Health: షుగర్ పెరిగితే బాడీ లో ఏ పార్ట్ కు నష్టమో తెలుసా!

Health: షుగర్ పెరిగితే బాడీ లో ఏ పార్ట్ కు నష్టమో తెలుసా!

తీపి అంటే చాలా మందికి ప్రియమైనది. చాకొలేట్‌లు, బిస్కెట్‌లు, కేకులు, ఇతర బేకరీ ఫుడ్స్ చూసినప్పుడల్లా వాటిని తినాలనిపించక మానదు. అయితే, తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం శరీరానికి వివిధ రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. డయాబెటిస్, బరువు పెరగడం, హార్మోనల్ అసమతుల్యత, గుండె సంబంధిత వ్యాధులు ఇలా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం శరీరంలోని వివిధ అవయవాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisements

ప్రేగు ఆరోగ్యం

 తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న ప్రేగులలో సాధారణ చక్కెరలుగా (గ్లూకోజ్, ఫ్రక్టోజ్​గా) విచ్ఛిన్నమవుతాయి. దీంతో శరీరం గ్లూకోజ్​ను సులభంగా గ్రహిస్తుంది. కొంత మందికి ఫ్రక్టోజ్​ను గ్రహించడం కష్టంగా ఉంటుంది. ఇది తరచూ చక్కెర పానీయాలు, సోడాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల ప్రేగుల్లో ఫ్రక్టోజ్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరంతో పాటు ప్రేగు సిండ్రోమ్ లాంటి సమస్యకు దారితీస్తుంది.

నోటి ఆరోగ్యం

తీపి పదార్థాలు అధికంగా తీసుకున్నప్పుడు నోటిలోని బ్యాక్టీరియా చక్కెర అణువులను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆమ్లాలను నియంత్రించలేము. దీంతో పళ్ల ఎనామిల్ దెబ్బతినడం వల్ల దంత క్షయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

క్లోమం పై ప్రభావం

అధిక మొత్తంలో తీపి పదార్థాలు తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ స్థాయిని నిర్వహించడానికి క్లోమం ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. పరిమితి మించి తీపి పదార్థాలను తీసుకున్నప్పుడు క్లోమం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే టైప్ 2 డయాబెటిస్​కు దారితీస్తుంది.

మెదడు ఆరోగ్యం

మెదడుకు గ్లూకోజ్ ఇంధనం లాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇన్సులిన్ కూడా అధికం అవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి కొన్ని గంటల తర్వాత పడిపోతుంది. దీనివల్ల చిరాకు, అలసటతో పాటు మరిన్ని స్వీట్లు తినాలనిపిస్తోంది. మెదడు అనేది డోపమైన్ అనే హార్మోన్ విడుదలకు ప్రేరేపిస్తుంది. దీంతో తీపి పదార్థాలకు మరింత బానిసలుగా మారిపోతాం.

Health: షుగర్ పెరిగితే బాడీ లో ఏ పార్ట్ కు నష్టమో తెలుసా!

గుండె ఆరోగ్యం

తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం గుండెకు మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. షుగర్ అనేది ఇన్సులిన్ స్థాయిని అమాంతం పెంచడంతో పాటు రక్తపోటు, హార్ట్ బీట్​ని కూడా పెంచుతుంది.అందుకే తీపి పదార్థాలకు ముందు నుంచే దూరంగా ఉండడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. చక్కెర వాడకం, మధుమేహం గురించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Related Posts
తులసి మొక్క: పూజ, ఆరోగ్యం మరియు మనసుకు శాంతి
tulasi

తులసి భారతదేశంలో చాలా ముఖ్యమైన మొక్క. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది హిందూ సంప్రదాయంలో విశేషంగా పూజించబడుతుంది. ఆరోగ్యానికి మేలు: తులసి Read more

మందుల దుష్ప్రభావాలను ఎలా నివారించాలి?
Tablet

ప్రతి వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మందులు అవసరమవుతాయి. కానీ మందులు తీసుకునే ముందు వాటి ఉపయోగం, అవగాహన చాలా ముఖ్యం. మందులు మన శరీరంపై ప్రత్యక్ష Read more

డార్క్ చాకోలేట్ తో మరింత ఆరోగ్యం..
Dark choco

మీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా? అయితే, మీరు తెలియకుండానే మీ ఆరోగ్యానికి మంచి చేస్తున్నారు. ఇది ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటుంది.డార్క్ చాక్లెట్ లో ఐరన్, Read more

Horse Grams: ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా?
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా?

ఉలవలు మనకు ఎనెర్జీని అందించడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే విలువైన గింజధాన్యాల్లో ఒకటి. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో ఉలవలను సాంప్రదాయ ఆరోగ్య ఆహారంగా భావిస్తారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×