DMK invited...didn't go: Janasena

Janasena : డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Advertisements
 డీఎంకే ఆహ్వానించింది వెళ్లలేదు జనసేన

ఈ అంశంపై మా విధానం మాకు ఉంది

చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన

వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కత్రాలో 72 గంటల దిగ్బంధనం మాతా వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టు కత్రాలో 72 గంటల దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. స్థానిక Read more

దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు
దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో మరియు హైదరాబాద్ లోని ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఆయన సోదరుడు, Read more

బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం!
babu and bill gates

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ Read more

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లా
ajay kumar bhalla

గత కొంతకాలంగా మణిపూర్ లో శాంతిభద్రతలు క్షిణించాయి. ఆ రాష్ట్ర సీఎంపై ప్రజలు అసంతృప్తితో వున్నారు. దీంతో ఆ రాష్ట్రముపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా కొత్త Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×