత ప్రయాణమే రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు అసలైన పునాది, మనం ఈ రోజు తీసుకునే ఒక్కో హరిత నిర్ణయం, రేపటి స్వచ్ఛమైన గాలికి ప్రాణ వాయువుగా మారుతుందని విస్మరించరాదు.

-వనకల్ల వీరప్ప

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు