ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు త్వరలో వెల్లడవుతుండగా, ఇప్పుడు ఇంకో ఐదు ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీలు
ఈ నెల 29న ఏపీ శాసనమండలిలో ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది.వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీపై ఇవాళ మండలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీపై ఇవాళ మండలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఈ ఎమ్మెల్సీ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో, మండలి వారి రిటైర్మెంట్‌ను నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉండటంతో, ఎన్నికల కమిషన్ ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం:
మార్చి 4: నోటిఫికేషన్ విడుదల
మార్చి 10: నామినేషన్ల స్వీకరణకు చివరి తేది
మార్చి 11: నామినేషన్ల పరిశీలన
మార్చి 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 20: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలుసాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.అదే రోజు ఫలితాల ప్రకటన.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఏపీలో ఇంకో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండగా, రాజకీయంగా ఈ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. మార్చి 20న ఓటింగ్ పూర్తయి అదే రోజు ఫలితాలు వెల్లడికానుండటంతో, అన్ని పార్టీలూ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
శాసన మండలి
భారత రాజ్యాగంలోని ఆర్టికల్ 169 ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు, రద్దు అంశాలను వివరిస్తోంది. శాసన మండలి ఉండాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం.1958లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటైంది. అయితే, 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత 2007లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మండలి ఏర్పాటయింది.ప్రస్తుతం దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్) మాత్రమే శాసన మండళ్లున్నాయి.మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో మూడో వంతు సంఖ్యతో శాసన మండలి ఏర్పాటవుతుంది. ఇది శాశ్వత సభ. సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు మొత్తం సభ్యుల్లో మూడోవంతు మంది పదవీ కాలం ముగుస్తుంది.మొత్తం సంఖ్యలోమూడో వంతు సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు, మరో మూడో వంతు సభ్యులు ఎమ్మెల్యేల ద్వారా, ఆరోవంతు సభ్యులు గవర్నర్ ద్వారా నామినేట్ అవుతారు. పన్నెండో వంతు సభ్యులు పట్టభద్రులు, మరో పన్నెండు వంతు సభ్యులు ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు.