Arudra Utsavam: స్వర్ణ రథంలో మల్లన్న వైభవం

Follow Us: Google News Daily Hunt
As part of the Arudra Utsavam, rituals including Rudrabhishekam and Annabhishekam were performed for the deity, followed by a procession on a golden chariot (Swarna Rathotsavam). The celebrations unfolded in a grand manner, filled with the chanting of Lord Shiva’s name and performances of traditional folk art forms.
As part of the Arudra Utsavam, rituals including Rudrabhishekam and Annabhishekam were performed for the deity, followed by a procession on a golden chariot (Swarna Rathotsavam). The celebrations unfolded in a grand manner, filled with the chanting of Lord Shiva’s name and performances of traditional folk art forms.
FONT SIZE
GET APP

Arudra Utsavam: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం నాడు శ్రీశైలం మల్లన్న వైభవం స్వర్ణ రథములో అలరారుతుంది. శ్రీస్వామిఅమ్మ వార్లు స్వర్ణ రథంలో భక్తులను కనువిందు చేశారు. మల్లన్న వైభవంతో భక్తులు మురిసిపోయారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని,ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.

Arudra Utsavam
Arudra Utsavam
Arudra Utsavam

Read Also :Diwali 2026: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?

Arudra Utsavam: అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమములో పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు