ట్రక్కును ఢీకొట్టిన కారు.. 8మంది దుర్మరణం

ట్రక్కును ఢీకొట్టిన కారు.. 8మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో 13మంది గాయపడ్డారు. ఈ సోమవారం తెల్లవారుజామున అతి వేగంగా వెళ్తున్న కారు, ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిద్ధి-బహ్రీ రోడ్డులోని ఉపని గ్రామం సమీపంలోని పెట్రోల్ పంపు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాత్రి సమయమైనందున, దృశ్యమానం తక్కువగా ఉండడం ఒక కారణం కావొచ్చు వేగంతో పాటు, రోడ్డు పరిస్థితులు కూడా ప్రమాదానికి దోహదం చేసాయని అనుమానాలు ఉన్నాయి.

Advertisements
ట్రక్కును ఢీకొట్టిన కారు.. 8మంది దుర్మరణం


13 మంది గాయపడ్డారు
కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారీ మాట్లాడుతూ.. నిన్న రాత్రి సిద్ధిలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదం గురించి మాకు సమాచారం అందిందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు. సంఘటనా స్థలం పూర్తిగా రక్తసిక్తంగా మారింది. దాదాపు 13 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది మరణించారని వివరించారు.. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన 13 మందిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు సిద్ధి డీఎస్పీ గాయత్రి తివారీ సంఘటనపై విచారణ చేపట్టారు.

Related Posts
లైఫ్‌ను రిస్క్ చేస్తున్న విద్యార్థులు .. వీడియో వైరల్!
risk life

కొన్నిసార్లు పరిస్థితులు మన సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. మంచి భవిష్యత్తు కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా Read more

America: భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?
భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత సంతతి రీసర్చ్ స్కాలర్ బదర్ ఖాన్ సురిని అమెరికానుంచి బహిష్కరించవద్దని ఆదేశిస్తూ అమెరికన్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. Read more

ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more

Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు
మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై Read more

×