CM Revanth Reddy Japan visit schedule finalized

Japan Tour: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

Japan Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉంటారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

 సీఎం రేవంత్ రెడ్డి జపాన్

వచ్చేనెల 15 నుండి 23 వరకు ఈ జపాన్ పర్యటన

ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జపాన్ కి మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. సీఎం ఏప్రిల్ నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారు. ఎప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటన కు వెల్లనున్నారు. ఏప్రిల్ 15 లోపు డీ లిమిటేషన్ పై హైదరాబాద్‌లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

Related Posts
రతన్ టాటా ఇక లేరు
ratan tata dies

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా Read more

విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

రాష్ట్రంలోని ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంటే, విద్యార్థులకు కనీస ఆహారాన్ని కూడా సమకూర్చలేని దుస్థితిలో ప్రభుత్వ వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపు నింపే Read more

ఆరు ఏంఎల్సి స్తనాలకు ఎన్నికల నోటిఫికేషన్
Central Election Commission

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శాసన మండలులలో ఫిబ్రవరి 27న జరగనున్న మూడు స్థానాలకు ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.దీనితో పట్టభద్రుల మరియు Read more

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
Freebies announced by political parties not a good practice: Supreme Court

ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *