Department of Finance

Department of Finance : ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సమీక్షలో ఆర్థిక శాఖ స్థితిగతుల పరిశీలన
హైదరాబాద్, మార్చి 22 :- రాష్ట్ర ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఆర్థికశాఖ స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.

Advertisements

కేంద్ర నిధుల సమీక్ష
కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రివ్యూ చేశారు. ముఖ్యంగా, కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు త్వరగా విడుదల అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సకాలంలో నిధుల విడుదలకు చర్యలు
కేంద్ర పథకాల సమగ్ర వివరాలను సమర్పించి, ఆర్థికశాఖ ద్వారా నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. మొత్తం 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు నిధులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు
హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Related Posts
వైసీపీ ‘యువత పోరు’ పోస్టర్ విడుదల
వైసీపీ 'యువత పోరు' పోస్టర్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల హామీల అమలు విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి ముఖ్యమైన Read more

Krishnadevarayalu: అమిత్ షాకు లేఖ రాసిన టీడీపీ ఎంపీ
అమిత్ షాకు లేఖ రాసిన టీడీపీ ఎంపీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన Read more

దిశ చట్టం పని చేసి ఉంటే.. మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవి? : హోంమంత్రి అనిత
Home Minister Anitha fires on ysrcp

అమరావతి: శాసన మండలిలో శాంతిభద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారా ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు. గతంలో Read more

Aghori: అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి
Aghori: అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి

కొంతకాలంగా అదృశ్యమైన శ్రీవర్షిణి అనే యువతి ఇప్పుడు కుటుంబానికి చేరుకుంది. గుజరాత్‌లో ఓ లేడీ అఘోరీ చెరలో ఉన్న ఆమెను గుర్తించి, పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×