devara 11 day

దేవర 11 డేస్ కలెక్షన్స్

ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా 11 వ రోజు ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.

అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న విషయం కాదు, నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ‘దేవర’ చిత్రానికి ప్రతీ రోజు వీకెండ్ లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Related Posts
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
jayachandran singer dies

ప్రఖ్యాత గాయకుడు పి జయచంద్రన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 80 సంవత్సరాల వయసులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన Read more

హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – మల్లారెడ్డి
mallareddy hydraa

హైడ్రా ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని, ఫలితంగా రియల్ ఎస్టేట్ Read more

మహా కుంభ్‌లో తొక్కిసలాటకు కారణాలు
stampede

మౌని అమావాస్య రోజున పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతోనే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు అమృత స్నాన్ మహా కుంభం Read more

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది - కేటీఆర్. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *