EPF updates:పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీసుకువచ్చిన ఈ సరికొత్త విధానంతో ఎలాంటి దరఖాస్తులు లేకుండానే నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఎన్నో రోజులుగా మూలనపడిన ఇన్‌యాక్టివ్ అకౌంట్లలోని నిధులను సులభంగా వెనక్కి ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట
ఆగస్టు నుంచి ఈ సరికొత్త ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి ఫారమ్‌లు నింపాల్సిన అవసరం లేకుండానే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ అవుతుంది. మొదట వెయ్యి రూపాయల వరకు నిల్వ ఉన్న ఖాతాలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న ఖాతాలకు కూడా ఈ రీఫండ్ వర్తింపజేస్తారు.
EPF updates:అకౌంట్లు సులభంగా క్లియర్
ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు తిరిగి పొందవచ్చు. ఈ అద్భుతమైన మార్పు వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. ఏలాంటి శ్రమ లేకుండానే మీ సొమ్ము మీ చేతికి సులభంగా చేరుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: