Sabarimala room booking: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా శబరిమల గదుల బుకింగ్ కొత్త నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై వసతి గదులు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు.
Read also: Dussehra : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

దళారులకు చెక్ పెట్టేందుకు ఓటీపీ విధానం
గదుల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, దళారులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏజెన్సీలు, దళారుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టడానికి ఆన్‌లైన్ బుకింగ్‌లో ఓటీపీ విధానం ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల నిజమైన భక్తులకు మాత్రమే గదులు దక్కే అవకాశం లభిస్తుంది.
Sabarimala room booking: కేరళ హైకోర్టుకు విజిలెన్స్ నివేదిక
గదుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై దేవస్వం విజిలెన్స్ విభాగం ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన తర్వాత దేవస్వం కమిషనర్ త్వరలోనే కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కోర్టు అనుమతి లభించిన వెంటనే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: