risk life

లైఫ్‌ను రిస్క్ చేస్తున్న విద్యార్థులు .. వీడియో వైరల్!

కొన్నిసార్లు పరిస్థితులు మన సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. మంచి భవిష్యత్తు కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చదువుకోవాలనే సంకల్పంతో ఉన్న కొందరు విద్యార్థులు.. నదీలోయను దాటడానికి సైతం వెనుకాడట్లేదు. ప్రతిరోజు లోయను దాటుతూ స్కూల్‌కి వెళ్లి వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా రోజూ ట్రాలీపై ప్రయాణిస్తూ చదువును కొనసాగిస్తున్నారు. ఎలాంటి భయమూ లేకుండా, సునాయాసంగా వారు నదిని దాటడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్‌ విద్యార్థులకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisements

ఉత్తరాఖండ్‌లోని మున్సియారి గ్రామంలోని స్కూల్ గర్ల్స్.. స్కూల్‌కి వెళ్లడానికి ఎదురవుతున్న సవాళ్లను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ‘త్రిభ్‌చౌహాన్’ అనే హ్యాండిల నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. నదీలోయను దాటడానికి ట్రాలీ లాగుతున్న విద్యార్థులను ఓ వ్యక్తి పలకరించాడు. అభివృద్ధి అంటే ఇలాగేనా ఉండేది? అనే మాటలతో వీడియో ప్రారంభం అవుతోంది. ‘2025లో కూడా మన వ్యవస్థ ఎలా ఉందో మీరే చూడండి. భేటీ బచావో, భేటీ పడావో వంటి పథకాలు ఎన్ని వచ్చినా కూడా బాలికల పరిస్థితి ఏం మారడం లేదు’ అంటూ చెప్పుకొచ్చి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

Related Posts
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై చర్చ : ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే
Waqf Bill వక్ఫ్ బిల్లుపై చర్చ ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

Waqf Bill : వక్ఫ్ బిల్లుపై చర్చ : ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే 2024లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది పార్లమెంటరీ వ్యవహారాల Read more

దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్
దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్

30 సంవత్సరాల క్రితం ఓ సమయం గుర్తు చేసుకోండి. ఓ యువ, మహత్వాకాంక్షి నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు, తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద కలలు కంటున్నారు. Read more

దుమారం రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు
రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు కర్ణాటక స్పీకర్ వ్యాఖ్యలు దుమారం

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖాదర్‌ చేసిన తాజా ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రతినిధుల కోసం అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన Read more

H1-B visa :అమెరికా దాటి వెళ్లాలనుకునే వారు ఆలోచించుకోవాలి: ఇమ్మిగ్రేషన్ అటార్నీ
H1-B visa

హెచ్-1బీ వీసాదారులు (H1-B visa), వారి భాగస్వాములు (F-1 Visa Holders), అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 Read more

×