Pigeon Pea : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పును రూ.100కే పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రత్యేక పథకాన్ని ఆరు నెలల పాటు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెలా ఒక్కో రేషన్ కార్డుదారుడికి కిలో చొప్పున కందిపప్పు అందించనున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనివ్వనుంది. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,500 టన్నుల కందిపప్పు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో కందిపప్పును అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సరఫరా వ్యవస్థపై దృష్టి సారించింది.
Read Also : బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

లక్ష టన్నుల ముడి కందులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి
రాష్ట్రంలో కందిపప్పు పంపిణీకి అవసరమైన నిల్వలను సమకూర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీకి లక్ష టన్నుల ముడి కందులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముడి కందులను సేకరించి, వాటిని కందిపప్పుగా మార్చి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కందిపప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లీటర్ పామాయిల్‌ను రూ.125కు, కిలో గోధుమ పిండిని రూ.25కే పంపిణీ చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రేషన్ కార్డుదారులకు ఒకే చోట పలు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు లభించనున్నాయి. పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే సరుకుల పంపిణీ ప్రారంభ తేదీ, విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :