Raptadu Girl Attack: రాప్తాడు బాలికపై దాడి ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక సమాచారం వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో అతని కుడికాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. మోకాలి చిప్పలు పూర్తిగా చిద్రమవడంతో మోకాలి కింది భాగం నుంచి కుడికాలు తొలగించాల్సిన పరిస్థితి ఉండొచ్చని వివరించారు. మరోవైపు ఎడమకాలికి కూడా గాయాలు కావడంతో మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు.
Read Also:Rapthadu Incident: రాప్తాడు ఘటన నిందితుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎస్పీ కీలక ప్రకటన!
Raptadu Girl Attack: కుడికాలు తొలగించే అవకాశం!
బాలికపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన హేమంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతను ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. అయితే ఈ సమయంలో హేమంత్ లొంగిపోకుండా పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో హేమంత్ కాలికి సుమారు ఆరు బుల్లెట్లు తగిలినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కుడికాలుకు అయిన గాయాల తీవ్రత దృష్ట్యా దాన్ని తొలగించాల్సి రావచ్చని వైద్యులు సూచించినట్లు అధికారులు వెల్లడించారు. ఎడమకాలుపై పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాతే దాని పరిస్థితిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చికిత్స సమయంలో హేమంత్ ప్రాణభయంతో వైద్యులను వేడుకుంటున్నట్లు సమాచారం. బాలికపై దాడి ఘటనతో ఆగ్రహంగా ఉన్న బాధితురాలి బంధువులు, గ్రామస్తులు నిందితుడి పరిస్థితిపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు, నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: