DMK invited...didn't go: Janasena

Janasena : డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Advertisements
 డీఎంకే ఆహ్వానించింది వెళ్లలేదు జనసేన

ఈ అంశంపై మా విధానం మాకు ఉంది

చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts
Amit Shah:అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా
Amit Shah అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా

ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి అన్నాడీఎంకే – బీజేపీ కూటమి మరోసారి అధికారికంగా కుదిరింది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు Read more

Vijayasai Reddy: విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasai Reddy: విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరైనది ఏపీలోని లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల, Read more

ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం
ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటన రాష్ట్ర Read more

సింహాన్ని మహేష్ ను లాక్ చేశానన్నరాజమౌళి
సింహాన్ని మహేష్ ను లాక్ చేశానన్నరాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పెద్ద అంచనాలు ఉన్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×