Vijayawada Lodge Murder Case : విజయవాడ లాడ్జిలో దారుణం : స్నేహితుడి భార్యను తిట్టినందుకు ప్రాణం తీసిన పాత నేరస్థులు

Follow Us: Google News Daily Hunt
Vijayawada Lodge Murder Case
Vijayawada Lodge Murder Case
FONT SIZE
GET APP

Vijayawada Lodge Murder Case : విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ఇటీవల జరిగిన సంచలనాత్మక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జైలులో ఏర్పడిన పరిచయంతో స్నేహితులుగా మారిన పాత నేరస్థులు, మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగా తమ తోటి మిత్రుడినే దారుణంగా హత్య చేశారు. తమిళనాడుకు చెందిన ఎలాంగో, నరేష్, ముత్తు పాండియన్ (30), మరియు ఒక మైనర్ బాలుడు తమిళనాడులోని పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉండి జైలులో స్నేహితులుగా మారారు.ఒడిశాలోని బరంపురం వెళ్లే క్రమంలో వీరంతా చెన్నై నుంచి బయలుదేరి గత నెల 16న విజయవాడ చేరుకున్నారు.రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని రాత్రి కలిసి మద్యం సేవించారు.మద్యం మత్తులో ముత్తు పాండియన్, ఎలాంగో ప్రాణ స్నేహితుడి భార్యను అసభ్య పదజాలంతో దూషించాడు. వారించినప్పటికీ ఎలాంగోపై దాడికి దిగాడు.తీవ్ర ఆగ్రహానికి గురైన ఎలాంగో, నరేష్, బాలుడు కలిసి ముత్తు పాండియన్‌ను కత్తితో పొడిచి అక్కడికక్కడే హత్య చేశారు.

Read Also: New plan from the center soon : పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘిస్తే లైసెన్స్, RC రద్దు

Vijayawada Lodge Murder Case
Vijayawada Lodge Murder Case

Vijayawada Lodge Murder Case : హత్య అనంతరం నిందితుల పరారీ

హత్య జరిగిన మరుసటి రోజు (17వ తేదీన) నిందితులు గదిని ఖాళీ చేసి ఎవరికీ అనుమానం రాకుండా పరారయ్యారు.లాడ్జి సూపర్‌వైజర్ గది శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్న పాండియన్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.నిందితులు పోలీసులకు చిక్కకుండా విజయవాడ నుంచి చెన్నై, అక్కడి నుంచి రైలులో బరంపురం, గుడివాడ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. విజయవాడ సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు, నార్త్ ఏసీపీ సత్యానందం పర్యవేక్షణలో సీఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు.లాడ్జిలో ఇచ్చిన ఆధార్ కార్డు వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇన్స్టాగ్రామ్ మరియు ఫోన్ కాల్ డేటాను పోలీసులు సాంకేతికత సహాయంతో విశ్లేషించారు.నిందితులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల్లో ఉన్న మైనర్ బాలుడిని జువైనెల్ హోమ్‌కు తరలించి, మిగిలిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు