AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల!

Follow Us: Google News Daily Hunt
AP Inter Supplementary RC RV Results 2026
AP Inter Supplementary RC RV Results 2026
FONT SIZE
GET APP

AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రీకౌంటింగ్ (RC), రీవెరిఫికేషన్ (RV) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మే–జూన్ నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల మార్కులపై సందేహాలుండి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను పరిశీలించి, బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఫలితాలను ప్రకటించారు.

Read Also :Re-NEET 2026 final answer key: రీ-నీట్ 2026 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. వివరాలు ఇవే!

AP Inter Supplementary Results

ఫలితాలను ఎలా పరిశీలించుకోవాలి?

జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులకు చెందిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు కింది వివరాలను సిద్ధం ఉంచుకోవాలి:

  1. ఇంటర్ రోల్ నంబర్ (Roll Number)
  2. అక్నాలెడ్జ్‌మెంట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number)
  3. పుట్టిన తేదీ (Date of Birth)

పై వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోని bie.ap.gov.in నిర్దేశిత కాలమ్‌లలో నమోదు చేసి విద్యార్థులు తమ మార్కుల వివరాలను, ఫలితాల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు సూచించింది.

AP Inter Supplementary Results: సవరించిన మార్కుల మెమోలు

రీవెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం ఏవైనా మార్కులలో మార్పులు (మార్కులు పెరిగిన లేదా తగ్గినట్లయితే) జరిగిన విద్యార్థులకు సంబంధించిన సవరించిన సరికొత్త మార్కుల మెమోలను (Revised Marks Memos) సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్‌లకు పంపనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ తమ కాలేజీల ద్వారా ఈ కొత్త మెమోలను త్వరలోనే పొందువచ్చని తెలిపారు. కాగా, ఈ ఏడాది మే 21 నుంచి జూన్‌ 4 వరకు జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ప్రధాన ఫలితాలు జూన్‌ 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు కూడా రావడంతో విద్యార్థులు తమ మార్కులను సరిచూసుకుని తదుపరి విద్యా ప్రవేశాలకు సిద్ధం కావాలని బోర్డు సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు