Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల GLI, GPF బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి బకాయిల డబ్బులు జమవుతుండగా, మొత్తం రూ. 6,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

379541 good news for telangana govt employees working in ap

ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు కూడా ధృవీకరించారు. తమకు బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు, సీఎస్ విజయానంద్‌కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నిర్ణయం

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యమైన విషయం తెలిసిందే. అనేక ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. అయితే, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గతవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేయగా, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ విడుదలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు స్పందిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జేఏసీ ఛైర్మన్ కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు విసిగిపోయారు. అందుకే ఎన్నికల్లో వారిని సాగనంపారు అని పేర్కొన్నారు. జనవరి 2024లో కూడా ప్రభుత్వం రూ.1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేయడం ద్వారా, ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ డబ్బులు లభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కూడా చర్చించారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎంపీడీవోలను నేరుగా నియమించే విధానాన్ని రద్దు చేసి, పరిపాలన అధికారులకు 50% ఖాళీలు కేటాయించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాలు ముందుగానే జమ చేయడం మరో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉద్యోగుల జీతాల కూడా ముందుగానే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Related Posts
మహాకుంభ యాత్రికుల భద్రతను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాబోయే మహాకుంభ ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులకు భద్రతా చర్యలు, మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్, Read more

ఏపీ మున్సిపాలిటీలకు నారాయణ శుభవార్త
మున్సిపాలిటీలకు స్వపరిపాలన హక్కు – మంత్రి నారాయణ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీల అభివృద్ధికి శుభవార్త చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మున్సిపల్ శాఖకు మరియు సీఆర్డీఏ Read more

భార్య భువనేశ్వరికి చంద్రబాబు ఉమెన్స్ డే గిఫ్ట్
Chandrababu's Women's Day gift to wife Bhuvaneswari

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి కి చీర కొనుగోలు చేశారు. జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా తన భార్యకు ఆయన గిఫ్ట్ Read more

గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి – జగన్
jagan gurla

విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైస్ జగన్ అన్నారు. గుర్ల‌లో సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *