IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.అయితే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ప్రదర్శనను మరిచిపోలేనిదిగా మార్చుకున్నాడు.6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కొన్ని తప్పులు చేశాడు.చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేశాడు.

Advertisements

స్టేడియంలో సరదాగా

మ్యాచ్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్టేడియంలో సరదాగా హాస్యప్రధంగా కనిపించారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.18వ ఓవర్‌లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో,రెండో బంతిని ఢిల్లీ ఆటగాడు కుల్దీప్ యాదవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది.రిషబ్ పంత్ స్టంప్స్‌పై బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు, కానీ కుల్దీప్ క్రీజులోనే ఉన్నాడు.
సరదాగా పంత్, కుల్దీప్‌ను క్రీజు వెలుపలికి నెట్టి, వికెట్లపై బెయిల్స్ వేయడం జరిగింది.
ఇది మ్యాచ్ సమయంలో నవ్వు తెప్పించే ఘటనగా మారింది.

హై-వోల్టేజ్ పోరు

మ్యాచ్ పూర్తిగా లక్నో చేతి లోనే ఉన్నా, చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఓటమిని తప్పించుకోలేకపోయింది.టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.లక్నో బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (75), మిచెల్ మార్ష్ (72) చెలరేగి ఆడారు.లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత తడబడినా, చివరి క్షణాల్లో మ్యాచ్ ఉత్కంఠ రేగింది.అశుతోష్ శర్మ (66) చివరి ఓవర్‌లో సిక్సర్ బాదడంతో, ఢిల్లీ మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కీలకమైన తప్పిదాలు చేశాడు.ఫీల్డింగ్‌లో కూడా కొన్ని అవకాశాలను కోల్పోయాడు.ఈ ఓటమితో రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్‌లలో పంత్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటాడా,లేదా అతని కెప్టెన్సీపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts
తల్లిదండ్రుల అనుమతితో సోషల్ మీడియా!
తల్లిదండ్రుల అనుమతితో సోషల్ మీడియా!

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ నిబంధనల (DPDP) ముసాయిదా ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఇప్పుడు Read more

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో దాడి
Amritsar Golden Temple

పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడగా, Read more

మూడ‌వ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర ఆమోదం
ashwini vaishnaw

ఇటీవల కాలంలో శ్రీహ‌రికోటలో చారిత్మాక ప్రయోగాలు జరుగుతూ ప్రపంచ పటంలో నిలిచింది. దీనితో భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రానికి ప్రాధ్యానత పెరిగింది. శ్రీహ‌రికోటలో మూడ‌వ లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు Read more

పార్ల‌మెంట్ సీట్ల పై స్టాలిన్ కేంద్రానికి విజ్ఞప్తి
పార్ల‌మెంట్ సీట్ల పై స్టాలిన్ కేంద్రానికి విజ్ఞప్తి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 72వ పుట్టిన రోజు సందర్భంగా వీడియో సందేశం ద్వారా తన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన విషయాన్ని తెలిపారు. ఆయన, పార్లమెంట్ సీట్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×