Ontimitta Brahmotsavam: శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం

Follow Us: Google News Daily Hunt
Annual Brahmotsavams of Sri Kodandarama Swamy Begin
Annual Brahmotsavams of Sri Kodandarama Swamy Begin
FONT SIZE
GET APP

Ontimitta Brahmotsavam: ఒంటిమిట్ట, మార్చి 25 ప్రభాతవార్త: కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆధారంగా నిర్వహించారు.

Read also: Sri Rama Navami 2026: శ్రీరామనవమి నాడు ఇవి అస్సలు చేయకండి!

Annual Brahmotsavams of Sri Kodandarama Swamy Begin

Annual Brahmotsavams of Sri Kodandarama Swamy Begin

ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టిటిడి అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్స వానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.

Ontimitta Brahmotsavam: కార్యక్రమం విధానం

ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు. పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇది ఎ. ప్రశాంతి, డిఇ (ఎలక్ట్రికల్) సరస్వతి, పిఆర్ఓ ఎఫ్ఎసీ కుమారి నీలిమ, సూపరింటెండెంట్ హనుమంతయ్య.. ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు