Digital services : డిజిటల్ మౌలిక వసతుల భద్రతకు జాతీయ కార్యాచరణ

Follow Us: Google News Daily Hunt
Digital services
Digital services
FONT SIZE
GET APP

Digital services : భారత్ వేగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. బ్యాంకింగ్, విద్యుత్ పంపిణీ, రైల్వేలు, విమానయానం, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ చెల్లింపులు, ఇ-వాణిజ్యం వంటి రంగాలు సమా చార సాంకేతికతపై అధికంగా ఆధారపడుతున్నాయి. ఈ మార్పు ప్రజలకు సౌలభ్యం, పారదర్శకత, వేగవంతమైన సేవలను అందిస్తున్నప్పటికీ, సైబర్ ముప్పులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందువల్ల డిజిటల్ మౌలిక వసతుల భద్రత ఇప్పుడు కేవలం సాంకేతిక అంశం మాత్ర మే కాదు, జాతీయ భద్రత, ఆర్ధిక స్థిరత్వం, ప్రజా విశ్వా నంతో ముడిపడిన అత్యంత కీలక అంశంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ గ్రిడ్లు, విమానాశ్ర యాలు, రైల్వే నియంత్రణ వ్యవస్థలు, బ్యాంకింగ్ నెట్ వర్క్స్లు, ఆరోగ్య సమాచార వ్యవస్థలపై ఫైబర్ దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి దాడులు సేవలకు అంతరాయం కలిగించడమే కాకుండా కోట్లాది ప్రజల వ్యక్తిగత సమాచా రం, ఆర్ధిక లావాదేవీలు, ప్రభుత్వ సమాచారాన్ని ప్రమాదం లో పడేస్తాయి. డిజిటల్ సేవలపై ప్రజల విశ్వాసం నిలవా లంటే భద్రతా ప్రమాణాలు కాలానుగుణంగా బలోపేతం కావాలి.

Read Also : NEET UG 2027: ఇక నుంచి నీట్ పరీక్ష కంప్యూటర్‌లోనే

Digital services
Digital services

Digital services : భద్ర తా ప్రమాణాల నవీకరణ

దేశంలోని కీలక మౌలిక వసతులకు బహుళస్థాయి సైబర్ రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరం. విద్యుత్ పంపిణీ కేంద్రాలు, చమురు, వాయువు నెట్వర్క్ లు, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలు, విమానయాన నియంత్రణ కేంద్రాలు, ఆసుపత్రుల డిజిటల్ వేదికలు వంటి వ్యవస్థ ల్లో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర స్పందన కేంద్రాలు, భద్ర తా ప్రమాణాల నవీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాంకే తిక లోపాలను వేగంగా గుర్తించి సరిదిద్దే విధానాలు ప్రతి సంస్థలో తప్పనిసరి కావాలి. ఈ దిశగా క్రమానుగతసైబర్ భద్రతా ఆడిట్లు, అత్యవసర పరిస్థితులపై మాక్తేల్లులు, ప్రమాద మదింపు కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. కీలక మౌలిక వసతులను నిర్వహించే ప్రతిసంస్థకు స్పష్ట మైన సైబర్ అత్యవసర స్పందన ప్రణాళిక ఉండాలి.. దాడి జరిగిన సందర్భంలో సేవలు ఎంతవేగంగా పునరుద్ధరించ గలమనే సామర్థ్యాన్ని కూడా తరచూ పరీక్షించాలి. డేటా బ్యాకప్ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ నియంత్రణ కేంద్రాలు, సురక్షిత క్లౌడ్ మౌలిక వసతులు కూడా ఈ వ్యూహంలో భాగం కావాలి. స్వదేశీ సైబర్ భద్రతా సాంకేతికత అభి వృద్ధి కూడా కాలానుగుణ అవసరంగా మారింది. విదేశీ సాఫ్ట్వేర్పై పూర్తిగా ఆధారపడకుండా స్వదేశీ భద్రతా పరి ష్కారాలు, గుప్తీకరణ విధానాలు, భద్రతా పరికరాల అభి వృద్ధికి పరిశోధనను ప్రోత్సహించాలి.

Digital services
Digital services

సైబర్ భద్రతపై అవగాహన

విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలు కలిసి నూతన భద్రతా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. ఈదిశగా నైపుణ్యం కలిగిన సైబర్ భద్రతా నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, ఉన్నత విద్యాకోర్సులు విస్తరించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధస్సు ఆధారిత భద్రతా వ్యవస్థలు సైబర్రెరక్షణలో కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. అసాధారణ కార్యకలాపాలను క్షణాల్లో గుర్తించడం, అనుమానాస్పద లావాదేవీలను విశ్లే షించడం, దాడుల నమూనాలను ముందుగానే అంచనా వేయడం వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సు సమర్థవం తంగా ఉప యోగపడుతోంది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లుకూడా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నం దున భద్రతావ్యవ స్థలు నిరంతరం నవీకరించబడుతూ ఉండాలి. డిజిటల్ భద్రత ప్రభుత్వ బాధ్యతతో మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం, సమా చార మార్పిడి, సంయుక్త భద్రతా విన్యాసాలు, అంతర్జా తీయ సహకారం, బలమైన చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతం కావాలి. ప్రజల్లో కూడా సైబర్ భద్రతపై అవ గాహన పెంపొందించడం అత్యంత ముఖ్యం. బలమైన పాస్వర్డు వినియోగించడం. అనుమానాస్పద లింకులను నివారించడం, డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండ డం వంటి అలవాట్లు వ్యక్తిగత భద్రతకు తొలి రక్షణగా నిలుస్తాయి. సాంకేతిక పురోగతికి సమానంగా భద్రతా ప్రమాణాలను పెంపొందించినప్పుడే డిజిటల్ భారత్ మరింత విశ్వసనీయంగా, సురక్షితంగా, ప్రపంచ స్థాయిలో పోటీపడగల ఆర్ధిక శక్తిగా ఎదుగుతుంది.

-సి.హెచ్.ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు