టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) గోశాలలో గోవుల మరణాలపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. భూమన చేసిన వ్యాఖ్యలు అసత్యమని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

హోం మంత్రి వంగలపూడి అనిత స్పందన
భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూమనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. . తిరుమల గోశాలలో 100 ఆవులు చనిపోయాయని ఆయన చేసిన వ్యాఖ్యలను వంగలపూడి అనిత ఖండించారు. కావాలని టీటీడీ పైన కుట్రలు చేస్తున్నారని అసత్య ప్రచారాలతో టిటిడి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అనిత మండిపడ్డారు. టీటీడీకి సంబంధించిన ఎస్ వి గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ పనులు చేస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అక్కడ ఉన్న సుమారు 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి మరీ పర్యవేక్షిస్తున్నారు అని వంగలపూడి అనిత వెల్లడించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తిరుమల ఏడుకొండలు ఐదు కొండలుగా మార్చేందుకు కుట్ర చేశాడని, తిరుమలలో అన్యమత ప్రచారం జరగటానికి కారణం ఆయనేనని, ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి పైన చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదన్నారు వంగలపూడి అనిత. భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి పైన చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదన్నారు వంగలపూడి అనిత.
టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు విమర్శలు
టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు భూమనపై తీవ్రంగా స్పందించారు. భూమన హిందువే కాదని, ఆయన చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. భూమనపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read also: Perni Nani: సస్పెండ్ అయిన పోలీసుల విషయంలో పేర్ని నాని స్పందన