Nayanthara Vignesh Shivan Tirumala visit: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార – విఘ్నేష్ శివన్ కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 9, 2026) ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Hansika Motwani: వదినపై, హీరోయిన్ హన్సిక పరువునష్టం దావా
Nayanthara Vignesh Shivan Tirumala visit: ఆకట్టుకున్న లుక్స్
తొలుత ఈ జంటకు ఆలయ అధికారులు ఈ ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నయనతార సాంప్రదాయబద్ధంగా మెరవగా, విఘ్నేష్ శివన్ పంచెకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. నయనతార-విఘ్నేష్ చూసి అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే భద్రతా సిబ్బంది నడుమ వారు క్షేమంగా దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: