Cyclone Arnab: అర్నాబ్ తుపాను.. ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచనలు

Follow Us: Google News Daily Hunt
Cyclone Arnab
Cyclone Arnab
FONT SIZE
GET APP

Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు బాసటగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు!

Cyclone Arnab
Cyclone Nivar: Y.S. Jagan’s directives to the government

Cyclone Arnab: ప్రభుత్వానికి డిమాండ్

తుపాను సమయంలో ప్రభుత్వం ప్రాణనష్టాన్ని నివారించడానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పునరావాస శిబిరాల్లో నివాసముంటున్న వారికి నాణ్యమైన ఆహారం, మంచినీరు, మందులతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను అందించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. అలాగే, నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ, పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు.

పెనుగాలులు: రద్దయిన రైళ్లు, విమాన సర్వీసులు

మరోవైపు అర్నాబ్ తుపాను గంటకు 135 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో తీరం దాటింది. మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీవ్రత కారణంగా భద్రతా చర్యల్లో భాగంగా 100కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయానికి చెందిన 28 సర్వీసులతో పాటు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి నడవాల్సిన అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు