GATE 2027 Schedule:ఐదేళ్ల తర్వాత సిలబస్‌లో మార్పులు.. కొత్తగా ‘రోబోటిక్స్’ పేపర్ చేర్పు!

Follow Us: Google News Daily Hunt
IIT Madras GATE 2027 Exam Dates Notification Syllabus Changes
IIT Madras GATE 2027 Exam Dates Notification Syllabus Changes
FONT SIZE
GET APP

GATE 2027 Schedule: దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో (M.Tech/Ph.D) ప్రవేశాలు మరియు ప్రభుత్వ రంగా సంస్థల్లో (PSUs) ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ (IIT Madras) అధికారికంగా విడుదల చేసింది. ఈ సారి విద్యాశాఖ నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్-GATE తరఫున ఐఐటీ మద్రాస్ 45వ ఎడిషన్ GATE పరీక్షను నిర్వహించనుంది.

Read Also:AP EAMCET Counseling: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

GATE 2027 ముఖ్యమైన తేదీలు & షెడ్యూల్

GATE 2027 Schedule
  • దరఖాస్తుల ప్రారంభం: 2026 ఆగస్టు మధ్యలో అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • పరీక్ష తేదీలు: 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో (మొత్తం ఆరు రోజుల పాటు) పరీక్ష జరగనుంది.
  • పరీక్ష విధానం: ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం, మధ్యాహ్నం) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు.

దరఖాస్తుల్లో కొత్త మార్పులు

ఈసారి దరఖాస్తుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు సాంకేతిక ఆధారిత మార్పులు చేశారు. దరఖాస్తుదారుల అథెంటికేషన్‌ కోసం డిజిలాకర్ (DigiLocker) మరియు ముఖ గుర్తింపు ధ్రువీకరణ (Facial Recognition System) విధానాలను దరఖాస్తు పోర్టల్‌కు అనుసంధానించనున్నారు.

సిలబస్ సవరణ & కొత్తగా రోబోటిక్స్ పేపర్

  1. సిలబస్ మార్పు: ఐదేళ్ల తర్వాత తొలిసారిగా GATEలోని అన్ని పేపర్ల సిలబస్‌ను ఐఐటీ మద్రాస్ సవరించింది. పాత అంశాలను తొలగించి, కొన్ని కొత్త పాఠ్యాంశాలను చేర్చడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
  2. రోబోటిక్స్ & ఆటోమేషన్ (RA): కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా Robotics and Automation (RA) పేపర్‌ను ప్రవేశపెట్టారు.
  3. టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ (TF): టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ పేపర్‌ను ఇప్పుడు ఇంజినీరింగ్ సైన్సెస్ (XE) పరిధి కిందకు తీసుకువచ్చారు. మొత్తం పరీక్ష పేపర్ల సంఖ్య 30గానే కొనసాగుతుంది.

GATE 2027 Schedule: పరీక్ష విధానం & అర్హతలు (Exam Pattern & Eligibility)

  • అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు. బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థులు కూడా రాయవచ్చు.
  • మార్కుల కేటాయింపు: పరీక్ష సమయం 3 గంటలు. మొత్తం 65 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
  • నెగెటివ్ మార్కింగ్: కేవలం Multiple Choice Questions (MCQ) ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. MSQ, NAT ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇంగ్లీష్ మాధ్యమంలోనే పరీక్ష ఉంటుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు