📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 21 మార్చి 2026 

Author Icon By Digital
Updated: March 21, 2026 • 7:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 21 మార్చి 2026

మేష రాశి

గతంలో మీ వలన సహాయం పొందిన వ్యక్తులు అవసరమైన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల మీ మనసులో కొంత నిరాశ, ఆవేదన కలగవచ్చు. అయితే దీనిని బలహీనతగా భావించకుండా జీవితపాఠంగా స్వీకరించడం ఉత్తమం. ఎవరు నిజంగా మీకు తమసహకారం అందిస్తారు, ఎవరు అవసరానికే దగ్గరవుతారు అన్న విషయమై స్పష్టత కలుగుతుంది.

…ఇంకా చదవండి

వృషభ రాశి

బంధువర్గం అతి జోక్యం కారణంగా కుటుంబ విషయాలలో చిన్నచిన్న అపార్థాలు, కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం కన్నా, అవసరమైన వారికి మాత్రమే పరిమితంగా చెప్పడం మంచిది. మీ కుటుంబ వ్యవహారాల్లో బయటి వాళ్ల ప్రభావం అధికమవకుండా చూసుకోవాలి.

…ఇంకా చదవండి

మిథున రాశి

అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం మీ ముందుకొస్తుంది. ఒంటరిగా అన్నింటినీ మోసుకెళ్లే ప్రయత్నం చేయడం కంటే పనులను సమర్థంగా విభజించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

పుణ్యక్షేత్రాల సందర్శన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, దైవచింతనలో కొంత సమయం గడపడం ద్వారా మీ మనసుకు విశేషమైన ప్రశాంతత లభిస్తుంది. గత కొంతకాలంగా మనసులో పేరుకుపోయిన ఆందోళనలు తగ్గి, ఆత్మీయమైన నిశ్శబ్దం మీలో నెలకొంటుంది. పెద్దల సాన్నిధ్యం, పూజా కార్యక్రమాలు, శుభసంకల్పాలు ఈ రోజు మీకు శుభప్రదంగా నిలుస్తాయి.

…ఇంకా చదవండి

సింహ రాశి

లిఖితపూర్వక ఒప్పందాలు, పత్రాలు, రాతపూర్వక హామీలు వంటి విషయాలలో వక్రభాష్యాలు తీసుకొచ్చే తుంటరి వర్గం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు స్పష్టంగా చెప్పిన విషయాన్నే వేరే విధంగా అర్థం చేసుకునే లేదా చూపించే వ్యక్తులు చుట్టూ ఉండే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

బరువు బాధ్యతల నుండి కొంతకాలం దూరంగా ఉండి, ఒంటరిగా ప్రశాంతంగా గడపాలని మనసు కోరుతుంది. ఇటీవలి కాలంలో పనులు, కుటుంబ బాధ్యతలు, ఆలోచనల ఒత్తిడి మీపై ప్రభావం చూపినట్లుంది.

…ఇంకా చదవండి

తులా రాశి

కార్యాలయంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు మీరు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటివరకు వాయిదా పడిన ఫైళ్లు, నివేదికలు, సమీక్షలు లేదా బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

సంస్థాగతంగా పురోభివృద్ధి సాధించటం ప్రస్తుతం అత్యవసర కర్తవ్యమని మీరు భావిస్తారు. వ్యక్తిగత అభిరుచుల కంటే సమిష్టి ప్రయోజనాన్ని ముందుకు తెచ్చే స్వభావం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఉన్న సంస్థ, కుటుంబ వ్యవస్థ, లేదా వృత్తి వర్గం అభివృద్ధి చెందాలంటే ఏ చర్యలు అవసరమో వాటిపై లోతుగా ఆలోచిస్తారు.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

మంచి మాటకారితనం, చాతుర్యం, సమయస్ఫూర్తి వలన దూరప్రాంతాల నుండి రావలసిన ధనం కొంతవరకు చేతికందే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపులు, నిలిచిపోయిన బకాయిలు, లేదా మాటల దశలో ఉన్న లావాదేవీలు ముందుకు కదలవచ్చు.

…ఇంకా చదవండి

మకర రాశి

నిజంగా మీ శ్రేయస్సు కోరుకునే వారు ఎవరు, అవసరార్థం దగ్గరవుతున్న వారు ఎవరు అన్నది స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటివరకు సందేహాస్పదంగా కనిపించిన వ్యక్తుల వైఖరి ఈ రోజు మరింత స్పష్టతనిస్తుంది.

…ఇంకా చదవండి

కుంభ రాశి

ముఖ్యమైన పనులు నిదానంగా అయినప్పటికీ స్థిరంగా పూర్తిచేసే స్వభావం ఈ రోజు కనిపిస్తుంది. తొందరపడకుండా ప్రతి పనిని క్రమబద్ధంగా ముగించాలని భావిస్తారు. మీరు తీసుకునే పద్ధతి కొంచెం నెమ్మదిగా ఉన్నా లోపాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు.

…ఇంకా చదవండి

మీన రాశి

నామమాత్రపు విజయాలు సాధించినా వాటిని పూర్తిస్థాయి విజయం గా భావించకుండా మరింత జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన రోజు ఇది. చేసిన పనులకు గుర్తింపు కొంతవరకు లభించినప్పటికీ ఆశించినంతగా ప్రయోజనం దక్కకపోవచ్చు.

…ఇంకా చదవండి

వారం – వర్జ్యం

తేది : 21-03-2026,శనివారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు, శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె

తదియ రా.11.56, అశ్వని రా.12.37
వర్జ్యం: మ.3.15-4.44
దు.ము : ఉ.6.10-7.47
శుభముహూర్తం : ఉ.8.20-9.00 , రా.8.55 – 10.24
రాహుకాలం: ఉ.9.00-10.30

breaking news kanya rashi kanya rashi today kumbha rashi Latest Telugu News meena rashi mithuna rashi news latest news rashipalalu simha rashi TeluguNews today rashipalalu todaynews tula rashi tula rashi today tula rashi today in telugu vrushabha rashi vrushchika rashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.