Suicide awareness: ఆత్మహత్యే మార్గం కాదు.. ఎస్పీ

Follow Us: Google News Daily Hunt
Suicide is not the solution
Suicide is not the solution
FONT SIZE
GET APP

Suicide awareness: “ఆత్మహత్య అనేది ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు చట్టబద్ధమైన, సామాజికమైన పరిష్కారం ఉంటుంది. కష్టాలు శాశ్వతం కావు. సరైన సమయంలో సహాయం కోరితే ప్రతి సమస్యను అధిగమించవచ్చు” అని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో మీడియా సమక్షంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) Ch. సౌజన్య, టౌన్ ASP దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి. శ్రీనివాసరావులతో కలిసి ఆంటీ సూసైడ్ అవేర్‌నెస్ పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రేమలో విఫలం, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సంబంధిత సమస్యలు వంటి కారణాలతో నిరాశకు గురయ్యే వారు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడాలని సూచించారు.

Read also; Chiranjeevi Condoles Mudragada Death: ముద్రగడ పద్మనాభం మృతిపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి

Suicide awareness: ఒంటరిగా బాధపడకండి.. సహాయం కోరండి

మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారు కేంద్ర ప్రభుత్వ టెలీ-మానస్, ఉచిత మానసిక ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. 14416 లేదా 1800-891-4416 నంబర్లకు 24 గంటలూ కాల్ చేసి నిపుణుల సలహా పొందవచ్చని వివరించారు. అలాగే, ఆత్మహత్యకు సంబంధించిన సంకేతాలు కనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం కోసం 112, మహిళల సహాయానికి 181, చిన్నారుల కోసం 1098, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. చివరగా జిల్లా ఎస్‌పీ, “ప్రతి జీవితం అమూల్యమైనది. కష్టకాలంలో సహాయం కోరడం బలహీనత కాదు, అది ధైర్యానికి నిదర్శనం. జీవితం విలువైనది… జీవితాన్ని సార్థకం చేసుకోండి, ఆత్మహత్యకు దూరంగా ఉండండి.” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ పాపారావు తదితరులు పాల్గొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు