మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో నలభై ఏళ్లకు పైగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సృష్టించుకున్నారు. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందుకే, ఆయనకు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ అందించే జీవిత సాఫల్య పురస్కారం లభించడం విశేషం.

అభిమానుల గుండెల్లో చిరంజీవిగా చిరస్మరణీయం
చిరంజీవి ఒక సాధారణ ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని ప్రారంభించి, టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగిన తీరును కోట్లాది మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. నాట్యం, అభినయం, బహుముఖ ప్రజ్ఞతో సినీ రంగంలో తనదైన ముద్రవేశారు. ఒక్క నటుడిగానే కాకుండా, ప్రొడ్యూసర్, రాజకీయ నాయకుడు, సామాజిక సేవకుడిగా సైతం తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అందుకే, బ్రిటన్ పార్లమెంటులో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించడం తెలుగు చిత్రసీమకే గర్వకారణంగా మారింది.
పవన్ కళ్యాణ్ పంచుకున్న సందేశం
ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చిరంజీవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ఓ ప్రత్యేక సందేశాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. “నాకు జీవితంలో మార్గదర్శి మా అన్నయ్య చిరంజీవి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఫీలవుతాను. కళారంగానికి చేసిన సేవలకు గాను ఈ పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా ఉంది” అని పవన్ వ్యాఖ్యానించారు. 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్న చిరంజీవి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తి .చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షల మందికి సేవలు అందించడం పవన్ కళ్యాణ్ తన సందేశంలో అన్నయ్యకు మరిన్ని పురస్కారాలు లభించాలని ఆశిస్తున్నాను. ఆయన మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలు మరువలేనివి. తన అభినయం, నైపుణ్యం, సేవా దృక్పథం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని అందుకుంటున్నారు. ఈ అవార్డు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తుంది.