Vizianagaram news: అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పెద్దగడ్డలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున పారాది వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, అనంతరం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించి విజయనగరం తిరిగి వస్తుండగా బుధవారం భూషాయవలస పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also: Pawan Kalyan: అర్నబ్ తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు స్పష్టమైన సూచనలు!

Vizianagaram news: సురక్షితంగా బయటపడిన సిబ్బంది
కలెక్టర్ ప్రయాణిస్తున్న కారును బుషాయవలస పెట్రోల్ బంక్ నుండి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ఎడమవైపు పూర్తిగా దెబ్బతింది. అయితే, కలెక్టర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కృష్ణ, సీసీ దుర్గాప్రసాద్, గన్‌మన్ రాము, డఫేదార్ రమేష్, సమాచార శాఖ వీడియోగ్రాఫర్ సన్యాసినాయుడుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం అనంతరం లారీని ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను సిబ్బంది వెంబడించారు. రాంభద్రపురం, కొట్టక్కి చెక్‌పోస్టుల వద్ద ఆగకుండా వెళ్లిన లారీ డ్రైవర్, చివరకు పీకోనవలస చెక్‌పోస్టు సమీపంలో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: