devara 11 day

దేవర 11 డేస్ కలెక్షన్స్

ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా 11 వ రోజు ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.

అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న విషయం కాదు, నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ‘దేవర’ చిత్రానికి ప్రతీ రోజు వీకెండ్ లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Related Posts
Rain:ఉపరితల ద్రోణి ప్రభావం తో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు
Rain:ఉపరితల ద్రోణి ప్రభావం తో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షపాతం విస్తారంగా నమోదవుతోంది. ముఖ్యంగా తమిళనాడులోని తూత్తుకూడి, కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ Read more

చంద్రబాబు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పిన పవన్
pawan babu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అనాగరికంగా ప్రవర్తించి, Read more

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప -2 ట్రైలర్
pushpa 2 trailer views

పుష్ప 2 ట్రైలర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ – Read more

ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్లు
BRS farmer protest initiation in Kodangal on 10th of this month

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా Read more