Death Knell : మరణ మృదంగం!

Follow Us: Google News Daily Hunt
Death Knell
Death Knell
FONT SIZE
GET APP

Death Knell : వామ్మో! ‘చెవులు బద్ధలైపోతున్నాయి. ఇక ఆపు తారా! అనే మాటలు తరచు వినే రోజులొచ్చేసా యి. శబ్ద వ్యాప్తిలో ఇదో కొత్త తతంగం, పక్కవాడు ఏమనుకుంటాడో అనే మర్యాదకూడా ఉండదు. ఎవడెలా పోతే నాకేంటి? అనే ధోరణి వచ్చేసింది. అదే ధోరణి ఇప్పుడు ఓ నిండుప్రాణాన్ని మింగేసింది. పట్టణాల్లో ఏ పండుగో, మతపరమైన వేడుకలో జరిగినప్పుడు డిజె సౌండ్లు విపరీతంగానే వినిపిస్తుంటాయి. నిజానికి ఇలాంటి కాలుష్యాన్ని అరికట్టే పరిధి పోలీసులకే ఉన్నందున పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. మళ్లీ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పందిళ్లు, సందళ్లు, తప్పవు. కొంత మంది వీటిని ఆహ్లాదంతో ఆహ్వానించినా, మరికొంత మంది శబ్దకాలుష్యాన్ని భరిం చలేక చెవులు మూసుకుంటారు. ఈ శబ్దకాలుష్యానికి పరిమితులుంటాయి. వీటిని పబ్లిక్ న్యూసెన్స్ భావిం చే పరిస్థితి రానీయకూడదు. ఎంతో మంది అనారోగ్యా నికి గురవకుండా ఆపడానికి ఇలాంటి విపరీత శబ్దసంకే తాలు మనిషి ఆరోగ్యానికి చేటు తెస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఒక్కొక్కప్పుడు గుండెపోటుకు దారి తీస్తుంది. తాజాగా అలాంటి సంఘటన జరిగింది. నిజ నికి ఆ శబ్దాలు విన్నంతసేపూ ఎవరికీ అవి మరణ మృదంగపు శబ్దాలు కాకూడదని ఆశిద్దాం. కానీ ఎక్క డైనా ప్రాణం పోయిన ఉదంతాలు తారసపడినప్పుడు మాత్రమే ఆ శబ్దాల భయంకర వికృత స్వభావం అర్థ మౌతుంది. జనాన్ని ఒక్కోసారి ఆనందడోలికల్లో ముంచెత్తే శబ్ద భావతరంగాల వికృత రూపం సామాజిక స్పృహకు అందని విషయం.

Read Also : Hyderabad: 9 కి.మీ. భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌‎ నిర్మాణంతో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు

  Death Knell
Death Knell

Death Knell : డిజెసౌండ్ సిస్టమ్స్ మోత మరీ ఇబ్బంది

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిజె ధ్వని ఒకరిని గుండెపోటుకు బలి చేసింది. శనివారం రాత్రి సిటీలోని రాంనగర్ వద్ద నిర్వ హించిన గణేష్ ఆగమన్ కార్యక్రమంలో 18ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలాడు. జనం ఉత్సాహభరితంగా ఊగిపోతూ పక్కన హఠాత్తుగా పడిపోయిన ఆ యువకుడ్ని పట్టించు కోలేకపోయారు అటు తన్మయత్వంలో గంతులేస్తూ పక్కన జరిగే విషయాలను పట్టించుకోలేని సామాజిక చైతన్యం మనది. కమ్మని గొంతుతో శృతియుక్తంగా పాడే పాటలు ఎన్నైనా ఎంత సేపయినా వినవచ్చునేమో! కానీ కర్ణకఠోరం గా ఉండే డ్రమ్ముల బీభత్సాన్ని వాటి నుంచి జనించే ధ్వనిని తట్టుకోవడం పెద్ద తరానికి అంత వీలైన పరిస్థితి కాదు. ఆధునిక సంగీత వాయిద్యాలు, పాశ్చాత్య పోకడలు జతకూడి ‘శబ్దహింన’కు పాల్పడుతున్నాయంటే అతిశయోక్తి కానేరదు. డ్రమ్ముల మోతే కాదు మైకుల హోరు టపాసుల జోరు, యువకులు చిందులు వేస్తూ గోల చేయడం ఇవన్నీ శ బ్దతీవ్రతను పెంచేవే. ఆయా మండపాల చుట్టుపక్కల ఉండే నివాస భవనాల్లో జీవి స్తున్న వారు ఈగగ్గోలు వినలేక చెవులు మూసు కున్నా తలపులు వేసుకున్నా రాత్రిళ్లు నిద్రపట్టే పరిస్థితి లేదు. డిజెసౌండ్ సిస్టమ్స్ మోత మరీ ఇబ్బంది కలిగి స్తోందనుకుంటే ఆ వెనుక వాయిద్యాల గోల మరింత చీకాకు కలిగిస్తోంది. ఇలాంటి ఆటపాటలకు, వినిపిస్తున్న శబ్దాలకు కూడా పరిమితులున్నాయి. వాటిని పాటించక పోవడం వలనే కొంత అసౌకర్యం కలుగుతోంది.

ఒక్క హైదరాబాద్ సిటీకే కాదు దేశమంతటా

గ్రేటర్ హైదరాబాద్లో నిబంధనల మేరకు పాఠశాలలు, పారి శ్రామికవాడలు, జనావాస ప్రాంతాలు, ఆసుపత్రులు ప్రార్థనాస్థలాల వద్ద ‘ధ్వని’ ఏ మేరకు ఉండవచ్చో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలున్నా పాటించేటట్లు చూడా ల్సింది స్థానిక పోలీసులే. వారు ఏమాత్రం ఏమరుపాటు గా ఉన్నా ‘డిజె’ కార్యక్రమ నిర్వహకులు ఆడింది ఆట, పాడింది పాటే. ఎన్ని నిబంధనలున్నా ప్రస్తుత సిటీల్లో రెట్టింపు ధ్వని కాలుష్యం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ‘ నుంచి 100డిసిబెల్స్ వరకు ధ్వని వెలు వడచ్చు కానీ 150 నుంచి 200 డెసిబెల్స్ వరకు ధ్వని తరంగాలు జనం మీద ప్రభావం చూపిస్తున్నాయి. బోనాలు, గణేష్, దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఈ బాపతు కార్యక్రమాలు జరుగుతుండటం పరిపాటి. కానీ వాటిని నిర్దేశిత రూపంలో పరిమితంగా పాటించడంలోనే అసలు ఇబ్బంది తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితులు ఒక్క హైద రాబాద్ సిటీకే కాదు దేశమంతటా ఉన్నాయి. పల్లెటూర్లకి వ్యాపించాయి. అయితే గ్రామాల్లో అయితే పెద్దలు, పెత్తం దార్ల నియంత్రణ ఉంటుంది. కనుక కాస్త ఫర్వాలేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి పూట 55 డెసిబుల్స్, రాత్రిపూట 45 డెసిబుల్స్ మించ కూడదు. వైద్యశాస్త్ర ప్రకారం 85 డెసిబుల్స్ దాటితే వినికిడిలోపం వస్తుంది.

  Death Knell
Death Knell

ధ్వని కాలుష్యాన్ని ఎలా తట్టుకోగలం

100 డెసిబుల్స్ దాటితే గుండె వేగం పెరుగుతుంది. రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కు కూడా అవకాశముంది. పసిపిల్లలు, వృద్ధులు, హృద్రోగస్తులకు ప్రాణాంతకమే. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో 140 కోళ్లు డిజె శబ్దానికి గుండెపోటుతో చనిపోయాయని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. మూగజీవాలకు కూడా కీడు తెచ్చే శబ్దాన్ని మనుష్యులు తట్టుకోగలరనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. రాత్రి పది గంటల తర్వాత భక్తి పారంవశ్యంతో చేసే భజనలకూ నియంత్రణ ఉంది. మామూలు లౌడ్స్పీకర్లు వాడకూడదు. పక్కనే చంటాడు గుక్కపెట్టి ఏడుస్తున్నా చీకాకుపడే మనం అంతంత ధ్వని కాలుష్యాన్ని ఎలా తట్టుకోగలంఅనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి అంశం పోలీసులకు అప్పగిం చారు. 100 డెసిబెల్స్ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డిజె సిస్టమ్ల వినియోగంపై నిషేధం తప్పనిసరి. ‘డిజె’ శబ్దాలు వినోదపు హద్దులుదాటి అంతిమయాత్రకు ఆహ్వా నం పలుకుతోందని గుర్తించినప్పుడు వాటి నియంత్రణ, నిషేధంపై పూర్తి అధికారం పోలీసులకు ఇవ్వడం సర్వ మానవ శ్రేయస్సుకే. సంప్రదాయ వాయిద్యాలతో చేసు కునే వేడుకల్ని ప్రోత్సహించడం సర్వసమ్మతం కాగలదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు