Corruption : అవినీతి జాతరను కట్టడి చేయలేమా!

Follow Us: Google News Daily Hunt
Corruption
Corruption
FONT SIZE
GET APP

Corruption : మన దేశం, రాష్ట్రాలలో అవినీతికి పాల్పడుతున్న అధికారులకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక(ఏసీబీ) శాఖ దాడులు జరప డం అభినందనీయమే. కానీ శిక్షలు పడడంలో జాప్యం జరగడంతో అవినీతి బట్టబయలవుతోంది. కానీ ఆ అధికారులు భయపడటంలేదు. స్వతంత్ర తక్షణ విచారణ, కఠిన శిక్షలు అమలుచేసే వ్యవస్థ కా(రా) వాలి? అప్పుడే పాలన వ్యవస్థలో వేళ్లూనుకపోయినా అవి నీతి కూకటివేళ్లతో పెకిలించవచ్చు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవినీతి ఉందనే ఆరోపణలు వినిపించేవి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇటీవల వరుసగా అవినీతి నిరో ధక శాఖ (ఏసీబీ) నిర్వహిస్తున్న దాడులు ప్రజలను విస్మ యానికి గురిచేస్తున్నాయి. ఒక్కో అధికారి ఇంటిపై దాడి చేస్తే గుట్టల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి, ఖరీదైన విల్లాలు, లగ్జరీ కార్లు, విలువైన ప్లాట్లు, ఎకరాల కొద్దీ భూ ములు, బినామీ పెట్టుబడులు, భారీ బ్యాంకు డిపాజిట్లు వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, రోడ్లుభవనాలు, హెచ్ఎండీఏ, మెట్రోవాటర్ వర్క్స్,ర వాణా వంటి కీలక శాఖల్లో బయటపడుతున్న ఈ అక్రమ ఆస్తులు ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ఎంతలోతుగా వేళ్లూనుకుపో యిందో తెలియజేస్తున్నాయి.

Read Also : Inequalities : “అసమానతల అత్యవసర పరిస్థితి’లో ప్రపంచ మానవాళి

Corruption
Corruption

Corruption : అవినీతి అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి

అయితే ప్రజలను వేధిస్తున్న అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే దాడులు, అరెస్టులు జరుగు తున్నాయి. కానీ ఆ తర్వాత ఏమవుతోంది? కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో నత్తనడకన సాగుతుండగా, అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు ప్రభుత్వ ఖజానాకు ఎందుకు చేరడం లేదు? ఈ ప్రశ్నకు సమాజం సమాధానం కోరుతోంది. అంతర్జాతీయ పారదర్శకత సంస్థ అవినీతి అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా పేర్కొంటోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవ త్సరం ట్రిలియన్ల డాలర్ల మేర అవినీతి, లంచాల రూపం లో నష్టం జరుగుతోంది. భారతదేశంలో కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్, సీబీఐ, రాష్ట్ర ఏసీబీలు ప్రతి సంవత్స రం వందలాది కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, శిక్షలశాతం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. రాష్ట్రాల్లోనూ ఇదే పరి స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అధికారులు పట్టుబడుతున్నా, విచారణలు పూర్తవ్వడానికి ఐదునుంచి పది సంవత్సరాలు పట్టే సందర్భాలు ఉన్నాయి. కొందరు పదవీ విరమణ పొందేవరకు కూడా కేసులు తేల డం లేదు. ఈజాప్యమే అవినీతి అధికారుల్లో భయాన్ని తగ్గి స్తోంది. మరోవైపు అవినీతికి, రాజకీయ అవినీతి తోడవడం ఒక కారణమే!.

వ్యవస్థను మరింత బలోపేతం చేయాల

ప్రభుత్వ ఉద్యోగి సంపాదించే ప్రతిరూపాయి ప్రజల పన్నుల ద్వారానే వస్తుంది. అలాంటి వ్యక్తి చట్టవిరు ద్ధంగా వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెడితే, ఆ సంపద అసలు యజమానులు ప్రజలే. అయినప్పటికీ కేసులు పెం డింగ్లో ఉన్నాయనే కారణంతో ఆస్తులు సంవత్సరాల తర బడి అలాగే ఉండిపోతున్నాయి. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే శాశ్వత స్వాధీనం సాధ్యమైనా, విచా రణలను వేగవంతం చేసి అక్రమ ఆస్తులను ప్రభుత్వానికి జమ చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవ సరం ఉంది. స్వాధీనం చేసుకున్న నిధులను విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు వంటి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తే సమాజానికి ప్రత్యక్ష లాభం చేకూరుతుంది. అవినీతిని అరికట్టేందుకు కేవలం దాడులుసరిపోవు. అవినీతి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే భయం కలిగించే పాలనా వ్యవస్థ అవసరం. అందుకోసం కొన్ని కీలక సంస్కరణలు అత్యవసరం. ఆదాయానికి మించి న ఆస్తుల కేసుల కోసం ప్రత్యేక వేగవంతమైన కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆస్తుల వివరా లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. బినామీ ఆస్తుల గుర్తింపుకు కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, డిజిటల్ లావాదేవీల సమగ్ర విశ్లేషణను వినియోగించాలి. ప్రభుత్వ కొనుగోళ్లు, టెండర్లు పూర్తిగా పారదర్శక ఈగవర్నెన్స్ విధానంలో నిర్వహించాలి.

Corruption
Corruption

రాజకీయ అవినీతే

అవినీతిని బయటపెట్టే విజిల్ బ్లోయర్లకు సమర్థ రక్షణ కల్పించాలి. శిక్షలు ఖరారైన అధికారులకు జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ప్రజాప్రతినిధి పదవులకు అనర్హత వంటి కఠిన నిబం ధనలు అమలు చేయాలి. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు స్వతంత్ర అవినీతి నిరోధక సంస్థలు, వేగవంతమైన విచారణలు, కఠిన శిక్షల ద్వారా ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన వాస్తవం గ్రహించి మన దగ్గర అమలు చేయాలి. భారతదేశం కూడా అదే దిశగా మరింత దృఢ మైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిజా యితీకి గౌరవం పెరిగితేనే ప్రజ “స్వామ్యానికి బలం. అవినీతి వటవృక్షానికి తల్లి వేరు రాజకీయ అవినీతే దాన్ని సమూ లంగా నిర్మూలించినప్పుడే అభివృద్ధి సుసాధ్యం. అవినీతి అధికారి ఇంటి నుంచి కోట్ల రూపాయలు బయట పడటం వార్త మాత్రమే. కానీ ఆ కేసులో త్వరగా తీర్పు రావడం, అక్రమ ఆస్తులు ప్రభుత్వ ఖజానాకు చేరడం, నేరస్థుడికి కఠిన శిక్ష పడటం అదే నిజమైన ప్రజా న్యాయం. అరెస్టులు సంచలనం సృష్టిస్తాయి. శిక్షలే మార్పు తీసుకొస్తాయి. దాడులు అవినీతిపై తొలి అడుగు మాత్రమే. చివరి అడుగు మాత్రం వేగవంతమైన విచారణ, నిష్పాక్షిక న్యాయం, అక్రమ ఆస్తుల స్వాధీనం, నిజాయితీకి గౌరవం కల్పించే పాలనా వ్యవస్థ. ప్రజల కష్టార్జిత పన్నులతోనడిచే ప్రభుత్వ వ్యవస్థలో రాజకీయ నాయకుల కుంభకోణాలైనా, అధికారు ల అవినీతి అయినా జాతర కారాదు? నిజాయితీకి పరీక్ష అనే పరిస్థితి కొనసాగ కూడదు. చట్టం, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అనే నమ్మకం ప్రజల్లో బలపడా లంటే అవినీతికి తావులేని పాలన, ఆలస్యం లేని న్యాయం, రాజీ లేని శిక్షలు తప్పనిసరి. అదే నిజమైన సుపరిపాలనకు వునాది. అదే ప్రజాస్వామ్యానికి అసలైన గౌరవం.

-మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు