CM Revanth Reddy Japan visit schedule finalized

Japan Tour: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

Japan Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉంటారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

Advertisements
 సీఎం రేవంత్ రెడ్డి జపాన్

వచ్చేనెల 15 నుండి 23 వరకు ఈ జపాన్ పర్యటన

ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జపాన్ కి మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. సీఎం ఏప్రిల్ నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారు. ఎప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటన కు వెల్లనున్నారు. ఏప్రిల్ 15 లోపు డీ లిమిటేషన్ పై హైదరాబాద్‌లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

Related Posts
వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై
వన్డేలకు ముష్ఫికర్ రహీమ్ గుడ్‌బై

చాంపియన్స్ ట్రోఫీ-2025 లో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన అతను నిర్ణయాన్ని ప్రకటించాడు. Read more

ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ ఘటన.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌..!
RG Medical College incident.. Petition in Supreme Court today.

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా Read more

china: చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌: కారణాలు
చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌: కారణాలు

చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ Read more

భవన నిర్మాణ అనుమతులకు కొత్త మార్గదర్శకాలు
భవన నిర్మాణ అనుమతులకు కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీయ-ధృవీకరణ పథకం కింద భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×