చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైడాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హి వైడాంగ్ అరెస్టు వార్త ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది. అయితే, గతంలో చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ ఫూ అదృశ్యమ య్యారు, తదనంతరం రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులను భారీ ఎత్తున అరెస్టు చేసినట్లు సమాచారం.

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆందోళన
ఇటీవలి కాలంలో, చైనా, పాకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌కు ముప్పుగా మారుతున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాకిస్థాన్ వినియోగిస్తోందని, ఈ రెండు దేశాల కుట్రపూరిత సంబంధాలను భారత్ అంగీకరించాల్సి ఉందని ఆయన సూచించారు. అంతేకాకుండా, చైనా-పాక్ సంబంధాలపై భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలో ఉన్నతాధికారుల అరెస్టులు, అదృశ్యాలు ఆ దేశ రాజకీయ, సైనిక వ్యవస్థలో మార్పులను సూచిస్తున్నాయి.