Electric bus : ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రయాణికుల భద్రత!

Follow Us: Google News Daily Hunt
Electric bus
Electric bus
FONT SIZE
GET APP


Electric bus
: ఆధునిక మానవులు సాధిస్తున్న అద్భుతమైన సాంకేతిక ప్రగతి, ప్రతిఫలంగా అభివృద్ధిలో అప్రతి హతంగా ముందుకు సాగుతున్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ, కోట్ల సంఖ్యలో రహదారులపై శరవేగంగా పరుగులు పెడుతున్న రకరకాల చిన్నా, పెద్ద వాహనాల మూలంగా కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యంతో భూతాపం పెరుగుతోంది. సదరు వాహనాల వినియోగం కోసం సాంప్ర దాయ శక్తి వనరులైన బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాల నిల్వలు రోజు రోజూ అడుగంటి పోతున్నవి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాంప్రదాయ శక్తి వనరుల కొరతతో ఆటోమొబైల్ రంగం అంతరించిపోయే ప్రమాద మున్నది. ఫలితంగా దేశ ఆర్థికాభివృద్ధికి ఇరుసుగా కొన సాగుతున్న ఉపరితల రవాణా రంగం పెను ప్రమాదంలో చిక్కుకోక తప్పదు. తదనంతర పరిణామాల నేపథ్యంలో దేశ ప్రజల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఈ విపత్తు నుండి దేశ ప్రజలను కా పాడడానికి ప్రభుత్వం శిలాజ ఇంధ నాలైన బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగానికి ప్రత్యా మ్నాయంగా సాంప్రదాయేతర శక్తి వనరులైన సోలార్, విండ్ పవర్, హైడల్ పవర్, టైడల్ పవర్లను, బయోగ్యాస్, బయోమాస్ తదితర పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలనే లక్ష్యంతో ఇంధన విధానాన్ని రూపొందిం చి ముందుకు సాగుతున్న వైనం అభినందనీయమే.

Read Also : Chikkaballapur Road Accident: లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు.. డ్రైవర్‌తో సహా ఇద్దరు మృతి!


Electric bus

Electric bus


Electric bus : పర్యావరణ విచ్ఛిత్తికి కారణం

ఆధునిక మానవాళి నడవడిక, దైనందిన వ్యవహార శైలి ఫలితంగా భారీ మొత్తంలో వాహనాల వినియోగం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులతో భూతావం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. తద్వార సౌకర్యవంతమైన ఆధునిక మానవ జీవనానికి ఊపిరులూదాల్సిన రవాణా రంగం పర్యావరణ విచ్ఛిత్తికి కారణంగా మారుతూ మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నది. ఈనేపథ్యం లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం 17 సుస్థి రతతో కూడిన అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి వాటి సాధన ప్రపంచ దేశాల బాధ్యతగా నిర్దేశించిన వైనం బహిరంగ రహస్యమే. ఉపరితల రవాణా రంగంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, వ్యయ నియంత్రణ, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లాంటి చతుర్ముఖ వ్యూహం తో ముందుకు సాగుతున్న మన దేశం నేషనల్ ఎలక్ట్రికల్ బ కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో భాగంగా వివిధ కార్పొరేట్ సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. సదరు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా టెండర్ని దేశంలో కమ ర్షియల్ ఇ.విల తయారీలో దాదాపు గుత్తాధికారిగా కొనసా గుతున్న జై భారత్ మారుతి సంస్థ (జె.బి.యమ్) సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 2023 లోనే తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖకు పది సంవత్సరాల కాలపరిమితి తో 500 ఎలక్ట్రికల్ బస్సులను పంపడం గమనార్హం.

నాణ్యత లేని విదేశీ బ్యాటరీ

సదరు బస్సులను టి.జి.యస్.ఆర్. టి.సి రాష్ట్ర ంలోని వివిధ బస్ డిపోలకు పంపించడం గమనార్హం. ఆ క్రమంలో కరీంనగర్ రీజియన్ కు 104 ఇ.వి.బస్సులు కేటాయించడం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఇ.వి బస్సులను సమకూర్చడం, వాటికి డ్రైవర్లను నియామకం చేయడం, నిర్వహణలో అవసరాన్ని బట్టి తగు రిపేర్లు చేయించడం జె.బి.యమ్ సంస్థ బాధ్యతయే. ఇక తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కండక్టర్లను నియామకం చేసుకుని ప్రయాణికుల నుండి రోజువారీ రెవెన్యూని వసూలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కిలోమీటర్కి రూ.39.80 ల చొప్పున జె.బి.యమ్ యాజమాన్యానికి చెల్లించాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుని ప్రశ్నార్ధకంగా మారుస్తూ వాహనాలలో ప్రయాణిస్తున్న వారిని ప్రమాదాలకు గురిచేస్తున్నది నాణ్యత లేని విదేశీ బ్యాటరీ లేననేది నిపుణుల వాదన వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు మొరాయించడం, అగ్నికి ఆహుతవడం, భద్రతతో కూడిన ఛార్జింగ్ నియమ నిబంధనల పట్ల స్పష్టత లేకపోవడం, ఛార్జింగ్ సదుపాయాల కొరత, ఛార్జీ చేసేటప్పుడు కనెక్టర్ల సమస్యలతో పేలి పోవడం లాంటి ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఒకటి తిమ్మా పూర్ దగ్గర క్షణాలలో కాలి బూడిదయ్యింది. రెండు మూడు రోజుల వ్యవధిలో మరో బస్సు స్థానిక బస్ డిపో ఆవరణ లోనే ఛార్జ్ చేస్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది. పై రెండు ఘటనల్లో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. ఈ దుర్ఘటనలు జరిగిన తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో జె.బి.యమ్ సంస్థ టి.జి.ఆర్.టి.సి.కి సమకూర్చిన 500 ఇ.వి లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

రోడ్ ట్యాక్స్, రిజి స్ట్రేషన్ ఛార్జీల మినహా యింపు

మరో వైపు సదరు దురదృష్టకర సంఘటనలపై శాఖాపరమైన సమగ్ర దర్యా ప్తుకు ఆదేశాలను ఇస్తూనే చైనా బ్యాటరీ టెక్నికల్ టీమ్ నేతృత్వంలో టి.జి.యస్.ఆర్.టి.సి ఇంజనీర్లబృందం జతగా నిలిపివేసిన 500 ఇ.వి.లలో 150 బల్లను తనిఖీచేసి అవి లోపరహితంగా వంద శాతం ఫిట్గా ఉన్నాయని ప్రకటించి వాటిని వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఇక మిగతా 350 ఇ.వి.ల నాణ్యతావరంగా ఫిట్ గా ఉన్నాయని తేలిన తర్వాతనే వాటిని రవాణాశాఖ ఉప యోగిస్తుందేమో! ఒక వేల అవి కూడా నాణ్యత పరంగా ఫిట్గా ఉన్నాయని తేలితే ఇ.విలు దగ్ధం కావడానికి కారణా లేమిటో మరింతలోతుగా, మరో కోణంలో అధ్యయనం కొనసాగించక తప్పదు. అధ్యయనాలు, ఫలితాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రజల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇ.వి లలో ప్రయాణాలు చేయక తప్పదు. రాష్ట్ర రహదారుల పై భారీ మొత్తంలో వాహనాలు విడుదల చేస్తున్న కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారికి రోడ్ ట్యాక్స్, రిజి స్ట్రేషన్ ఛార్జీల మినహా యింపు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డిస్కౌంట్ మరిన్ని ప్రోత్సాహకాలు, వాయిదాల పద్ధతిలో ఋణ సదు పాయాల కల్పనలతోపాటు ధర ఎక్కు వైనా సదరు వాహనాలు ఇస్తున్న మైలేజీ ఆర్ధికంగా ఆకర్షణీ యంగా ఉంటున్న నేపథ్యంలో వాటికి డిమాండ్ పెరుగు తోంది. డిమాండికి సరిపడా విద్యుచ్ఛక్తి వా పానాలను ఉత్పత్తి చేయడం కోసం బడా బడా ఆటోమొబైల్ పరిశ్రమలతోపాటు చిన్నచిన్న స్టార్టవ్లకు సైతం ప్రభుత్వం అవసరమైన ప్రోత్సా హకాలను, రాయితీలను అందిస్తున్న క్రమంలో కొంతమంది. ఉత్పత్తి దారులు లాభాలకోసం ఇ.విల తయారీలో నాణ్యత లేని బ్యాటరీలను ఉపయోగిస్తున్న కారణంగా వారు ఉత్పత్తి చేస్తున్న ద్విచక్ర విద్యుత్ వాహనాలు ప్రమాదాల పాలిట బడుతున్నవనేది నిపుణుల నిశ్చితాభిప్రాయం.


Electric bus

Electric bus

విదేశాలనుండి దిగుమతి

స్వదేశంలో బ్యాటరీల తయారీ అంతంత మాత్రంగానే జరుగుతుండడం వాటి తయారీకి సంబంధించి రీసెర్చ్ జరగక పోవడం, అధిక శాతం బ్యాటరీలను చైనా తదితర విదేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా ప్రభుత్వాల ఈ. విపాలసీ ఫలితంగా పరిశ్రమకూ, ఔత్సాహికులైన కొనుగోలు దారుల కు అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాలు, రాయితీల నేప థ్యంలో భారీ మొత్తంలో ఇవి లు రోడ్ల పైకి వస్తున్నాయి. ఐతే ఆశ్చర్యకరంగా వాటిని నిరంతరం ఉపయోగించడానికి అవసరమైన మేరకు రీచార్జ్ చేయడానికి కావలసిన సంఖ్య లో ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లు లేకపోవడం వాటి వినియో గానికి ప్రధాన అవరోధంగా మారుతున్నది. విద్యచ్ఛక్తి వాహ నాల కొనుగోలుకు ఆర్ధిక సదుపాయాన్ని సమకూరుస్తున్న ప్రైవేట్ ఫైనాన్సర్లు కొనుగోలు దారులు వాయిదాల ను చెల్లించనప్పుడు రిమోట్ ద్వారా బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ను హ్యాక్ చేసి ఇ. విలను లాక్ చేస్తున్నారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేల అదే నిజమైతే ఇలాంటి సాంకేతికత ఉగ్రవాదులు, దేశద్రోహుల చేతుల్లోకి వెళ్తే ప్రయా ణీకుల భద్రతతోపాటు దేశ భద్రతకు పెనుప్రమాదంవాటిల్లు తుందనే ఉద్దేశంతో వీటికి సంబంధించిన కొన్ని యాప్లను డిజిటల్ ప్లాట్ ఫాంల నుండి బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీచేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

-డాక్టర్ నీలం సంవత్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు